Dear Uma Pre Release Event
ఎంటర్‌టైన్మెంట్

Dear Uma: సమాజానికి ఈ సినిమా అవసరం ఉందట!

Dear Uma: సుమయ రెడ్డి హీరోయిన్‌గా నటిస్తూ నిర్మించిన చిత్రం ‘డియర్ ఉమ’. ఈ సినిమాకు ఆమె రచయిత కూడా. ఏప్రిల్ 18న విడుదల కాబోతున్న ఈ సినిమాకు సాయి రాజేష్ మహాదేవ్ స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. పృథ్వీ అంబర్ హీరోగా నటించారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. ఇక చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను మేకర్స్ గ్రాండ్‌గా నిర్వహించారు.

Also Read- Single Song: దిల్ రాజుని అలా.. అల్లు అరవింద్‌ని ఇలా.. ఆ స్టెప్ అరవింద్‌దేనా?

ఈ కార్యక్రమంలో సుమయ రెడ్డి మాట్లాడుతూ, నేను అనంతపూర్ నుంచి సినిమాపై ఉన్న ప్యాషన్‌తో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాను. ‘డియర్ ఉమ’ సినిమాకు కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచి గుమ్మడి కాయ కొట్టే వరకు మీడియా ఎంతో సపోర్ట్ అందించింది. తెలుగమ్మాయిలు ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి వస్తున్నారు. నేను ఇందులో హీరోయిన్‌గా నటిస్తూనే, ఓ అడుగు ముందుకు వేసి సినిమాను నిర్మించాను. నాకు అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంతకు ముందు నేను రాసిన, తీసిన షార్ట్ ఫిల్మ్‌కు మంచి ఆదరణ దక్కింది. ఆ తర్వాత సాయి రాజేష్‌తో మళ్లీ ‘డియర్ ఉమ’కు పని చేశాం. నాకు అండగా నిలిచిన మధు, చక్రవర్తిలకు థాంక్స్. నవీన్ వల్లే రథన్ మా ప్రాజెక్టులోకి వచ్చారు. ప్రతీ ఒక్కరూ వారి వారి డ్రీమ్ ప్రాజెక్టుకి పని చేసినట్టుగానే ఈ సినిమాకు వర్క్ చేశారు. ప్రతీ మగాడి విజయం వెనుక ఆడది ఉన్నట్టే, ప్రతీ అమ్మాయి విజయం వెనకాల ఓ అబ్బాయి ఉంటాడు. నగేష్ ఈ ప్రాజెక్ట్ స్టార్టింగ్ నుంచీ నాతో పాటే ఉన్నాడు. మీ కోసం మీరు నిలబడకపోతే, మీ కోసం ఎవరూ నిలబడరు. ఎంతో కష్టపడి ఈ ప్రాజెక్ట్‌ను ఇక్కడి వరకు తీసుకు వచ్చాం. ఏప్రిల్ 18న వస్తున్న ఈ సినిమాను అందరూ చూసి విజయవంతం చేయాలని కోరుతున్నానని అన్నారు.

Also Read- Jeevitha Rajashekar: జీవితా రాజశేఖర్‌కు ఊహించని బాధ్యత.. ఇది ఎవ్వరూ ఊహించలే!

డైరెక్టర్ సాయి రాజేష్ మాట్లాడుతూ, ఈ సినిమా కోసం టీమ్ అంతా చాలా కష్టపడింది. నేను ‘బుర్రకథ’ చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేశాను. అక్కడే సుమయ రెడ్డిని కలిశాను. ఆ తరువాత ఓ షార్ట్ ఫిల్మ్‌కి పని చేశాం. కరోనా టైంలో సుమయ రెడ్డి ఓ కథ రాశారు. అది నాకు చాలా నచ్చింది. అలా ‘డియర్ ఉమ’ చిత్రం మొదలైంది. ఈ కథను నమ్మి చాలా మందిని కలిశాం. కానీ కథలో చాలా మార్పులు చేర్పులు చేయాల్సి వచ్చింది. అందుకే సుమయానే స్వయంగా నిర్మించేందుకు ముందుకు వచ్చారు. సమాజానికి ఓ మంచి సందేశాన్ని ఇవ్వాలని ఆమె ఈ సినిమాను నిర్మించారు. ఆ తర్వాత పేరున్న వారంతా ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చారు. సమాజానికి ఈ సినిమా అవసరం ఉందని నేను నమ్ముతున్నాను. ఆ అవసరం ఏంటో తెలియాలంటే మాత్రం అందరూ సినిమా చూడాల్సిందేనని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో చిత్రయూనిట్‌కు చెందిన పలువురు మాట్లాడారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?