Dance Ikon2 Wild Fire: ‘ఆహా’ ఓటీటీలో డ్యాన్సింగ్ షోగా దూసుకెళుతున్న ‘డ్యాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్’.. ఇటీవల కాంట్రవర్సీలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ షో లో అలనాటి ఆణిముత్యాన్ని, ఎక్స్‌పోజింగ్ చేస్తూ ఓ డ్యాన్సర్ ప్రదర్శించడంతో పాటు, ఈ షో ను కొన్ని బెట్టింగ్ యాప్స్ (Betting Apps) స్పాన్సర్ చేస్తుండటం వివాదంగా మారింది. ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్‌పై తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా తెలంగాణలో ఎలాంటి పోరాటం జరుగుతుందో తెలియంది కాదు. ఒకవైపు అంతగా బెట్టింగ్ యాప్స్‌పై యుద్ధం చేస్తుంటే, ఈ షో గ్యాప్‌లో ఆ యాడ్స్‌ని వేస్తూ వస్తున్నారు. అలాగే ఓల్డ్ సాంగ్, అందరికీ ఎంతో ఇష్టమైన ఓ పాటకి డ్యాన్సర్ చేసిన డ్యాన్స్ ఆగ్రహాన్ని తెప్పించింది. ఇలా ఈ షో బాగానే వార్తలలో నిలుస్తుంది.
Also Read- Gopi Sundar: ‘కొరగజ్జ’తో ప్రయోగం చేశా.. ఇంతకీ ‘కొరగజ్జ’ అంటే ఏంటో తెలుసా?
ఇప్పుడీ షో ఫైనల్ ఎలిమినేషన్‌కు చేరుకుంది. ఫైనల్ ఎలిమినేషన్ నిమిత్తం హోస్ట్ ఓంకార్ (Ohmkar)… మొత్తం ఐదుగురు కంటెస్టెంట్స్‌కు ఒక్కొక్కరికి రూ. 75 వేలు ఇచ్చి, ఓ పాటని వాళ్లే ఓన్‌గా షూట్ చేయాలని చెప్పారు. దీనికి ఐదుగురు కంటెస్టెంట్స్ కూడా వారి డ్యాన్స్ మాస్టర్స్‌తో కలిసి అత్యద్భుతంగా పాటలను చిత్రీకరించారు. దీనికి సంబంధించిన ప్రోమోని తాజాగా ఆహా విడుదల చేసింది. ఈ పాటల చిత్రీకరణను చూసి స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ (Sekhar Master) కూడా ఆశ్చర్యపోయారు. అంత తక్కువ అమౌంట్‌తో అంత రిచ్‌గా ఎలా పాటను చిత్రీకరించారు, ఒక్కో పాట వేరే లెవల్ అన్నట్లుగా అందరినీ కొనియాడారు. అలాగే మరో కొరియోగ్రాఫర్ యష్ మాస్టర్ కూడా ఆ పాటల చిత్రీకరణకు షాకయ్యారు. ఎలా సాధ్యమైంది? అంటూ ఆ పాటలను చిత్రీకరించిన డ్యాన్స్ మాస్టర్స్‌ని అడిగి మరి తెలుసుకున్నారు.
ఐదుగురు కంటెస్టెంట్స్ ప్రదర్శించిన పాటలను గమనిస్తే.. మానస్ (Maanas) కంటెస్టెంట్ ‘బాహుబలి’ చిత్రంలోని ‘ధీవర’ అనే పాటను, యష్ మాస్టర్ (Yash Master) కంటెస్టెంట్ ‘అరుంధతి’ సినిమాలోని ‘కమ్ముకున్నా చీకట్లోనా’ అనే పాటను, దీపికా రంగరాజు (Deepika Rangaraju) కంటెస్టెంట్ ‘కెజియఫ్’లోని ‘సలామ్ రాకీ భాయ్’ పాటను, ప్రకృతి (Prakruthi) కంటెస్టెంట్ ‘రోజా’ సినిమాలోని చిన్ని చిన్ని ఆశ పాటను, ముమైత్ ఖాన్ (Mumaith Khan) కంటెస్టెంట్ ‘ధృవ’ సినిమాలోని పరేషానురా అనే పాటను రీ క్రియేట్ చేశారు. నిజంగా ఈ పాటలను చూస్తుంటే.. ‘ఏమన్నా టాలెంట్ రా బాబూ’ అని అనకుండా ఉండలేరు.
Also Read- Sri Reddy: అయ్యబాబోయ్.. శ్రీరెడ్డిలో ఇంత మార్పా? మునిగిపోయిందిగా!
అంతేకాదు, ఈ పాటల కొరియోగ్రఫీ చూపించి.. శేఖర్ మాస్టర్‌కు పంచ్‌లు వేస్తున్నారు. కోట్లకు కోట్లు తగలేస్తున్నారు కదయ్యా.. చూడండి జస్ట్ రూ. 75 వేలతో ఎలాంటి అవుట్‌ఫుట్ ఇచ్చారో. మారండయ్యా.. ఇలాంటి టాలెంట్ ఉన్న డ్యాన్స్ మాస్టర్స్‌ని కాస్త ఎంకరేజ్ చేయండయ్యా! అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ ప్రోమో ఎండింగ్‌లో ఇదే ఆఖరి ఎలిమినేషన్ అని ఓంకార్ మరో ట్విస్ట్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ప్రోమో అయితే వైరల్ అవుతుంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు