Coolie Monica Song: సూపర్ స్టార్ రజినీకాంత్ (Super Star Rajinikanth), లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) కాంబినేషన్‌లో వచ్చిన ‘కూలీ’ (Coolie Movie) సినిమా నెగిటివ్ టాక్‌తో కూడా రూ. 500 కి పైగా కోట్లను కొల్లగొట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర థియేట్రికల్ రన్ పూర్తై ఓటీటీలోకి కూడా వచ్చేసింది. సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చినప్పటి నుంచి ప్రమోషన్ మరో రకంగా ఉంటుందనే విషయం తెలియంది కాదు. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినప్పటి నుంచి చిత్రంలోని వీడియో సాంగ్స్‌ని మేకర్స్ వదులుతుంటారు. ఇప్పటికే ‘కూలీ’ మూవీ నుంచి ‘చికిటు’ (Chikitu Full Video Song) అనే వీడియో సాంగ్‌ని మేకర్స్ వదిలారు. ఇప్పుడు మరో వీడియో సాంగ్‌ని మేకర్స్ వదిలారు. ఆ వీడియో సాంగ్ ఏదో కాదు.. లిరికల్ వీడియో విడుదలైనప్పటి నుంచి ఓ ఊపు ఊపేస్తున్న ‘మోనికా’ సాంగ్. అవును, ఈ సినిమాలోని స్పెషల్ గీతమైన ‘మోనికా’ వీడియో సాంగ్‌ని మేకర్స్ వదిలారు.
Also Read- Kantara Chapter 1: ‘కాంతార చాప్టర్ 1’.. ఆ రాష్ట్రంలో విడుదల కావడం లేదా? అసలేం జరిగిందంటే?
సౌబిన్ షాహిర్ హైలెట్..
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ ‘కూలీ’ (Coolie) సినిమాలోని ‘మోనికా’ సాంగ్‌లో హీరోయిన్ పూజాహెగ్డేతో పాటు నటుడు సౌబిన్ షాహిర్ బాగా హైలైట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఈ పాట ఏదో ఒక చోట వినబడుతూనే ఉన్నాయి. సౌబిన్ షాహిర్, పూజా హెగ్డే కలిసి వేసిన స్టెప్స్ కాలేజీల్లో కుర్రాళ్లు, ఉపాధ్యాయులు కూడా వేస్తున్నారంటే.. ఎంతగా ఈ పాట జనాల్లోకి వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడొచ్చిన ఫుల్ వీడియో సాంగ్ (Monica Telugu Video Song)తో మరికొన్ని రోజుల పాటు ఈ పాట ట్రెండ్‌లో ఉండే అవకాశం అయితే లేకపోలేదు. మరోవైపు ఈ సినిమా కూడా ఓటీటీలోకి వచ్చేసింది. సెప్టెంబర్ 11 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘కూలీ’ ప్రీమియర్ అవుతోంది. ప్రైమ్ వీడియోలో తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషలలో ఈ సినిమా అందుబాటులోకి రానుంది. భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 240 దేశాలలో ప్రైమ్ వీడియో ఈ సినిమాను ప్రత్యేకంగా స్ట్రీమింగ్‌కు తీసుకువచ్చింది.
Also Read- Asia Cup 2025: భారత్ – పాక్ మ్యాచ్ రద్దు చేయాలంటూ పిటిషన్.. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే?
‘కూలీ’ కథ విషయానికి వస్తే..
విశాఖపట్నం రేవుల నేపథ్యములో ఈ ‘కూలీ’ సినిమాను లోకేష్ కనగరాజ్ రూపొందించారు. ఒక మాజీ కూలీ అయిన దేవ (రజినీకాంత్).. తన ప్రాణ స్నేహితుడి (సత్యరాజ్) అనుమానాస్పద మరణంపై దర్యాప్తు చేస్తుండగా.. ఒక స్మగ్లింగ్ సిండికేట్‌కు లింక్ ఉన్నట్లుగా తెలుస్తుంది. రహస్య ఎలెక్ట్రిక్ కుర్చీ, భూస్థాపితం చేయబడిన నిజాలు, వీటికి వెనుక దాగి ఉన్న ఒక ద్రోహిని కనుక్కోవడం కోసం ఆ మాజీ కూలీ ఏం చేశాడు? న్యాయం కోసం పోరాటం చేసే క్రమంలో ప్రస్తుత కథకి, ఆ కూలీ గతానికి ఉన్న సంబంధం ఏంటి? ఫైనల్‌గా తన స్నేహితుడి మరణానికి కారణమైన వారిని దేవ కనుక్కున్నాడా? లేదా? వంటి ప్రశ్నలకు సమాధానమే ‘కూలీ’ సినిమా.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు