Mega Victory song: మెగా విక్టరీ మాస్ సాంగ్ ప్రోమో వచ్చేసింది..
MEGA-VICTORY-MASS-SONG
ఎంటర్‌టైన్‌మెంట్

Mega Victory song: ‘మన శంకరవరప్రసాద్ గారు’ నుంచి మెగా విక్టరీ మాస్ సాంగ్ ప్రోమో వచ్చేసింది..

Mega Victory song: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇద్దరు దిగ్గజ హీరోలు ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే ఆ సందడే వేరు. ఇప్పుడు అచ్చం అలాంటి అద్భుతమే జరగబోతోంది. మెగాస్టార్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రాబోతున్న మన శంకరవరప్రసాద్ సినిమా నుంచి ‘మెగా విక్టరీ మాస్’ సాంగ్ ప్రోమో తాజాగా విడుదలై సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కేవలం 29 సెకన్ల నిడివి ఉన్న ఈ ప్రోమోలో మెగాస్టార్ చిరంజీవి మరియు విక్టరీ వెంకటేష్ ఇద్దరూ ఎంతో ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్నారు. ఒక కలర్ ఫుల్ క్లబ్ సెట్టింగ్‌లో వీరిద్దరూ కలిసి వేసిన మాస్ స్టెప్పులు అభిమానులకు పూనకాలు తెప్పిస్తున్నాయి. చిరంజీవి డెనిమ్ జాకెట్‌లో స్టైలిష్‌గా కనిపిస్తుండగా, వెంకటేష్ రెడ్ జాకెట్ మెడలో స్కార్ఫ్‌తో మాస్ లుక్‌లో అదరగొట్టారు. ఇప్పటికే విడుదలైన ‘మీసాల పిల్ల’, ఓ ప్రసాదూ.. పాటలు యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి. ఇప్పుడు ఇద్దరు హీరోలు కలిసి చేస్తున్న సాంగ్ వస్తుండటంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

Read also-Nagababu Comments: శివాజీ vs అనసూయ.. నాగబాబు ఎంట్రీ.. దుర్మార్గులంటూ ఫైర్

ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఎఫ్‌2, ఎఫ్‌3 వంటి చిత్రాలతో వెంకటేష్‌కి హిట్స్ ఇచ్చిన అనిల్, ఇప్పుడు చిరంజీవిని కూడా జత చేసి ప్రేక్షకులకు డబుల్ ధమాకా అందించబోతున్నారు. ఈ పాటకి భీమ్స్ సిసిరోలియో మాస్ బీట్స్ అందించగా, షైన్ స్క్రీన్స్ మరియు గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సాహు గారపాటి మరియు చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ ‘మెగా విక్టరీ మాస్’ పూర్తి లిరికల్ వీడియో డిసెంబర్ 30వ తేదీన విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిన్న ప్రోమో యూట్యూబ్‌లో వేల సంఖ్యలో వ్యూస్‌ని సొంతం చేసుకుంటూ ట్రెండింగ్‌లో ఉంది. “మన శంకరవరప్రసాద్ గారు” సినిమా 2025 జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతోంది. పండగ సీజన్‌లో ఈ ఇద్దరు పెద్ద హీరోలు కలిసి రావడం సినీ ప్రేక్షకులకు నిజమైన పండగ అని చెప్పవచ్చు. ఈ సినిమా సంక్రాంతి రేసులో భారీ అంచనాలతో బరిలోకి దిగుతోంది.

Read also- Shekar Basha: కిలిమంజారో.. తోపు పాయింట్ లాగి, చిన్మయికి షాకిచ్చిన శేఖర్ బాషా!

Just In

01

Mysuru Palace: మైసూరు ప్యాలెస్ దగ్గర హీలియం సిలిండర్ పేలుడు.. ముగ్గురు మృతి

BRS Party: ప్రభుత్వ దూకుడు గులాబీ పార్టీ ఉక్కిరి బిక్కిరి.. పార్టీ శ్రేణుల్లో నెలకొన్న గందరగోళం!

Shivaji Inquiry: మహిళా కమీషన్ ముందు హాజరైన్ శివాజీ . . కమీషన్ అడిగిన ప్రశ్నలు ఏంటంటే?

City Police Annual Press Meet: హైదరాబాద్‌లో 405 అత్యాచారాలు.. 69 దారుణ హత్యలు.. క్రైమ్ చిట్టా విప్పిన సజ్జనార్

Telangana Education: కార్పొరేట్ స్కూల్స్‌కు దీటుగా సర్కారు బడి.. నాణ్యమైన విద్యే లక్ష్యంగా ప్రభుత్వం కసరత్తు!