Sathyaraj and Chiranjeevi
ఎంటర్‌టైన్మెంట్

Chiranjeevi: చిరంజీవి పుట్టినరోజున ‘కట్టప్ప’ ఇచ్చే ట్రీట్ ఇదే..

Chiranjeevi: ‘కట్టప్ప’ సత్యరాజ్.. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) పుట్టినరోజున ట్రీట్ ఇవ్వడం ఏమిటి? అని అనుకుంటున్నారా? అందులోనూ ఈ మధ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో ఓ ఈవెంట్‌కు హాజరైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలపై సత్యరాజ్ (Kattappa Sathyaraj) ఫైర్ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సత్యరాజ్‌పై మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా సీరియస్ అయ్యారు. రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ సినిమాలో సత్యరాజ్ ఓ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా చిరంజీవి పుట్టినరోజున ట్రీట్ అంటే.. మెగా ఫ్యామిలీని ఆయన ఏమైనా ప్రసన్నం చేసుకుంటున్నాడా? అనే సందేహాలు కలగవచ్చు. కానీ ఇక్కడ మ్యాటర్ అది కాదు.. మెగాస్టార్ బర్త్‌డే రోజున సత్యరాజ్ కీలక పాత్రలో నటించిన ఓ సినిమా విడుదల కాబోతోంది. అదే సత్యరాజ్ ఇచ్చే ట్రీట్. వివరాల్లోకి వెళితే..

స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్‌పై విజయ్ పాల్ రెడ్డి అడిదెల నిర్మిస్తున్న చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’ (Tribanadhari Barbarik). మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పాన్ ఇండియన్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో నటించారు. వశిష్ట ఎన్ సింహా, సత్యం రాజేష్, ఉదయభాను, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్ వంటి వారు ఇతర ప్రధాన పాత్రల్ని పోషించారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించేందుకు మేకర్స్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

Also Read- Mass Jathara: ‘ఓలే ఓలే’.. రవితేజ-శ్రీలీల డ్యాన్స్ చూడటానికి రెండు కళ్లు చాలవ్!

సత్యరాజ్ మాట్లాడుతూ.. ‘త్రిబాణధారి బార్బరిక్’ సినిమాలో నటించినందుకు చాలా ఆనందంగా ఉంది. మేమంతా.. ఎవరికి వాళ్లం మాదే మెయిన్ పాత్ర అని చెప్పుకోవచ్చు. కానీ ఇందులో కథే మెయిన్ హీరో అని నేను చెబుతాను. డైరెక్టర్ మోహన్, నిర్మాత విజయ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాజేష్ వీళ్లే అసలైన బాణాలు. ఈశ్వర్ నాతో డ్యాన్స్ కూడా చేయించారు. రమేష్ మా అందరినీ అద్భుతంగా చూపించారు. డబ్బింగ్‌ చెప్పేటప్పుడు ఇతర సీన్లను కూడా అడిగి చూశాను.. అంతగా ఈ సినిమాకు నేను కనెక్ట్ అయ్యాను. కెమెరా యాంగిల్‌తోనే సస్పెన్స్‌ను క్రియేట్ చేశారు. అలా దర్శకుడు, కెమెరామెన్ కలిసి నిజంగా ఓ అద్భుతం చేశారు. 70 ఏళ్లు దాటినా కూడా నేను కొత్త కొత్త పాత్రల్ని చేయాలని ఆశపడుతున్నాను. రెగ్యులర్ పాత్రలు కాకుండా ‘బార్బరిక్’ వంటి కొత్త పాత్రల్ని మరిన్ని చేయాలని అనుకుంటున్నాను. నా డియర్ ఫ్రెండ్ మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆగస్ట్ 22న ఈ చిత్రం విడుదల కాబోతోందని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. చిరంజీవి కంప్లీట్ యాక్టర్. ఆయన గొప్ప నటుడు, డ్యాన్సర్, అద్భుతమైన వ్యక్తి. మా మూవీ ఆయన పుట్టిన రోజున రిలీజ్ అవుతుండటం నిజంగా టీమంతా హ్యాపీగా ఫీలవుతున్నామని అన్నారు.

Also Read- Ustad Bhagat Singh: పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ సెట్ లో ఘ‌ర్షణ.. సమ్మె జరుగుతుంటే షూటింగ్ ఎలా నిర్వహిస్తారు?

ఉదయ భాను మాట్లాడుతూ.. నేను సినిమాలకు దూరమయ్యానని అంతా అనుకుంటున్నారు. నేనేమీ సినిమాలకు దూరంగా ఉండలేదు. నాకు నచ్చిన పాత్రలు వస్తేనే చేస్తున్నాను. ఏది పడితే అది చేయడం లేదు. ఆర్టిస్టులకు ఉండే ఆకలిని తీర్చే పాత్రలో ఈ సినిమాలో నటించాను. ‘బార్బిరిక్’ చిత్రంలో ఓ ఛాలెంజింగ్ పాత్రను మోహన్ నాకు ఇచ్చారు. ప్రతీ పాత్రను నేను ప్రాణం పెట్టి పోషిస్తాను. నాకు రాజేష్ మంచి స్నేహితుడు. ఆయన ఏ ప్రాజెక్ట్ చేస్తున్నా కూడా నన్ను కన్విన్స్ చేస్తుంటారు. మోహన్ నెరేట్ చేసినప్పుడు ఆ కథలోని ప్రతీ సీన్ నా కంటికి కనిపించింది. మన భాషలో ఇలాంటి చిత్రాలెందుకు రావు? అని అంతా అంటుంటారు. అలాంటి వారిని ఆశ్చర్యపరిచేలా మా సినిమా ఉంటుంది. ఈ చిత్రం అందరికీ కన్నుల పండువగా ఉంటుంది. అందరూ థియేటర్లలో చూసి ఆదరించండని కోరారు.

Tribanadhari-Barbarik

వశిష్ట ఎన్ సింహా మాట్లాడుతూ.. ఈ సినిమా నాకెంతో ప్రత్యేకం. మోహన్ చెప్పిన కథ విన్నప్పుడే టైటిల్ చాలా కొత్తగా అనిపించింది. కథ, స్క్రీన్‌ప్లే చాలా నచ్చేసింది. ఇది చిన్న సినిమా అని మోహన్ నాకు ఓ కథ చెప్పారు. కానీ సెట్ మీదకు వచ్చిన తరువాత ఇది ఎలా చూసినా చిన్న సినిమా కాదని అర్థమైంది. ఇలాంటి చిత్రాలు అరుదుగా వస్తుంటాయి. నేను మెగాస్టార్ అభిమానిని. ఆయన బర్త్ డే సందర్భంగా ఆగస్ట్ 22న ఈ చిత్రం విడుదల కాబోతోంది. అందరూ చూసి సక్సెస్ చేయాలని కోరుతున్నాను అని చెప్పుకొచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ విజయ్ పాల్ రెడ్డి అడిదెల, దర్శకుడు మోహన్ శ్రీవత్సలతో పాటు చిత్ర బృందం ప్రసంగించారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?