80s Reunion Party: టాలీవుడ్ స్టార్ హీరోలు చిరంజీవి (Megastar Chiranjeevi), వెంకటేష్ (Victory Venkatesh) కలిసి చెన్నైలో జరుగుతున్న 80ల రీ యూనియన్ పార్టీకి హాజరైన విషయం తెలిసిందే. ప్రతి ఏడాది దక్షిణాది సినీ పరిశ్రమకు చెందిన దిగ్గజ తారలు ఒకచోట చేరి ఈ రీ-యూనియన్ పార్టీని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి ఈ వేడుకను చెన్నైలో నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే, టాలీవుడ్‌కు చెందిన మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ ఒకే ఫ్లైట్‌లో చెన్నైకు వెళ్లారు. అక్కడ 80లనాటి దక్షణాది స్టార్ హీరోలు, హీరోయిన్ లు అందరూ ఒక చోట కలుసుకుని సందడి చేశారు. అలనాడు కలిసి చేసిన సినిమాలను గుర్తు చేసుకుంటూ గడిపారు. తాజాగా దీనికి సంబంధిచిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన అభిమానులు అలనాటి స్టార్ నటులను అందరినీ ఒకే చోట చూడటం చాలా ఆనందంగా ఉందంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘మా 80ల నాటి బంధం ఎన్ని ఎళ్లు అయినా విడిపోవు’ అంటూ రాసుకొచ్చారు.
Read also-Kantara 1 collection: బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న ‘కాంతారా చాప్టర్ 1’ వసూళ్లు.. మూడోరోజు ఎంతంటే..
మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ లు ఇద్దరు అగ్రశ్రేణి నటులు, అది కూడా అత్యంత సన్నిహిత మిత్రులు ఒకే విమానంలో కలిసి ప్రయాణించడం, ఆ ప్రయాణంలో సరదాగా ఇలా ఫొటోలు తీసుకోవడం చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ రీ-యూనియన్ పార్టీకి కేవలం చిరంజీవి, వెంకటేష్ మాత్రమే కాక.. అప్పటితరం నటీనటులు మోహన్‌లాల్, నదియా, రాధిక, శోభన, సుహాసిని మమ్ముట్టి, శరత్ బాబు, వంటి వారంతా హాజరయ్యారు. ఈ వేడుకను ప్రతి సంవత్సరం మిస్ కాకుండా జరుపుతున్నారు. ఈ పార్టీలో పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, సరదా ఆటపాటలతో వీరంతా సందడి చేయనున్నారు.
Read also-Hrithik Roshan: ఎన్టీఆర్ పేరు ప్రస్తావించకుండా.. ‘వార్ 2’ రిజల్ట్‌పై హృతిక్ రోషన్ షాకింగ్ పోస్ట్!
గతంలో ఈ పార్టీలు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లో జరిగాయి. ప్రతి రీ-యూనియన్‌కు ఒక ప్రత్యేకమైన థీమ్ ఉంటుంది. ఈసారి చెన్నైలో జరిగిన ఈ పార్టీకి చిరంజీవి, వెంకటేష్ కలిసి వెళ్లడం, వీరి స్నేహానికి ప్రతీకగా నిలవడంతో పాటు, ఈ పార్టీపై సినీ అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచింది. ఈ వార్షిక వేడుకలో తీసిన గ్రూప్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సాధారణంగా సినిమాల షూటింగ్‌లతో తీరిక లేకుండా ఉండే అగ్ర నటులు, నటీమణులు ఇలా ప్రతి ఏటా ఒకచోట కలవడం అనేది సినీ పరిశ్రమలోని వారి మధ్య ఉన్న బలమైన స్నేహబంధాన్ని, ప్రేమాభిమానాలను తెలియజేస్తుంది. పోటీ ఎంత ఉన్నప్పటికీ, వ్యక్తిగత జీవితంలో వీరు ఒకరికొకరు ఇచ్చే గౌరవం, స్నేహానికి ఈ ‘80స్ రీ-యూనియన్’ ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తుందని చెప్పుకోవచ్చు.
Every reunion with my beloved friends from the 80s is a walk down memory lane, filled with laughter, warmth, and the same unbreakable bond we’ve shared for decades.☺️
So many beautiful memories, and yet every meet feels as fresh as the first! ❤️#80sStarsReunion pic.twitter.com/97uT70U4CV
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 5, 2025
