Chiranjeeva Trailer: రాజ్ తరుణ్ ‘చిరంజీవ’ ట్రైలర్ ఎలా ఉందంటే..
Chiranjeeva Trailer (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Chiranjeeva Trailer: రాజ్ తరుణ్ ‘చిరంజీవ’ ట్రైలర్ ఎలా ఉందంటే..

Chiranjeeva Trailer: యంగ్ హీరో రాజ్ తరుణ్‌ (Raj Tarun)కు హిట్ సినిమా పడి చాలా కాలం అవుతుంది. సినిమాలైతే చేస్తున్నారు కానీ, హిట్ మాత్రం ఆయన దరి చేరడం లేదు. మధ్యలో వ్యక్తిగత ఇష్యూస్‌ కూడా యాడవడంతో.. నిత్యం వార్తలలో అయితే ఉంటున్నారు కానీ, సినిమాల పరంగా మాత్రం ఆయన నిరాశలోనే ఉన్నాడని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం రాజ్ తరుణ్ నటించిన సినిమా ఒకటి, డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఆహా ఓటీటీ (Aha OTT) ఒరిజినల్ ఫిల్మ్‌గా రూపుదిద్దుకున్న ‘చిరంజీవ’ చిత్రం నవంబర్ 7వ తేదీ (Chiranjeeva Streaming Date) నుంచి స్ట్రీమింగ్‌కు రాబోతోంది. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్స్‌ని స్టార్ట్ చేసింది. అందులో భాగంగా సోమవారం మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే.. ఇందులో విషయం ఉన్నట్లే అనిపిస్తోంది. ఈ ట్రైలర్‌ని గమనిస్తే..

Also Read- Kantara Chapter 1 OTT: ‘కాంతార: చాప్టర్ 1’ ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ డిటైల్స్ ఇవే..

రాజ్ తరుణ్‌కు ఉన్న శక్తులతో ఏం చేశాడు?

ఈ ‘చిరంజీవ’ మూవీ ట్రైలర్ (Chiranjeeva Movie Trailer) చూస్తుంటే.. ఎంటర్‌టైన్‌మెంట్, లవ్, యాక్షన్‌ కలగలిపిన చిత్రమిదని తెలుస్తోంది. శివ(రాజ్ తరుణ్) పుట్టగానే మహార్జాతకుడు అవుతాడని పండితులు చెబుతుండటంతో పాటు, ట్రైలర్ స్టార్టింగ్‌లోనే తను డ్రైవ్ చేస్తున్న కారుకు దున్నపోతు ఎదురు రావడాన్ని చూపించారు. శివకు చిన్నప్పటి నుంచి స్పీడు ఎక్కువ. ఆంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తున్న అతను ఓ రోడ్డు ప్రమాదానికి గురవుతాడు. ఆ ప్రమాదంలో అతనికి తెలియకుండానే కొన్ని శక్తులు వచ్చేస్తాయి. ఆ శక్తులు ఏంటంటే.. ఎవరెవరు ఎంతకాలం జీవిస్తారు అనేది.. వారిని చూడగానే వారి తలపై ప్రత్యక్షమవుతుంటుంది. ఈ క్రమంలోనే శివ రౌడీ సత్తు పైల్వాన్‌ను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ సత్తు పైల్వాన్‌తో చేసిన పోరాటంలో శివ గెలిచాడా? లేదా? అనేది ఆసక్తిగా చూపించారు. అలాగే హీరో హీరోయిన్లు రాజ్ తరుణ్, కుషిత కల్లపు (Kushitha Kallapu)ల మధ్య వెరైటీ లవ్ స్టోరీని బిల్డ్ చేసినట్లుగా ఈ ట్రైలర్ తెలియజేస్తుంది. మొత్తంగా చూస్తే, థియేటర్లలో సక్సెస్ దూరమైనప్పటికీ, ఓటీటీలో రాబోతున్న ఈ ‘చిరంజీవ’తో ఆయన మళ్లీ ట్రాక్‌లోకి వచ్చే అవకాశం ఉన్నట్లే కనిపిస్తోంది. అలాగే ఆహా ఓటీటీకి కూడా ఇదొక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కానుందనేది ఈ ట్రైలర్ తెలియజేస్తోంది.

Also Read- Megastar Chiranjeevi: చిరంజీవి డీప్ ఫేక్ వీడియోలు వైరల్.. సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు!

రాజ్ తరుణ్ ట్రాక్‌లోకి వస్తాడా?

రాజ్ తరుణ్, కుషిత కల్లపు జంటగా నటించిన ఈ చిత్రాన్ని స్ట్రీమ్ లైన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాహుల్ అవుదొడ్డి, సుహాసినీ రాహుల్ నిర్మించారు. అభినయ కృష్ణ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంతో ఎలాగైనా రాజ్ తరుణ్ ట్రాక్‌లోకి వస్తాడని, ఆయన అభిమానులు కూడా భావిస్తున్నారు. నవంబర్ 7వ తేదీన ఆహా ఒరిజినల్ ప్రాజెక్ట్‌గా ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతం ప్రమోషన్స్‌పై మేకర్స్ దృష్టి పెట్టారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలిపేందుకు.. చిత్ర టీమ్ మీడియా ముందుకు రాబోతున్నట్లుగా తెలుస్తోంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..