Chhaava Still
ఎంటర్‌టైన్మెంట్

Chhaava: తెలుగు రిలీజ్‌కు సిద్ధమైన ‘ఛావా’.. రష్మిక రియాక్షన్ చూశారా!

Chhaava Telugu Release: ‘ఛావా’.. పడిపోతున్న బాలీవుడ్ పరిశ్రమకు ప్రాణం పోసిన చిత్రం. కొన్నాళ్లుగా బాలీవుడ్ పరిస్థితి ఏంటనేది అందరికీ తెలిసిందే. మధ్యమధ్యలో షారుఖ్ సినిమాలు రెండు హిట్ అవడంతో కాస్త వార్తలలో ఉంది కానీ, లేదంటే, బాలీవుడ్ పని అయిపోయిందని టామ్ టామ్ అయ్యేది. షారుఖ్ సినిమాల తర్వాత సరైన సినిమా కోసం చూస్తున్న బాలీవుడ్‌కు ‘ఛావా’ సినిమా ఊపిరినిచ్చింది. ఈ సినిమా చూసిన వారంతా ఒక ట్రాన్స్‌లోకి వెళ్లిపోతున్నారు. అంత గొప్పగా ఈ సినిమాను దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కిస్తే.. ఇందులో నటించిన వారంతా పాత్రలకు జీవం పోశారు. ఫిబ్రవరి 14న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా విజయ ఢంకా మోగిస్తూ.. కేవలం 11 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 420 కోట్లను రాబట్టింది. ఇప్పుడీ సినిమాను తెలుగులో రిలీజ్ చేయాలంటూ ప్రేక్షకుల డిమాండ్ ఎక్కువైంది. ఈ డిమాండ్‌ని పరిశీలనలోకి తీసుకున్న మేకర్స్, తెలుగు వెర్షన్ రిలీజ్ డేట్‌ని ప్రకటించారు.

Also Read- Rashmika Mandanna: రష్మికకు వింత అలవాటు.. అదేం పని?

మార్చి 7న తెలుగులో
దినేష్ విజన్ మాడ్డాక్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ సినిమాలో విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించగా, రష్మికా మందన్నా యేసుబాయి భోంస్లేగా, అక్షయ్ ఖన్నా ఔరంగజేబుగా, డయానా పెంటీ జినత్-ఉన్-నిస్సా బేగంగా, అశుతోష్ రాణా హంబిర్రావ్ మోహితేగా, దివ్య దత్తా సోయారాబాయిగా కనిపించారు. సౌత్ ఇండియన్ సినిమా పవర్‌హౌస్ అయిన గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ సినిమా తెలుగులో రిలీజ్ కాబోతోంది. ఇప్పటి వరకు 300కు పైగా బ్లాక్ బస్టర్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ చిత్రాలను రిలీజ్ చేసిన ట్రాక్ రికార్డ్ ఉన్నటువంటి గీతా ఆర్ట్స్ (Geetha Arts) ‘ఛావా’ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ సినిమాను మార్చి 7న తెలుగులో రిలీజ్ చేయబోతున్నట్లుగా తెలుపుతూ అధికారికంగా రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఛత్రపతి శంభాజీ మహారాజ్ వీరగాధని వివరించే చారిత్రక ఇతిహాసంగా వచ్చి, అద్భుతమైన ప్రశంసలు అందుకుంటున్న ఈ సినిమా తెలుగులోనూ అదే స్థాయిలో విజయాన్ని సాధిస్తుందని అంతా ఎంతో నమ్మకంగా ఉన్నారు.

Chhaava-Still
Chhaava-Still

రష్మిక రియాక్షన్ ఇదే!
‘యానిమల్’, ‘పుష్ప 2’, ‘ఛావా’తో హ్యాట్రిక్ విజయాలను అందుకున్న నేషనల్ క్రష్ రష్మికా మందన్నా(Rashmika Mandanna).. ‘ఛావా’ తెలుగు రిలీజ్‌పై ఆసక్తికరంగా స్పందించింది. సోషల్ మీడియా వేదికగా ‘చావా’ తెలుగు రిలీజ్‌పై ఆమె స్పందించింది. ‘‘మీ కోరికలు విన్నాము.. వాటిని నిజం చేశాము. ‘ఛావా’ తెలుగులో వచ్చేస్తుంది. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు’’ అని రష్మిక తన ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. మీకు కూడా అభినందనలు, ఒక గొప్ప చిత్రంలో నటించారు. ఇలాంటి సినిమాలను వదలకండి.. అంటూ నెటిజన్లు ఆమె పోస్ట్‌కు రియాక్ట్ అవుతున్నారు. ప్రస్తుతం రష్మిక పోస్ట్ వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి:
Megastar Chiranjeevi: ‘మజాకా’ను అందుకే మెగాస్టార్ పక్కన పెట్టేశాడా?

Jyothika: ఆ సినిమా కారణంగానే నాకు ఛాన్స్‌లు రాలేదు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!