Cheen Tapak Dum Dum: ‘శుభం’ ఫేమ్ గవిరెడ్డి శ్రీను (Gavireddy Sreenu) హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సోమవారం గ్రాండ్‌గా ప్రారంభోత్సవం జరుపుకుంది. ఈ సినిమాకు ‘చీన్ టపాక్ డుం డుం’ (Cheen Tapak Dum Dum) అనే ఆసక్తికర టైటిల్‌ని ఫిక్స్ చేశారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలకు స్టార్ హీరోయిన్ సమంతతో పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి దర్శకులు మల్లిడి వశిష్ఠ, గోపిచంద్ మలినేని, నందిని రెడ్డి, బివిఎస్ రవి, గౌతమి తదితరులు హాజరై చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. అమెజాన్ ప్రైమ్ హిట్ సిరీస్ ‘కుమారి శ్రీమతి’, ‘శుభం’ ద్వారా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రచయిత – నటుడు గవిరెడ్డి శ్రీను కెరీర్‌లో కొత్త అధ్యాయానికి ఈ మూవీ శ్రీకారం చుట్టబోతోంది. ఆద్యంతం వినోదాత్మక చిత్రంగా ‘చీన్ టపాక్ డుం డుం’ రూపొందనుందని చిత్రయూనిట్ చెబుతుంటే, ఆ విషయం టైటిల్‌తోనే తెలుస్తుందని, టైటిల్ విన్నవారంతా అంటుండటం విశేషం.
Also Read- Renu Desai: అందుకే పవన్ కళ్యాణ్ నీ నుంచి విడిపోయాడు.. అలాంటి థంబ్స్ పెట్టకండి ప్లీజ్!
సమంత క్లాప్‌తో ప్రారంభం
ఈ చిత్ర పూజా కార్యక్రమాల విషయానికి వస్తే.. ముహూర్తపు సన్నివేశానికి సమంత (Star Heroine Samantha) క్లాప్ కొట్టారు. దర్శకుడు గోపిచంద్ మలినేని తొలి షాట్‌కు దర్శకత్వం వహించగా.. మరో దర్శకుడు మల్లిడి వశిష్ఠ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. నందిని రెడ్డి, బివిఎస్ రవి, గౌతమి కలిసి స్క్రిప్ట్‌ను చిత్ర బృందానికి అందజేసి చిత్రానికి శుభారంభం పలికారు. ఈ చిత్రాన్ని శ్రీను నాగులపల్లి నిర్మిస్తున్నారు. ఆయన సంస్థ విలేజ్ టాకీస్‌లో రూపుదిద్దుకుంటున్న ప్రొడక్షన్ నెంబర్ వన్ చిత్రమిది. వై.ఎన్. లోహిత్ (Y N Lohit) దర్శకత్వంలో ‘చీన్ టపాక్ డుం డుం’ రూపుదిద్దుకోనుంది. హీరోయిన్‌గా బ్రిగిడా సాగా (Brigida Saga) నటిస్తున్నారు.
Also Read- Aakasamlo Oka Tara: దుల్కర్ సల్మాన్ సరసన నటించే తార లుక్ విడుదల.. ఎంత బావుందో!
ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులతో..
పూజా కార్యక్రమాలనంతరం దర్శకనిర్మాతలు మీడియాతో మాట్లాడుతూ ఈ చిత్రానికి పని చేసే సాంకేతిక నిపుణుల వివరాలను తెలియజేశారు. సాంకేతికంగా ఈ సినిమా బలమైన టీమ్‌తో ముందుకెళ్తోందని తెలుపుతూ.. ఆర్ట్ డైరెక్టర్‌గా ఏ.ఎస్. ప్రకాష్, సినిమాటోగ్రఫీ సెంథిల్ కుమార్, పీఆర్ సంగీతం, తిరుపతి జావానా పాటలు రాస్తున్నారని, వీఎఫ్ఎక్స్ పనులను నిఖిల్ కొడూరు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. పబ్లిసిటీ డిజైన్స్‌ను శక్తి వీఎఫ్ఎక్స్ రూపొందిస్తోండగా.. కథ, స్క్రీన్‌ప్లేలను దివ్య తేజస్వి, విక్రమ్ కుమార్ కె, నాగ్ ట్రైల్‌బ్లేజర్, ఏకలవ్య కలిసి అందిస్తున్నారని అన్నారు. ప్రతిభావంతులందరూ కలిసి మరింత ఉత్సాహంతో ముందడుగు వేస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇండస్ట్రీలో పాజిటివ్ వైబ్ ఆల్రెడీ క్రియేట్ అయింది. శ్రేయోభిలాషులు, ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి అందుతున్న శుభాకాంక్షలతో ‘చీన్ టపాక్ డుం డుం’ టీమ్ తమ సంతోషాన్ని తెలియజేసింది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

