Chandreshwara Movie Song Launch Event
ఎంటర్‌టైన్మెంట్

Chandreshwara: ‘చంద్రేశ్వర’ నుంచి శివుని పాటొచ్చింది.. మరో ‘ఛావా’?

Chandreshwara: శివ బాలాజీ ఫిలింస్ పతాకంపై బేబీ అఖిల సమర్పణలో సురేష్ రవి, ఆశా వెంకటేష్ హీరోహీరోయిన్లుగా జీవి పెరుమాళ్ వర్ధన్ దర్శకత్వంలో డాక్టర్ రవీంద్ర చారి (Dr Ravindra Chari) నిర్మించిన ఎమోషనల్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘చంద్రేశ్వర’. అతి త్వరలో థియేటర్లలోకి రానున్న ఈ చిత్ర నుంచి ‘మహా శివరాత్రి’ (Maha Shivaratri) పర్వదినాన్ని పురస్కరించుకుని మేకర్స్ సినిమాలోని శివుని పాటను విడుదల చేశారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ పాట విడుదల కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

ఆర్కియాలజీ నేపథ్యంలో
పాట విడుదల అనంతరం నిర్మాత డాక్టర్ రవీంద్ర చారి మాట్లాడుతూ.. ఎప్పటి నుంచో సినిమా ఇండస్ట్రీలోకి రావాలని అనుకుంటున్నాను. అయితే శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. ఆయన ఆజ్ఞతో ‘చంద్రేశ్వర’ మూవీతో నేను పరిశ్రమలోకి అడుగుపెడుతున్నట్లుగా భావిస్తున్నాను. మా మూవీలో ‘ఈశ్వరా’ అని సాగే పాటను మహాశివరాత్రి కానుకగా రిలీజ్ చేసుకోవడం సంతోషంగా ఉంది. ఆర్కియాలజీ నేపథ్యంలో ఎమోషనల్‌తో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. ఏ టెక్నాలజీ లేని ఆ కాలంలో మన పూర్వీకులు గొప్ప గొప్ప దేవాలయాలను చాలా గొప్పగా నిర్మించారు. అప్పటి వారి జీనవ విధానం ఎలా ఉండేది? అనే అంశాలను ఇందులో చూపిస్తున్నాం. డివోషనల్ టచ్‌తో పాటు మంచి కామెడీ కూడా ఈ సినిమాలో ఉంటుంది. త్వరలోనే మా ‘చంద్రేశ్వర’ చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకురానున్నామని అన్నారు.

Also Read- Rashmika Mandanna: రష్మికకు వింత అలవాటు.. అదేం పని?

‘ఛావా’లా సక్సెస్ కావాలి
డైరెక్టర్ కమ్ ఆర్టిస్ట్ ఈశ్వర్ మాట్లాడుతూ.. నిర్మాత రవీంద్ర చారి చంద్రేశ్వర మూవీతో మన సనాతన ధర్మం, దేవాలయాల నేపథ్యంతో మంచి సినిమా చేస్తున్నారు. ఈశ్వరుడిపై విడుదలైన ఈ పాట చాలా బాగుంది. ఈ సినిమాకు అంతా మంచే జరగాలని గత వారం ప్రయాగరాజ్ వెళ్లి మరీ పూజ చేసి వచ్చారు. ఆయన ఎప్పుడూ హిందూధర్మం గురించే మాట్లాడుతుంటారు. అలానే ఆయన నాకు కనెక్ట్ అయ్యారు. ఇటీవల ‘ఛావా’ సినిమా బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయ్యింది. అలాగే ఈ ‘చంద్రేశ్వర’ సినిమా కూడా పెద్ద విజయం సాధించి, రవీంద్ర చారి ఇలాంటి మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నానని తెలిపారు.

Chandreshwara-Song-Launch
Chandreshwara-Song-Launch

‘చంద్రేశ్వర’ మూవీలోని శివుని పాట రిలీజ్‌తో ఈ శివరాత్రి మాకెంతో ప్రత్యేకంగా ఉండబోతోంది. అందరికీ మా మూవీ సాంగ్స్ నచ్చాయని అనుకుంటున్నాం. సినిమాను కూడా పెద్ద సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాం. మీ అందరి సపోర్ట్ మా టీమ్‌కు కావాలని అన్నారు కో ప్రొడ్యూసర్స్ పి. సరిత, వి. బాలకృష్ణ. ఇంకా ఈ కార్యక్రమంలో నటులు అశోక్ కుమార్, గాలిపటాల సుధాకర్, జబర్దస్త్ వినోదిని, జబర్దస్త్ గడ్డం నవీన్, నటి సంజనా చౌదరి వంటి వారంతా మాట్లాడుతూ.. సనాతన ధర్మం, దేవాలయాల నేపథ్యంతో వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని కోరారు.

ఇవి కూడా చదవండి:
Megastar Chiranjeevi: ‘మజాకా’ను అందుకే మెగాస్టార్ పక్కన పెట్టేశాడా?

Jyothika: ఆ సినిమా కారణంగానే నాకు ఛాన్స్‌లు రాలేదు

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ