50 Years Of NBK: నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) సినీ జర్నీ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతోన్న సంగతి తెలిసిందే. భారతీయ సినిమాలో 50 సంవత్సరాలు హీరోగా కొనసాగుతున్న ఏకైక హీరోగా ఆయన రికార్డ్ క్రియేట్ చేశారు. భారతీయ సినిమాలో హీరోగా ఆయన అసాధారణ సేవలకు గుర్తింపుగా.. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, యూకే గోల్డ్ ఎడిషన్‌లో బాలయ్య పేరును నమోదు చేశారు. దీనికి సంబంధించిన కార్యక్రమం హైదరాబాద్ ట్రైడెంట్ హోటల్‌లో శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట రెడ్డి, ఏపీ ఐటీ మినిస్టర్ నారా లోకేష్, నటి జయసుధ, బాలయ్య కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
మరెన్నో రికార్డ్స్ అందుకోవాలి
ఈ కార్యక్రమంలో జయసుధ మాట్లాడుతూ.. బాలయ్య బాబుకు జరుగుతున్న ఈ చరిత్రాత్మక వేడుకలో నేను పాల్గొనటం ఆనందంగా ఉంది. బాలకృష్ణ నటుడిగానే కాదు, వ్యక్తిగానూ ఉన్నతమైన వ్యక్తిత్వం గల మనిషి. నేను ఎన్టీఆర్‌తోనూ అలాగే బాలకృష్ణ సరసన రకరకాల పాత్రల్లో నటించాను. బాలకృష్ణ డెడికేషన్ ఇప్పటి యంగర్ జనరేషన్‌కు ఎంతో స్పూర్తి. ఇంకా మరెన్నో రికార్డ్స్ బాలయ్య అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. నిర్మాత, ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు మాట్లాడుతూ.. నందమూరి బాలకృష్ణ ఎప్పటికీ మన హీరో. 50 ఏళ్ల కెరీర్ కలిగిన బాలయ్యకు ఈ రికార్డు రావటం తెలుగు సినిమా పరిశ్రమకు గర్వకారణంగా నేను భావిస్తున్నానని అన్నారు.
Also Read- 50 Years for Balakrishna: కత్తులతో కాదురా.. కంటి చూపుతో చంపేస్తా! ఈ డైలాగ్ రజినీకాంత్ చెబితే!
బాలయ్య అన్ స్టాపబుల్- నారా లోకేష్
చరిత్ర సృష్టించాలన్నా, దానిని బద్దలు కొట్టాలన్నా మా బాలయ్యకే సాధ్యం. నాకు వారు ముద్దుల మావయ్య. మాస్ హీరోగా ఆయనకు డైహార్ట్ ఫ్యాన్స్ ఉంటారు. ఆయన ఎప్పుడూ యంగ్ స్టరే.. వారి ఎనర్జీ మాకు లేదు.. ఆ ఎనర్జీ సీక్రెట్ ఇప్పటి వరకు మాకు తెలియలేదు. రకరకాల జోనర్ సినిమాలు, పాత్రల్లో నటించి మెప్పించటం బాలయ్యకే సాధ్యమైంది. బాలయ్య బాబు నిర్మాతల, దర్శకుల డ్రీమ్ హీరో. ఓటీటీ ఏరాలో కూడా బాలయ్య రికార్డులు కొడుతున్నారు. భోళా మనిషి, మంచి మనస్సున్న మా మామయ్య. అప్ అండ్ డౌన్స్ ఎన్ని వచ్చినా.. తొణకరు.. ఎప్పుడూ ఒకేలా ఉంటారు. ప్రజలకు అండగా నిలబడటంలో ముందుండే వ్యక్తి. ఇలాంటి వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో మరొకరు లేరు. ఆయన నిజంగానే అన్ స్టాపబుల్. నాకు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన వారందరికీ ధన్యవాదాలు అని తెలిపారు.
Also Read- Sugali Preethi Case: పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ వైరల్!
తెలుగు వారికి గర్వకారణం: బండి సంజయ్
బాలకృష్ణకు 65 ఏళ్ల మనిషి.. కానీ ఆయన మనసుకు 25 ఏళ్లు మాత్రమే. ఇండస్ట్రీలో ముక్కుసూటిగా ఉండే వ్యక్తి. సినీ చరిత్రలో 50 ఏళ్ల సినీ కెరీర్ ఉన్న బాలయ్య ఉండటం అనేది తెలుగు వారికి గర్వకారణం. నటుడిగా కుటుంబ వారసత్వాన్ని కొనసాగించటంతో పాటు, అప్పటినుంచి ఇప్పటివరకు అదే ఎనర్జీతో నటిస్తూ మెప్పిస్తుండటం చాలా గొప్ప విషయం. ఎన్నో ఒడిదుడుకులు, అవమానాలు ఎదురైనా నిలబడ్డారు. ఎన్టీఆర్ చరిత్రను వక్రీకరించి అనేక సినిమాలు వస్తున్నా.. వారి తండ్రిపై ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా చేశారు. ఆయన డాక్టర్ కాకున్నా బసవతారకం హాస్పిటల్ ద్వారా భరోసా, విశ్వాసం, ధైర్యం అందిస్తున్నారు. తెలుగు వారికి ఆవేశం వచ్చినా, ఆనందం వచ్చినా, ఆలోచన వచ్చినా.. జై బాలయ్య అంటే ఓ ఉత్సాహం వచ్చేస్తుంది. బాలకృష్ణ గొప్ప నటులు అవుతారని ‘తాతమ్మ కల’ సమయంలో భానుమతి అన్నారని నేను తెలుసుకున్నాను. ఆమె అన్నట్టే ఈ రోజు బాలకృష్ణ గొప్ప స్థాయికి వెళ్లారు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ గురించి అమిత్ షా కూడా చెబుతుంటారు. ఎఫ్‌సీఆర్ విషయంలోనూ అమిత్ షా సపోర్ట్ చేశారు. ఏపీలోనూ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ప్రారంభించబోతోన్నారని తెలిసిందే. బాలకృష్ణ నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో వర్దిల్లి.. మరిన్ని అవార్డులు, రికార్డులు అందుకోవాలి.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు