Varanasi Glimpse: ‘వారణాసి’ గ్లింప్స్‌పై సెలబ్రిటీల రియాక్షన్ ఇదే..
varanasi-glimps(X)
ఎంటర్‌టైన్‌మెంట్

Varanasi Glimpse: ‘వారణాసి’ టైటిల్ గ్లింప్స్ చూసిన తర్వాత సెలబ్రిటీల రియాక్షన్ ఇదే..

Varanasi Glimpse: మహేష్ బాబు, ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం ‘వారణాసి’. ఈ సినిమాకు సంబంధించి టైటిల్ గ్లింప్స్‌ చూసిన పలువురు సెలబ్రిటీలు ‘రాజమౌళి’ విజన్ కు చేతులెత్తి మొక్కతున్నారు. మరికొందరు అయితే ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదంటూ కామెంట్లు పెడుతున్నారు. ఎవరు ఎవరు ఏం అన్నారో ఇక్కడ చూద్దాం.

Read also-Varanasi Video Response: ‘వారణాసి’ వీడియోపై ప్రేక్షకుల అభిమానానికి మహేష్, రాజమౌళి ఏం అన్నారంటే?

ఈ గ్లింప్స్ చూసిన అనీల్ రావిపూడి.. ఈ రోజు జరిగిన గ్లోబ్ ట్రూటర్ గ్లింప్స్ లాంచ్ అనేది చరిత్ర లిఖించబడుతున్న అరుదైన క్షణం, ముఖ్యంగా ‘వారణాసి’ ప్రపంచం ఊహకందని అద్భుతమైన విజన్‌తో మనసును కట్టిపడేసింది. ఈ ప్రెజెంటేషన్‌లో, ప్రతి లోకం ఐకానిక్‌గా ఉన్నప్పటికీ, 7200 BCE నాటి త్రేతాయుగ లంక నగరము లాంటిది వెండితెరపై ఎన్నడూ చూడని అనుభూతిని ఇవ్వబోతోంది. వానర సైన్యం శ్రీరాముడిని ఎత్తే షాట్ నిజంగా గూస్‌బంప్స్ తెప్పించగా, సూపర్ స్టార్ ఆఖరి షాట్, ముఖ్యంగా నంది మీద ‘మహేష్’ దృశ్యం, వర్ణించడానికి మాటలు చాలవు. ఇలాంటి ఐకానిక్, అద్భుతమైన క్షణాలను ఊహించి, ప్రపంచ సినిమాకు అందించే సామర్థ్యం రాజమౌళికి మాత్రమే ఉందని చెప్పాలి.’ అంటూ తన సోషల్ మీడియా ఖాతాలో రాసుకొచ్చారు.

బుచ్చిబాబు సనా.. ‘రాజమౌళి చెప్పినట్టుగా వారణాసి గ్లింప్స్ ఒక అద్భుతమైన దృశ్యం. ఇక్కడ ప్రతి ఫ్రేమ్ కూడా దివ్యత్వం, సినిమాటిక్ మేధస్సును ప్రదర్శిస్తోంది. ముఖ్యంగా మహేష్ బాబు ‘రుద్రుడి’ రూపంలో కనిపించిన క్షణం అసలైన గూస్‌బంప్స్ తెప్పించింది. ఆయనను ‘శ్రీరాముడి’ పాత్రలో చూడాలని మీరు ఉద్వేగంగా ఎదురుచూస్తున్నారు. ఈ అంచనాలన్నింటితో, ఈ రాజమౌళి గారి రామాయణ ఎపిసోడ్ కోసం అందరూ ఆత్రుతగా వేచి ఉన్నారు.’ అంటూ రాసుకొచ్చారు.

కింగ్ నాగార్జున ఏం అన్నారు అంటే…

రామ్ పోతినేని ఇలా చెప్పుకొచ్చారు..

Just In

01

Bandi Sanjay: అబద్ధాల పోటీ పెడితే కాంగ్రెస్, బీఆర్ఎస్‌కే అవార్డులు.. బండి సంజయ్ సంచలన కామెంట్స్!

Naa Anveshana: నా అన్వేష్‌కు బిగ్ షాక్.. రంగంలోకి బీజేపీ.. దేశ ద్రోహంపై నోటీసులు!

GHMC: జీహెచ్ఎంసీ ఎన్నికలకు అడుగులు.. ఇన్‌టైమ్‌లోనే పూర్తి చేసేలా సర్కార్ చర్యలు!

Hyberabad Police: సంక్రాంతికి ఊరెళ్తున్నారా? మీ ఇల్లు గుల్ల కావొచ్చు.. ఈ జాగ్రత్తలు తీసుకోండి!

BRS Assembly walkout: మైక్ సాకుతో బహిష్కరణ డ్రామా.. ప్రతిపక్షమా? పక్కకు తప్పుకున్న పార్టీనా?