banny-vas(image :X)
ఎంటర్‌టైన్మెంట్

Bunny Vasu: ప్రసాద్ బెహరాపై అసంతృప్తి వ్యక్తం చేసిన బన్నీ వాస్.. ఎందుకంటే?

Bunny Vasu: ‘మిత్ర మండలి’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ ఈవెంట్ లో నిర్మాత బన్నీ వాస్ సినిమాలో ఓ పాత్ర చేసిన ప్రసాద్ బెహరాపై తనకు ఉన్న అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఏం జరిగిందంటే.. నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ.. ప్రసాద్ బెహరాను సోషల్ మీడియాలో ఫేమ్ ఉన్నవారిని తీసుకుందాం అనుకుని ప్రసాద్ బెహరాను సినిమాలోకి తీసుకున్నాం. అయితే సినిమా గురించి తన చేస్తున్న వెబ్ సిరీస్ లో చిన్న స్కిట్ చెయ్యమంటే 92 పేజీల అగ్రిమెంట్ ఇచ్చాడు. దాన్ని చూశాకా ఆ సిరీస్ లో స్కిట్ చేయడం కన్నా.. ప్రసాద్ బెహరాతో సినిమా చేయడమే బెటర్ అనిపించింది. అని అన్నారు. అంటే నిర్మాత మన సినిమా కోసం ఈ మాత్రం కూడా చేయలేవా అన్నట్లుగా మాట్లాడారు. దీనిని చూసిన నెటిజన్లు ప్రసాద్ బెహరాను ఏకి పారేస్తున్నారు. ఎదుగుతున్న సమయంలో ఇలాంటివి పనికి రావంటూ కామెంట్లు పెడుతున్నారు.

Read also-Varun Sandesh: మళ్ళీ ఆ రోజులు రిపీట్ అవుతాయి.. ‘కానిస్టేబుల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వరుణ్ సందేశ్..

ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ స్థాపించిన బి.వి. వర్క్స్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై నిర్మాతలు కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్న చిత్రం ‘మిత్ర మండలి’. సోమరాజు పెన్మెత్స సహ నిర్మాత. ఈ వినోదభరిత చిత్రానికి నూతన దర్శకుడు విజయేందర్ ఎస్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియదర్శి, నిహారిక ఎన్ఎమ్, విష్ణు ఓఐ, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వెండితెరపై నవ్వుల టపాసులు పేల్చడానికి, దీపావళి కానుకగా అక్టోబర్ 16న ‘మిత్ర మండలి’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, మూడు పాటలు విశేషంగా ఆకట్టుకొని సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేసింది. ఇప్పుడు ఆ అంచనాలను రెట్టింపు చేస్తూ ట్రైలర్ వచ్చింది.

Read also-Jubilee Hills By-election: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కొత్త రూల్స్.. రాజకీయ పార్టీలకు ఈసీ కీలక సూచనలు

అతిశయోక్తి పరిస్థితులు మొదలు, మీమ్స్ కు తగిన క్షణాల నుండి తెలివైన మీమ్ రిఫరెన్స్ ల వరకు, ట్రైలర్ గందరగోళం మరియు హాస్యం మేళవింపుతో ఆద్యంతం వినోదభరితంగా సాగింది. ప్రియదర్శి మరోసారి ప్రేక్షకుల మెచ్చే పాత్రలో కనిపించగా, విష్ణు ఓఐ మరియు ప్రసాద్ బెహరా తమదైన హాస్యంతో ఆకట్టుకున్నారు. ఒక విచిత్రమైన పోలీసు పాత్రలో వెన్నెల కిషోర్, ముఖ్యమైన పాత్ర సత్య, సరదా అతిథి పాత్రలో అనుదీప్ కె.వి. కనిపిస్తున్నారు. ఈ తమదైన ప్రత్యేక శైలి హాస్యంతో వీరు వినోదాన్ని రెట్టింపు చేశారు. ‘మిత్ర మండలి’ చిత్రం హాస్యం, యువత అల్లరి రహస్యాన్ని సమాన స్థాయిలో మిళితం చేసినట్లు కనిపిస్తుంది. అద్భుతమైన విజువల్స్, ఆకర్షణీయమైన సంభాషణలు మరియు అంతటా సరికొత్త వినోదాన్ని పంచుతూ, ఒక పరిపూర్ణ దీపావళి ఎంటర్‌టైనర్‌గా ‘మిత్రమండలి’ రూపుదిద్దుకుంటున్నట్లు ట్రైలర్ స్పష్టం చేస్తుంది.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!