Itlu Me Yedhava
ఎంటర్‌టైన్మెంట్

Buchi Babu Sana: ‘ఇట్లు మీ ఎదవ’కు ‘పెద్ది’ డైరెక్టర్ సపోర్ట్

Buchi Babu Sana: కొన్ని సినిమాల టైటిల్స్ చూడగానే.. సినిమాపై ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. గతంలో రవితేజ ‘ఇడియట్’ అంటే జనాలు విరగబడి చూశారు. ఇప్పుడదే స్ఫూర్తితో వస్తున్న ఓ సినిమాకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ దర్శకుడు బుచ్చిబాబు సానా సపోర్ట్ అందించారు. త్రినాధ్ కఠారి (Thrinadh Katari) హీరోగా ఆయన స్వీయ దర్శకత్వంలో సంజీవని ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటోన్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘ఇట్లు మీ ఎదవ’ (Itlu Me Yedhava). బళ్లారి శంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో తెలుగు అమ్మాయి సాహితీ అవాంచ హీరోయిన్‌గా నటిస్తోంది. ‘ఇట్లు మీ ఎదవ’ టైటిల్ కాగా, ‘వెయ్యేళ్ళు ధర్మంగా వర్ధిల్లు’ అనేది ఈ చిత్రానికి ట్యాగ్ లైన్. ‘ఉప్పెన’తో బ్లాక్ బస్టర్ అందుకుని, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ (Global Star Ram Charan)ను ‘పెద్ది’ (Peddi)గా చూపించబోతున్న దర్శకుడు బుచ్చిబాబు సానా (Buchi Babu Sana).. తాజాగా ఈ చిత్ర టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేసి, చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు చెప్పారు.

Also Read- ANR Birth Anniversary: ఏఎన్నార్ జయంతి స్పెషల్‌.. కింగ్ నాగార్జున చేసిన ప్రకటన ఇదే..

టైటిల్‌తోనే క్రియేటివిటీ అర్థమవుతోంది

టైటిల్ గ్లింప్స్‌ విడుదల అనంతరం డైరెక్టర్ బుచ్చిబాబు సానా మాట్లాడుతూ.. ‘ఇట్లు మీ ఎదవ’ గ్లింప్స్ చూశాను, చాలా బావుంది.. ఫన్నీగా వుంది. ప్రతి అబ్బాయికి ఈ టైటిల్ వర్తిస్తుంది. చిన్నప్పటి నుంచి కెరీర్‌లో సెటిల్ అయిన తర్వాత కూడా ఈ టైటిల్ ఎక్కడో ఒక చోట వినబడుతూనే ఉంటుంది. అలాంటి టైటిల్‌ను దర్శకనిర్మాతలు ఈ సినిమాకు పెట్టడం చూస్తుంటేనే వారి క్రియేటివిటీ అర్థమవుతోంది. ఇది మంచి యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌, చూడటానికి చాలా బావుంది. ఈ గ్లింప్స్ విడుదల సందర్భంగా టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతూ.. టీమ్ అందరికీ ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాకు హీరోనే దర్శకుడు కూడా కావడంతో.. సినిమా అద్భుతంగా వస్తుందని, అందరినీ మెప్పిస్తుందని ఆశిస్తున్నానని అన్నారు.

Also Read- OG Movie: తెలంగాణ ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చేసింది.. ప్రీమియర్ షో టికెట్ రేట్ ఎంతంటే..

ఆర్పీ పట్నాయక్ సంగీత దర్శకుడిగా రీ ఎంట్రీ

అనంతరం దర్శక హీరో త్రినాధ్ కఠారి మాట్లాడుతూ.. మేము అడగగానే మా చిత్ర గ్లింప్స్‌ని విడుదల చేయడానికి ఓకే చెప్పిన మా ‘పెద్ది’ దర్శకుడికి ధన్యవాదాలు. మా టీమ్ అందరికీ ఇదొక మెమరబుల్ జ్ఞాపకంగా నిలిచిపోతుంది. ఈ సినిమాతో చాలా గ్యాప్ తర్వాత ఆర్పీ పట్నాయక్ మళ్లీ సంగీతం అందిస్తున్నారు. అలాగే ఇటీవల నాలుగు ఇంటర్నేషనల్ అవార్డ్స్ సాధించిన జగదీష్ చీకటి డీవోపీగా పని చేస్తున్నారు. ఉద్ధవ్ SB ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను రూపొందిస్తున్నాం. ప్రస్తుతం షూటింగ్ పూర్తయింది. నిర్మాణానంతర పనులు శరవేగంగా పూర్తి చేసి, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు సినిమాను తీసుకొస్తాం. నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలిపారు. త్రినాధ్ కఠారి సరసన సాహితీ అవాంచ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో తనికెళ్ల భరణి, గోపరాజు రమణ, దేవీ ప్రసాద్, నవీన్ నేని, సురభి ప్రభావతి, మధుమణి, తాగుబోతు రమేష్, చలాకీ చంటి, జబర్దస్త్ నూకరాజు, జెమినీ సురేష్ వంటి వారు ఇతర పాత్రలలో కనిపించనున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Telangana: జాతీయ రహదారులు ఎందుకు ఆలస్యమవుతున్నాయ్ ..?

Yedupayala Vana Durga: ఏడుపాయలలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పక్కా వ్యూహం!.. మరో రెండు సర్వేలు?

OG Benefit Show: మొత్తానికి సాధించారు.. ఏపీలో బెనిఫిట్ షో టైమింగ్ మారింది!

Haris Rauf controversy: పాక్ బౌలర్ హారిస్ రౌఫ్ భార్య షాకింగ్ పోస్టు.. వివాదానికి మరింత ఆజ్యం