King Nagarjuna on Shiva 4K
ఎంటర్‌టైన్మెంట్

ANR Birth Anniversary: ఏఎన్నార్ జయంతి స్పెషల్‌.. కింగ్ నాగార్జున చేసిన ప్రకటన ఇదే..

ANR Birth Anniversary: నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao) 101వ జయంతి (సెప్టెంబర్ 20) సందర్భంగా ‘శివ’ 4K డాల్బీ అట్మాస్ (Shiva 4K Dolby) రీ రిలీజ్ డేట్‌ని కింగ్ నాగార్జున (King Nagarjuna ప్రకటించారు. 1989లో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘శివ’ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మాతలు అక్కినేని వెంకట్, సురేంద్ర యార్లగడ్డ నిర్మించారు. ఈ సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని నమోదు చేసి, తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచేసింది. ఇండియన్ సినిమాను ‘బిఫోర్ శివ అండ్ ఆఫ్టర్ శివ’గా రీడిఫైన్ చేసిన సినిమాగా ‘శివ’ చిత్రం గ్రేటెస్ట్ ఇండియన్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పటికీ ఈ సినిమా గురించి చర్చలు నడుస్తున్నాయంటే.. సినిమా ఇండస్ట్రీపై ‘శివ’ ప్రభావం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. మళ్లీ ఇన్ని సంవత్సరాలకు ఈ సినిమాను 4K డాల్బీ అట్మాస్‌లో రిలీజ్ చేయబోతున్నట్లుగా రీసెంట్‌గానే ప్రకటన వచ్చింది. తాజాగా ఏఎన్నార్ జయంతిని పురస్కరించుకుని.. ‘శివ’ 4K డాల్బీ అట్మాస్ రీ రిలీజ్ డేట్‌‌ను కింగ్ నాగార్జున అధికారికంగా ప్రకటించారు.

Also Read- Junior movie OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గాలి కిరీటి సినిమా ‘జూనియర్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

నాన్న కలకు నివాళిగా..

ఈ సందర్భంగా కింగ్ నాగార్జున మాట్లాడుతూ.. నాన్న ఎప్పుడూ సినిమాకు తరాలకు మించి జీవించే శక్తి ఉందని నమ్మారు. అదే చెప్పేవారు. నా దృష్టిలో ‘శివ’ అలాంటి ఒక చిత్రమే. నవంబర్ 14న ‘శివ’ చిత్రాన్ని పూర్తిగా కొత్త అవతార్‌లో 4K డాల్బీ అట్మాస్‌తో మళ్ళీ బిగ్ స్క్రీన్ పైకి తీసుకువస్తున్నాము. కథలను ఎప్పటికీ సజీవంగా ఉంచాలనే నాన్న కలకు దీనిని నివాళిగా భావిస్తున్నామని చెప్పారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. నాకు జీవితాన్ని ప్రసాదించిన సినిమా ‘శివ’. కింగ్ నాగార్జున‌కు ఎప్పటికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూనే ఉంటాను. ‘శివ’ సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సారి ప్రేక్షకులు ఇంతకుముందెన్నడూ వినని విధంగా, పూర్తిగా కొత్త అనుభూతిని పొందుతారు. ప్రేక్షకులతో పాటు నేను కూడా ఆ అనుభవాన్ని పొందేందుకు ఎదురుచూస్తున్నానని తెలిపారు.

Also Read- Deepika Padukone: ‘కల్కీ’ నుంచి తప్పించిన తర్వాత దీపికా పదుకొణె ఏం చేస్తుందంటే?

అత్యాధునిక ఏఐ టెక్నాలజీతో..

రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) దర్శకత్వంలో వచ్చిన ఈ కల్ట్‌ క్లాసిక్‌‌ను మళ్లీ బిగ్ స్క్రీన్‌పై చూసేందుకు అక్కినేని అభిమానులతో పాటు ప్రేక్షకులందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. మరోసారి బిగ్ స్ర్కీన్‌పై అదరగొట్టడానికి ఈ సినిమా సిద్ధమైంది. అద్భుతమైన 4K విజువల్స్‌తో పాటు, ఇప్పటి వరకు ఏ రీ-రిలీజ్‌ సినిమాకు లేని విధంగా, డాల్బీ అట్మాస్ సౌండ్‌తో ఈ సినిమా ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. మోనో మిక్స్‌లో ఉన్న శివ సౌండ్‌ను అత్యాధునిక ఏఐ టెక్నాలజీతో రీ-మాస్టర్‌ చేసి, అడ్వాన్స్ డాల్బీ అట్మాస్‌లోకి మార్చారు. వాస్తవానికి అప్పట్లోనే ఈ సినిమా అత్యాధునిక సౌండ్ డిజైన్‌లో ఉంది. ఇప్పుడు రీ-రిలీజ్‌లో తీసుకొచ్చిన టెక్నాలజీ అప్‌గ్రేడ్స్‌తో ఈ సినిమా ప్రేక్షకులకు మరో కొత్త అనుభవాన్ని అందించబోతోంది. రీ రిలీజ్‌లో ఈ సినిమా సృష్టించే సంచనాలను వీక్షించేందుకు నవంబర్ 14 వరకు వెయిట్ చేయక తప్పదు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Telangana: జాతీయ రహదారులు ఎందుకు ఆలస్యమవుతున్నాయ్ ..?

Yedupayala Vana Durga: ఏడుపాయలలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పక్కా వ్యూహం!.. మరో రెండు సర్వేలు?

OG Benefit Show: మొత్తానికి సాధించారు.. ఏపీలో బెనిఫిట్ షో టైమింగ్ మారింది!

Haris Rauf controversy: పాక్ బౌలర్ హారిస్ రౌఫ్ భార్య షాకింగ్ పోస్టు.. వివాదానికి మరింత ఆజ్యం