Nidhhi Agerwal
ఎంటర్‌టైన్మెంట్

Nidhhi Agerwal: మరో గ్రిప్పింగ్ హారర్ థ్రిల్లర్‌‌కు నిధి గ్రీన్ సిగ్నల్..

Nidhhi Agerwal: మంచి వయసు మీద హీరోయిన్లలో నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) ఒకరు. కాకపోతే ఈ టైమ్‌ని వినియోగించుకోవడం మాత్రం ఆమెకు కుదరడం లేదు. కుర్ర హీరోయిన్‌ శ్రీలీల (Sreeleela) ఎలా బిజీగా ఉందో తెలిసిందే. ఆమెకు పోటీ ఇచ్చే అందం, నటన నిధి సొంతం. కానీ, స్టార్ హీరోల సినిమాలు రెండు ఓకే చెప్పి, ఆ రెండు సినిమాలకే అంకితం అయిపోయింది. ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) సినిమా ఎప్పుడు మొదలైందో.. ఎప్పుడు విడుదలైందో అందరికీ తెలిసిన విషయమే. ఇక ప్రభాస్‌తో చేస్తున్న ‘ది రాజా సాబ్’ (The Raja Saab) సినిమా కూడా ఎప్పుడు విడుదల అవుతుందో తెలియని పరిస్థితి. డిసెంబర్‌లో అని అంటున్నారు కానీ, ఇప్పుడా సినిమా కొత్త ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తుంది. దీంతో ఆ సినిమా విడుదల విషయంలో అనుమానాలు నెలకొన్నాయి. మరి ఇవన్నీ గమనించిందో.. లేదంటే తన మిస్టేక్ తెలుసుకుందో తెలియదు కానీ.. ఇకపై వరుస చిత్రాలు చేయాలని నిధి ఫిక్సయినట్లుగా తెలుస్తోంది. ఆమె అలా ఫిక్స్ అయిందో, లేదో.. ఓ సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చేసింది కూడా.

Also Read- King Nagarjuna: తనతో సినిమా చేయమని దర్శకుడి వెంట పడ్డ కింగ్..? ఆ తోపు దర్శకుడు ఎవరంటే?

ఆదివారం (ఆగస్ట్ 17) నిధి అగర్వాల్ పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆమె నటించబోతున్న నూతన చిత్ర అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. ‘ది రాజా సాబ్’ హారర్ థ్రిల్లర్‌లో చేస్తున్న నిధి.. ఇప్పుడు మరో హారర్ థ్రిల్లర్ సినిమాకు సైన్ చేశారు. ఆమె చేయబోతున్న ఈ ప్రాజెక్ట్‌ని మేకర్స్ ఆదివారం అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని జ్యోతి క్రియేషన్స్ (Jyothi Creations) బ్యానర్‌పై పుప్పాల అప్పల రాజు (ఎ.ఆర్.) నిర్మిస్తున్నారు. ఇది ఆ సంస్థకు ప్రొడక్షన్ నంబర్ 1 చిత్రం. ఈ ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్‌తో దర్శకుడిగా నిఖిల్ కార్తీక్. ఎన్ సినీ పరిశ్రమలోకి అరంగేట్రం చేస్తున్నారు. నిధి స్పెషల్ డేను సెలబ్రేట్ చేస్తూ మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసి.. ఈ చిత్ర ప్రకటన చేశారు.

Also Read- Nidhhi Agerwal: ‘ది రాజా సాబ్’.. నిధి లుక్ చూశారా.. షాక్ ఇచ్చారుగా!

ఆ పోస్టర్ ద్వారా నిధి అగర్వాల్‌కు విషెస్ చెబుతూ, రాబోయే సినిమా హారర్ థ్రిల్‌ని ముందుగానే టోన్ సెట్ చేశారు. ఈ సినిమా భారీ స్థాయిలో తెరకెక్కనుందని, హై టెక్నికల్ స్టాండర్డ్స్, టాప్ ప్రొడక్షన్ వాల్యూ‌స్‌తో ప్రేక్షకులకు విజువల్లీ స్ట్రాంగ్ అండ్ ఎమోషనల్ ఇంటెన్స్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వబోతోందని మేకర్స్ చెబుతున్నారు. ఈ సందర్భంగా నిర్మాత పుప్పాల అప్పల రాజు మాట్లాడుతూ.. నిధి అగర్వాల్ తన పాత్రకి అద్భుతమైన చార్మ్ తీసుకోస్తున్నారు. ఈ సినిమా ఆమె కెరీర్‌లో ఓ మైలురాయి అవుతుందనే నమ్మకంతో ఉన్నాం. మా ప్రొడక్షన్ హౌస్‌లో చేస్తున్న మొదటి చిత్రంలోనే ఆమె జాయిన్ అవ్వడం మాకు ఆనందాన్ని కలిగిస్తోంది. ఆమె బిగ్ స్క్రీన్‌పై చూపించబోయే మ్యాజిక్ కోసం మేమంతా ఎదురుచూస్తున్నాం. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ త్వరలోనే తెలియజేస్తాం. దసరాకు చిత్ర టైటిల్‌ని రివీల్ చేస్తామని తెలిపారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?