Bigg Boss 9: ఫస్ట్ ఫైనలిస్ట్ టాస్క్.. సంజనాకు అన్యాయం..
big-boss9-telugu-day-90(X)
ఎంటర్‌టైన్‌మెంట్

Bigg Boss 9: ఫస్ట్ ఫైనలిస్ట్ టాస్క్.. సంజనాకు అన్యాయం.. ఇమ్మూను నిలదీసిన నాగ్!

Bigg Boss 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 దాదాపు చివరి అంకానికి చేరుకుంటుంది. 90 వ రోజు ఈ గేమ్ మరింత రణ రంగంలా మారింది. శనివారం నాగ్ రావడంతో అందరూ చాల సంతోషంగా కనిపించినా ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్న టెన్షన్ వారిని వెంటాడుతుంది. ఈ గందరగోళం వేళ నాగ్ ఎంట్రీ అదిరిపోయింది. అందరూ చాలా సంతోషంగా కనిపించారు. నాగ్ వచ్చిన వెంటనే డిమాన్ పవన్ మాట్లాడుతూ కొంచెం ఫన్ క్రియేట్ చేశారు. పవన్ నువ్వు వేసుకున్న కాస్టూమ్ చాలా బాగుందని చెప్పుకొచ్చారు. ఏంటి ఇప్పుడు దాంట్లో నుంచి పాములు తీస్తావా? పావురాలు తీస్తావా అంటూ అందరినీ నవ్వించారు. తర్వాత దీనీని ఇమ్మానియేల్ ట్రోల్ చేస్తూ అందరినీ నవ్వించాడు. టికెట్ ఫినాలే వచ్చిన పవన్ ను అభినందించారు. తర్వాత రీతూని పాయింట్ చేస్తూ.. ఇమ్మానియేల్, సంజనా టాస్క్ కి సంచాలక్ నువ్వే కదా.. అక్కడ నీ జడ్జ్ మెంట్ ఏమైనా పంతంతో చేశావా అంటూ రీతూ ను అడిగారు. దీనికి రీతూ స్పందిస్తూ.. చాలా క్లారిటీతో చేశాను సార్ అంటూ సమాధానం ఇచ్చింది.

Read also-Gummadi Narsaiah Biopic: ప్రారంభమైన మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య బయోపిక్.. మంత్రి ఏం అన్నారంటే?

నాగార్జున ఇమ్మానుయేల్ ను పిలిచి నువ్వు ఆ గేమ్ సరిగ్గా ఆడావా.. అంటూ ప్రశ్నించారు. దీనికి ఇమ్మానుయేల్ నాకు గుర్తున్నంతవరకూ సరిగ్గానే ఆడాను సార్ అంటూ సమాధానం ఇచ్చారు. దానికి నాగార్జున స్పందిస్తూ.. నువ్వ బాగా ఆడావు అయితే ఈ వీడియో చూడు అంటూ వీడియో ప్లే చేశారు. దాంట్లో ఇమ్మూ తాడు పట్టుకుని ఆడాల్సి ఉండగా దానిని వదిలేశాడు.. దీనిని ఆ టాస్క కు సంచాలక్ గా ఉన్న రీతూ కూాడా పట్టించుకోలేదు. దీంతో వీరిద్దరిపై నాగ్ ఫైర్ అయ్యారు. ఈ టాస్క్ విషయంలో సంజనాకు అన్యాయం జరిగింది. దీంతో నాగ్ ఇమ్మూని ప్రశ్నించగా ఇమ్మూ.. సార్ నేను దానిని బాడీకి పట్టుకునే ఉన్నాను అన్నాడు. దానికి నాగార్జున చేత్తో పట్టుకుని ఉండాలి కదా.. మరి ఎందుకు వదిలేశావు అంటూ అడిగారు. దానికి ఇమ్మానియేల్, నేను అప్పుడు ఏం చేస్తున్నానో తెలియలేదు అన్నాడు. దీంతో నాగార్జున మరి ప్రేక్షకులు చూస్తూ ఊరుకోరు కదా అంటూ చెప్పుకొచ్చారు.  ప్రతీదీ ప్రేక్షకులు చూస్తూనే ఉంటారు, అని అన్నారు. ఏది ఏమైనా మాథ్స్ గేమ్ లో మాత్రం ఇరకొట్టేశావు నువ్వు అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ వారం ఎలిమినేషన్  ఎవరనేది అందినీ టెన్షన్ పెడుతోంది. ఏది ఏమైనా అక్కడ ఏం జరుగుతుందో తెలియాలి అంటే సాయంత్రం వరకూ ఆగాల్సిందే.

Read also-Chiranjeevi MSG: ‘మనవరప్రసాద్ గారు’ నుంచి సెకండ్ సింగిల్ ప్రోమో ‘శశిరేఖ’ కాదు.. ‘కాత్యాయనీ’..

Just In

01

Mowgli Controversy: ‘అఖండ 2’ సినిమా ‘మోగ్లీ’ని డేమేజ్ చేసిందా?.. నిర్మాత స్పందన ఇదే..

Local Body Elections: తెలంగాణ పల్లెల్లో మొదలైన రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్..!

Dharma Mahesh: మరో స్టేట్‌లోనూ మొదలెట్టిన ధర్మ మహేష్..

Kerala Local Polls: కేరళ రాజకీయాల్లో కీలక పరిణామం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం?

Drug Seizure: 70 లక్షల విలువైన మాదక ద్రవ్యాలు సీజ్.. ఎలా పట్టుకున్నారంటే?​