Bigg Boss Telugu 9: బిగ్ బాస్ షో ఎప్పుడు రన్ అవుతుందా అని ఎదురు చూసిన వాళ్ళకి.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 మంచి ప్రారంభమైంది. ఈ సీజన్ కి కూడా కింగ్ నాగార్జున హోస్ట్ చేయడంతో మంచి హైప్ వచ్చింది. వరుసగా కింగ్ నాగ్ కి ఇది ఏడో సీజన్. ఇది స్టార్ట్ అయ్యే వరకు ఒకలా ఉంటుంది. స్టార్ట్ అయ్యాక మాస్ మసాలా యాడ్ చేస్తారు. బిగ్ బాస్ గురించి మనకీ తెలిసిందేగా.. కొంచం తేడా వచ్చినా.. అప్పటి వరకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఒక్కసారిగా ఫైర్ అవుతారు. చూసే ఆడియెన్స్ కూడా.. వామ్మో మీ ఓవర్ యాక్షన్ ఆపండిరా బాబు .. ఇదొక షో నా .. ఇక చాలు ఆపండంటూ మండి పడతారు. అయితే, ఈ సీజన్ మొత్తం కొత్తగా ఉండబోతుంది. రణరంగం అంటే యుద్ధభూమి. ఈసారి చదరంగం కాదు, రణరంగమే అనే ట్యాగ్ లైన్ తో ఈ సీజన్ ఆన్ ఫైర్ లా మొదలైంది.
బిగ్ బాస్ మొదటి వారం ఎవరూ ఊహించని విధంగా.. సంజన కెప్టెన్సీ టాస్క్ లో గెలిచి బిగ్ బాస్ 9 కి మొదటి కెప్టెన్ గా నిలిచింది. అలాగే, శ్రష్టి వర్మ ఎలిమినేట్ అవ్వడం కూడా షాకింగ్ లాగా ఉంది. ఎందుకంటే, ఈ ముద్దుగుమ్మ కొన్ని వారాల పాటు హౌస్ లో ఉంటుందని చాలా మంది అనుకున్నారు. కానీ, ఆమె ఎలిమినేట్ అవ్వడంతో ఈ సారి మనం గెస్ చేసిన విధంగా.. ఉండదని అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. అయితే, డే 11 ప్రోమో రిలీజ్ చేశారు. రెండో వారం.. కెప్టెన్సీ కోసం రచ్చ మొదలైంది.
బుధవారం జరిగిన టాస్క్ లో నిజాయితీగా ఎవరు లేరు? బిగ్ బాస్ ఫ్యాన్స్ కే ఈ సారి పరీక్ష పెడుతున్నారు. మీకు దండం రా బాబు.. ? మేము ఎంత పాజిటివ్ గా తీసుకుందామన్నా? మాకు ఎక్కడం లేదు? ఒక రోజు మంచిగా ఉంటే.. ఇంకో రోజు చూడటానికే మాకు చిరాకుగా ఉంటుంది. డిమోన్ పవన్ కాదు .. అతను కరువు బిడ్డ. బిగ్ బాస్ సీజన్ 8 లో పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ అని ఎలా మోసం చేసాడో? ఈ సారి పవన్ కూడా రీతూ తో పులిహోర కలుపుతూనే ఉన్నాడంటూ కామెంట్స్ చేస్తున్నాడు.