Bigg Boss 9: బిగ్ బాస 9 తెలుగు ఈసారి ఎంటర్ టైన్మెంట్ పీక్స్ లో ఇస్తుంది. ఎప్పుడూ వివాదాలు, సరదాలే కాకుండా ఈ సారి ఎమోషన్ కు కూడా ప్రాధాన్యత ఇస్తుంది. ఈ రోజు బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ హౌస్ లోని సభ్యులందరినీ ఓకింత ఎమోషన్ కు గురిచేసింది. అదేంటో వివరంగా తెలుసుకుందాం. బాల్యం ప్రతి ఒక్కరి జీవితంలో అందమైన సమయం వేలు పట్టుకుని నడవడం కొత్త విషయాలు నేర్చుకోవండం, అలవాట్లు ఆశయాలు, ఆశలు అన్నీ మొదలయ్యేది బాల్యంలోనే అలాంటి బాల్యం గురించి అందరినీ అడిగి తెలుసుకుందాం అంటూ బిగ్ బాస్ తెలిపింది. ఈ టాస్క్ లో ప్రతి ఒక్కరూ తమ చిన్న తనంలో దిగిన ఫోటోలను ప్రదర్శించారు. అప్పట్లో జరిగిన సంఘటనలను చెప్పమన్నారు. దీంతో తమ ఆంతరంగాలను పంచుకున్న సభ్యలు ఎమోషన్ అయ్యారు.
Raed also-Telusukada OTT: ఓటీటీలోకి వచ్చేసిన సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసుకదా’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
సభ్యుల చిన్ననాటి ఫోటోలను ప్రదర్శనకు ఉంచారు. ఒక్కొక్కరినీ వారు అంతరంగాలను పంచుకోమన్నారు. ముందుగా తనూజ ముందుకు వచ్చి ‘నా జీవితంలో సూపర్ హీరో మా అమ్మ ఆమె లేకపోతే నేను ఇక్కడ లేను. నేను చేయలేను అన్నప్పుడు లేదు నువ్వు చేయగలవు అంటూ నన్ను ముందుకు తోసింది. ఆమె అలా చేయబట్టే నేను ఇప్పుడు ఇలా ఉన్నాను. నా జీవితంలో నా సూపర్ హీరో మా అమ్మ. ఇదంతా నీవల్లే సావిత్రి ఐలవ్ యూ’ అంటూ ఎమోషన్ అయ్యారు. దీంతో హౌస్ లోని సభ్యులు అందరూ ఆమె చెప్పిన విషయానికి కంటతడి పెట్టుకున్నారు. అనంతరం వచ్చిన ఇమ్మానియేల్ తన చిన్న నాగు జరిగిన సంఘటనలను తలుచుకుని ఎమోషన్ అయ్యారు. ‘నన్ను కనడం ఇష్టం లేదు మా అమ్మకు ఎందుకంటే.. ఆ రోజుల్లో మాకు తినడానికి తిండికూడా ఉండేది కాదు. ఎం చేయాలో తెలియని మా అమ్మ మట్టి తింటూ బతికింది. అలాంటప్పుడు నన్ను కనడం కరెక్ట్ కాదు అనిపించింది మా అమ్మకు. కానీ ఏదోలా వచ్చేశారు. నా జీవితంలో సూపర్ హీరో మా అన్నయ్య ఎందుకంటే.. నన్ను అసలు పని చయనిచ్చేవాడు కాదు. నేను ఇవవై బస్తాలు మోయాల్సి వస్తే.. వాడు పదిహేను బస్తాలు మోసేసేవాడు. నాకు ఏ కష్టం కలుగ కుండా చూసుకున్నాడు. వాడే నా సర్వస్వం అంటూ ఎమోషనల్ అయ్యారు. ఈ ఘటన బిగ్ బాస్ సభ్యులను కంటతడి పెట్టించింది. తర్వాత పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు సభ్యులను మరింత ఎమోషన్ కు గురిచేశాయి. ఆయన ఏం చెప్పడంతో అందరూ అంత్ ఎమోషన్ కు గురయ్యారో తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే.
Read also-Guddi Maruti: ‘ఖిలాడి’లో అక్షయ్ కుమార్‌తో చేసిన కిస్సింగ్ సీన్ గుర్తుచేసుకున్న నటి
