Bigg Boss9 Telugu: బుల్లి తెర ప్రేక్షకులు అమితంగా ఇష్టపడే బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 పోరు రోజు రోజుకూ రణ రంగంలా మారుతోంది. 95 వ రోజు ఈ షో మరింత రసవత్తరంగా మారుతోంది. తాజాగా జరిగిన షో అన్నింటిలోనూ లీడర్ బోర్టు ఎనౌన్స్ చేశారు.. దీనిలో అందరి కంటే ముందు ఉన్నది భరణి అయితే చివరిన ఉన్నది సుమన్ శెట్టి. దీంతో బిగ్ బాస్ ఓ నిర్ణయం తీసుకుంది. అదేంటంటే.. లీడర్ బోర్డులో తక్కువ స్కోరు ఉన్నవారు వచ్చే టాస్క్ నుంచి తప్పుకోవాల్సి ఉంటుందని బిగ్ బాస్ నిర్ణయం తీసుకున్నారు. ఈ పోరు నుంచి తప్పుకునే ముందు మీకు ఉన్న లక్ష పాయింట్లను టీమ్ లోని ఎవరికైనా డొనేట్ చేయవచ్చు.. అని చెప్పారు. ఇది విన్న సుమన్ శెట్టి ఎమోషనల్ కు గురయ్యారు. టీం సభ్యులు అందరూ కన్నీటి పర్యంతం అయ్యారు. అంటే తర్వాత ఆడే గేమ్ లో సుమన్ శెట్టి ఆడటంలేదు అని తెలుసుకున్న భరణి అయితే కళ్లలో నీళ్లు ఆపుకోలేక పోయారు. దీంతో ఏం చేయాలో తోచని తనూజా సుమన్ శెట్టిని ఓదార్చింది. బిగ్ బాస్ నిర్ణయం కొంత మందిని బాధ పెట్టినా మరి కొంత మందికి మాత్రం ఒకరు తప్పుకున్నారని లోలోపల సంతోషపడ్డారు.
Read also-Ram Setbacks: రామ్ పోతినేని ‘ఆంధ్రకింగ్ తాలూకా’ క్లోజింగ్ రిపోర్ట్.. ఆ రికార్డుల్లోకి మరో సినిమా..
దీంతో సుమన్ శెట్టి నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం తీసుకున్నారు. భరణితో చర్చించారు. అందులో అసలు నా దగ్గర ఉన్న పాయింట్లు మీకే ఇవ్వాలి అనుకుంటున్నాను అని చెప్పారు. దానికి భరణి.. నా దగ్గర ఉన్నవి చాలు వీటిని వేరే వారి కోసం ఉపయోగించు నా తర్వాత ఎవరికి ఇద్దామనుకుంటున్నావు.. వారికి ఇవ్వు అని సమాధానం ఇచ్చారు. దానికి మీ తర్వాత ఆ పాయింట్లను సంజనకు ఇద్దాం అనుకుంటున్నాను అని చెప్పారు. దానికి భరణి కూడా మంచి నిర్ణయం తీసుకున్నారు.. అని అన్నారు. అయితే ముందుగా ఈ విషయాన్ని సంజనతో చెప్పడానికి వెళ్లారు. అక్కడ సంజనతో తన దగ్గర ఉన్న పాయింట్లును నీకు ఇవ్వడానికి వచ్చాను అని చెప్పడంతో సంజన్ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు.. నాకు ఎవరినైనా ఏమైనా అడగటం మొహమాటం అందుకే అడగలేక పోయాన అంటూ కన్నీరు పెట్టుకున్నారు. దీంతో బిగ్ బాస్ హౌస్ మొత్తం ఒక్క సిరిగా షాక్ కి గురయ్యారు. ఇదే విషయాన్ని బిగ్ బాస్ కి కూడా చెప్పారు. దీంతో తర్వాత టాస్క్ మొదలైంది.
Read also-Akhanda 2 Thaandavam: తెలంగాణలోనూ టికెట్ల పెంపు, ప్రీమియర్‌కు అనుమతి.. వివరాలివే!
ఈ రోజు పోటీదారులకు ఇస్తున్న యుద్ధం ఇది జోకర్, దీంట్లో మిగిలిన సభ్యుల ఎలా ఆడారు? సంచాలక్ గా ఉన్న భరణి ఎవరికైనా సపోర్టివ్ గా మాట్లాడాడా.. అసలు గేమ్ లో ఎవరు నగ్గారు.? అనే విషయాలు తెలియాలి అంటే సాయంత్రం వరకూ ఆగాల్సిందే..

