Bigg Boss 9 Telugu ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Bigg Boss Telugu 9: ఈ ప్రోమోతో ఇక ఫిక్స్ అయినట్టేనా.. ట్విస్ట్ అదిరింది బిగ్ బాస్?

Bigg Boss Telugu 9:  బిగ్ బాస్ సీజన్​ 9 ఈ సారి ఎవరి ఊహకి అందడం లేదు. అయితే, ఎనిమిదో వారం నామినేషన్స్ ప్రక్రియ రసవత్తరంగా సాగిన విషయం అందరికి తెలిసిందే. ఈ వారం మాధురి, రీతూ చౌదరి, తనూజ, కల్యాణ్, డిమోన్ పవన్, సంజన, రాము, గౌరవ్ నామినేషన్స్​లో ఉన్నారు. అయితే, ఇంటి నుంచి వెళ్ళిపోయిన వారిలో ఇద్దర్ని తీసుకుంటామని ముందే చెప్పాడు. ” ఇంటిలో ఉండే హౌస్ మేట్ గా అవకాశం” శ్రీజ, భరణీ ఇద్దరికి ఇచ్చారు. గత మూడు రోజుల నుంచి ఈ ఇద్దరికి సంబంధించిన టాస్క్ లు జరుగుతున్నాయి.

Also Read: Janagam: కాసేపట్లో ఇంటికి వచ్చేస్తానమ్మా.. అని చెప్పిన కొద్దిసేపటికే వరదలో యువతి గల్లంతు.. జనగాంలో విషాదం

బిగ్ బాస్ సీజన్​ 9 డే 54 ప్రోమో రిలీజ్ అయింది. దీనిలో రెండు ఆసక్తికరమైన అంశాలు కనిపించాయి. మాధురి లేట్ గా లేచినట్లు ఉంది. ఆమెకి  బిగ్ బాస్ పనిష్మెంట్ ఇచ్చినట్లు తెలుస్తుంది.  శ్రీజ, మాధురి దగ్గరికి వెళ్ళి అమ్మా లే అని గట్టిగా అరవడంతో ఆమె లేచింది. అప్పుడు మాధురిని చూసి అందరూ నవ్వారు.  ఇక ఇంకో అంశం ఏంటంటే..  భరణి, శ్రీజ మీ ముందున్న రెండు బాక్స్ ల్లో ప్రేక్షకుల ఇచ్చిన తీర్పు ఉందని బిగ్ బాస్ చెప్పాడు. అక్కడున్న బాక్స్ లను బద్దలు కొట్టి ప్రేమ్స్ ను స్టాండ్ పై పెట్టండని సినిమా లెవెల్లో హైప్ ను అయితే క్రియోట్ చేశారు. ఇద్దరిలో భరణి ఉన్నట్లు తెలుస్తుంది. శ్రీజ వెళ్లిపోయినట్లు అర్దమవుతుంది. అయితే, ఎపిసోడ్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

Also Read: IND-W vs AUS-W Records: సెమీస్‌లో జెమీమా రోడ్రిగ్స్ మైల్‌స్టోన్ ఇన్నింగ్స్.. బద్దలైన రికార్డ్స్.. అమ్మాయిలు ఇరగొట్టేశారు!

నేటి ప్రోమో పై నెటిజెన్స్ రియాక్షన్ ఇదే.. 

దీని పై నెటిజెన్స్ రక రకాల కామెంట్స్ చేస్తున్నారు. ఎలా అయినా శ్రీజ వెళ్లాలనే ప్లాన్ చేసినప్పుడు ఈ మాత్రం రీ ఎంట్రీ అని బిల్డ్ అప్ ఎందుకు.. డైరెక్ట్ గా అదే ఏవి చూపించడానికి మాత్రమే అని పిలిచాము అని చెప్పి ముందే పంపించవచ్చుగా. ఈ సీజన్ అంత వరస్ట్ ఏది లేదు. జస్టిస్ చేయాలి అనుకుంటే డైరెక్ట్ గా ఇద్దర్ని తీసుకోవచ్చు. కానీ, మీరు కావాలనే తీశారు. అసలు భరణి హౌస్ లో ఎందుకు. గట్టిగా వేరే వాళ్ళ మీద కూడా అరవలేరు. ఆయనకు గాయం అయిందని టాస్క్ లో తను ఆడకుండా తన బదులు దివ్య ఆడింది. ఇక్కడే తెలిసిపోతుంది కదా భరణి అన్ ఫిట్ అని, మరి అలాంటప్పుడు శ్రీజకి అవకాశం ఇవ్వాలి కదా. భరణిని ఎలా తీసుకున్నారు. ఈ సీజన్లో ఎలా ఉంది అంటే తండ్రికి చెప్పకుండా బిగ్ బాస్ హౌస్ లోకి రావాలి. అప్పుడు విన్నర్ ను చేస్తారు. ఇంకెందుకు గేమ్స్ పెట్టడం.. వరెస్ట్ బిగ్ బాస్. శ్రీజ రీ ఎంట్రీ TRP కోసం మాత్రమే పెట్టారనిపిస్తుందని నెటిజన్స్ కూడా మండిపడుతున్నారు.

Just In

01

Mega concert 2025: ఏఆర్ రెహమాన్ మెగా కాన్సర్ట్ డేట్ ఫిక్స్.. పెద్ది సాంగ్ వచ్చేది అప్పుడేనా?..

Telangana Govt: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. రూ.1,032 కోట్లు విడుదల.. డిప్యూటీ సీఎం ఆదేశం

EAD Policy: భారతీయులను ఇబ్బందిపెట్టేలా ట్రంప్ మరో నిర్ణయం.. అమెరికాలో ఉన్న మనోళ్ల ఉద్యోగాలకు ముప్పు!

Viral Video: సెలైన్ బాటిల్‌తో వీధుల్లో తిరిగిన రోగి.. అంత అర్జంట్ పని ఏంటో? ఇదిగో వీడియో

Yadadri Bhuvanagiri: అధికార పార్టీ నాయకుడి అండతో ఇష్టారాజ్యం.. ఎమ్మెల్యే పేరు బదనాం చేస్తున్న వైనం!