Bigg Boss Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ మరింత రసవత్తరంగా మారింది. వైల్డ్ కార్డ్స్ ఎంట్రీతో హౌస్ లో విపరీతంగా గొడవలు చోటుచేసుకుంటున్నాయి. మాధురి వర్సెస్ దివ్య, మాధురి వర్సెస్ కళ్యాణ్, అయేషా వర్సెస్ రీతూ వివాదాలతో బిగ్ బాస్ ఇల్లు మార్మోగిపోయింది. ఈ క్రమంలోనే గురువారం హౌస్ లో కెప్టెన్సీ కంటెండర్ షిప్ టాస్క్ నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను తాజాగా నిర్వాహకులు విడుదల చేశారు.
ప్రోమోలో ఏముందంటే?
ప్రోమో ప్రారంభంలో కెప్టెన్సీ కంటెండర్ షిప్ టాస్క్ కు సంబంధించిన రూల్స్ ను బిగ్ బాస్ వివరించారు. ఫైర్ స్టోర్మ్స్ (వైల్డ్ కార్డ్స్) సభ్యులతో పాటు.. వారు ఎంచుకున్న హౌస్ మెట్స్ కెప్టెన్సీ కంటెండర్ షిప్ టాస్క్ లో తలపడతారు. టాస్క్ లో భాగంగా మధ్యలో ఒక బంతిని పెట్టి.. ఇరువైపుల ఒక చిన్న గోల్ఫ్ కోర్ట్ ను ఏర్పాటు చేశారు. రెండు జట్లుగా విడిపోయిన ఇంటి సభ్యులు.. బజర్ మోగగానే ఎదురుగా ఉన్న గోల్ఫ్ లో బంతిని వేయాల్సి ఉంటుందని బిగ్ బాస్ తెలియజేశారు.
Also Read: Peddi movie update: ‘పెద్ది’ గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన దర్శకుడు.. ముందు వచ్చేది ఏంటంటే?
ఫస్ట్‌లోనే భరణి ఔట్..
అయితే ప్రోమోను గమనిస్తే.. వైల్డ్ కార్డ్స్ తమ అపోనెంట్ టీమ్ సభ్యులుగా భరణి, సంజన, సుమన్ శెట్టి, దివ్య, తనూజాలను ఎంచుకున్నారు. ఇక బజర్ మోగగానే వైల్డ్ కార్డ్స్ కు వారికి మధ్య బంతి కోసం మినీ యుద్ధమే జరిగింది. బాల్ కోసం తలపడుతున్న క్రమంలో ఇంటి సభ్యులు కిందపడిపోవడం.. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన అలేఖ్య పికిల్స్ రమ్య తలకు గాయం కావడం ప్రోమోలో చూడవచ్చు. ఈ క్రమంలో విజయవంతంగా గోల్ఫ్ వేసిన వైల్డ్ కార్డ్స్.. ఎదుటి టీమ్ లోని భరణిని గేమ్ నుంచి ఔట్ చేశారు. భరణిని గేమ్ నుంచి ఎలిమినేట్ చేస్తున్నట్లు మాధురి ప్రకటించడం ప్రోమోలో చూడవచ్చు.
