Bigg Boss Telugu 9 Nominations
ఎంటర్‌టైన్మెంట్

Bigg Boss Telugu 9: వైల్డ్ కార్డు ఎంట్రీస్‌కు లింక్ పెట్టి నామినేషన్స్.. ఏం ప్లాన్ చేశావయ్యా?

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss Telugu Season 9)లో 36వ రోజు నామినేషన్స్ రచ్చ మొదలైంది. హౌస్ నుంచి 5వ వారం ఫ్లోరా, శ్రీజ ఎలిమినేటైన విషయం తెలిసిందే. కొత్తగా ఆరుగురు కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్‌లోకి అడుగు పెట్టారు. వారి ఎంట్రీతో.. నాగార్జున చెప్పినట్లుగా బిగ్ బాస్ కొత్తగా మొదలైనట్లుగా అనిపిస్తుంది. అందులోనూ ఈసారి ముగ్గురు ఆడవాళ్లు, ముగ్గురు మగవాళ్లు హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికే హౌస్‌లో ఉన్న మగవాళ్లు.. మంచి అమ్మాయిని పంపించు బిగ్ బాస్ అని కోరుకుంటున్న క్రమంలో.. రమ్య, అయేషా రూపంలో వారి కోరికను తీర్చేశారు. మరి వీరితో హౌస్‌లోని వారు నడిపే కథలు ఎలా ఉంటాయో తెలియాలంటే.. బిగ్ బాస్‌ని ఫాలో అవ్వాల్సిందే. ఇక 36వ రోజు నామినేషన్స్‌కు సంబంధించి కొత్తగా హౌస్‌లోకి వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌‌కు లింక్ పెట్టి మరీ బిగ్ బాస్ నామినేషన్స్ రచ్చ స్టార్ట్ చేయించాడు. ఈ ప్రోమోలో ఏముందంటే..

Also Read- Telusu Kada Trailer: ఇద్దరు భామలతో స్టార్ బాయ్ రొమాన్స్.. ట్రైలర్ ఎలా ఉందంటే..

నామినేషన్స్ రచ్చ ఇలా మొదలైంది

‘‘ఇంట్లోకి ఫైర్ స్ట్రోమ్స్ రాకతో.. ఈ గేమ్ దిశ మారింది. ఈ వారం ఎవరు నామినేటై, ఈ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లాలో నిర్ణయించే శక్తి ఫైర్ స్ట్రోమ్స్ చేతుల్లో ఉంది. దీనికోసం నేను ఇస్తున్న టాస్క్ బాల్ ఆఫ్ ఫైర్. బజర్ మోగే సమయానికి ఏ వైల్డ్ కార్డు సభ్యుని దగ్గర బాలు ఉంటుందో, వారు ఇంటి సభ్యులలోని ఒకరిని ఎంచుకుని ఆ బాలును వారికి ఇవ్వాలి..’’ అని బిగ్ బాస్ చెప్పారు. బిగ్ బాస్ చెప్పిన విధంగా బాలు అందుకున్న వైల్డ్ కార్డ్ ఎంట్రీస్.. ఫస్ట్ తనూజకు బాలు ఇచ్చారు. ఆమె సుమన్ శెట్టి, రాముని నామినేట్ చేసింది. వారిద్దరితో కాసేపు వాగ్వివాదం నడించింది. రెండో రౌండ్‌లో బాలు గెలిచిన రమ్య.. రాము రాథోడ్‌కి ఇచ్చింది. రాము వచ్చేసి రీతూ, పవన్‌లను నామినేట్ చేశారు. రీతూ, రాముల మధ్య ఓ రేంజ్‌లో రచ్చ జరుగుతోంది. చూస్తుంటే ఈ వారం నామినేషన్స్ ఫైర్ మాములుగా ఉండదనే హింట్‌ని బిగ్ బాస్ ఈ ప్రోమోతో ఇచ్చేశారు.

Also Read- Tollywood: డబ్బులిచ్చి ఇంటర్వ్యూలు చేయించుకుంటూ.. మళ్లీ ఈ సారీలు చెప్పించుకోవడం ఏంటి?

హౌస్‌ని ఎలా రక్తి కట్టిస్తారో!

రమ్య మోక్ష (అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య), శ్రీనివాస్ సాయి, దువ్వాడ మాధురి, నిఖిల్ నాయర్, అయేషా, గౌరవ్ గుప్తా కొత్తగా హౌస్‌లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చారు. ఇందులో ఆల్రెడీ హౌస్‌లో ఉన్న అమ్మాయిలతో కొత్తగా వచ్చిన అబ్బాయిలు ఎలా కనెక్ట్ అవుతారు? అలాగే అబ్బాయిలు కోరుకున్న అమ్మాయిలను కొత్తగా బిగ్ బాస్ పంపించాడు కాబట్టి.. వారు ఏ రేంజ్‌లో హౌస్‌ని రక్తి కట్టిస్తారనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఆల్రెడీ హౌస్‌లో ప్రేమ పవనాలు మొదలైన క్రమంలో.. ఈ న్యూ ఎంట్రీ ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో తెలియాలంటే మాత్రం.. వెయిట్ అండ్ సీ..

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?