Bigg Boss Promo: బిగ్ బాస్ తెలుగు సీజన్ – 9లో 34వ రోజైన శనివారానికి సంబంధించి రెండో ప్రోమోను విడుదల చేశారు. మెుదటి ప్రోమో తరహాలో ఇది కూడా హై ఓల్టేజ్ తో సాగింది. ఈ ప్రోమో ప్రధానంగా సుమన్ శెట్టి, రీతూ, డెమోన్ కళ్యాణ్ చుట్టూ తిరిగింది. చివర్లో పవర్ అస్త్రాను తెరపైకి తీసుకొచ్చి హోస్ట్ నాగార్జున ఇంటి సభ్యులకు బిగ్ షాక్ ఇచ్చారు.
ప్రోమోలో ఏముందంటే?
రెండో ప్రోమో ప్రారంభం కాగానే హోస్ట్ నాగార్జున.. ఇంటి సభ్యుడు సుమన్ శెట్టితో మాట్లాడారు. అయితే స్విమ్మింగ్ పూల్ వాటర్ టాస్క్ లో గేమ్ రూల్స్ కు విరుద్ధంగా సుమన్ సపోర్ట్ తీసుకున్నారని ఆరోపిస్తూ సంచాలకురాలు ఫ్లోరా అతడ్ని ఔట్ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆ టాస్క్ గురించి ప్రస్తావించినా నాగార్జున.. నిజంగానే సపోర్ట్ తీసుకున్నావా? అంటూ సుమన్ శెట్టిని ప్రశ్నించారు. అయితే తాను ఎలాంటి సపోర్ట్ తీసుకోలేదని సుమన్ తెగేసి చెప్పారు. దీంతో నాగార్జున దానికి సంబంధించిన వీడియోను ప్లే చేయడం ప్రోమోలో చూడవచ్చు. అయితే అతడు టచ్ చేసినట్లు కనిపించకపోవడం, ఆడియన్స్ ఒపీనియన్ కూడా అదే కావడంతో సంచాలకులకు నాగ్ చురకలు అంటించారు.
రీతూ, డెమోన్ పై ఫైర్
మరోవైపు ప్రోమోలో రీతూను ఉద్దేశించి హోస్ట్ నాగార్జున మాట్లాడారు. ‘బెలూన్ టాస్క్ లో ఎంత బ్రిలియంట్ ఐడియా వచ్చింది రీతూ నీకు (వ్యంగ్యంగా). ఊదుతూ గాల్లో ఉంచాలని చెబితే కార్నర్ లో వేసేశావు. అది గాల్లో ఉన్నట్లా?. నిన్ను చూసి మిగతా వారందరూ అదే పద్దతిలో ఆడారు’ అని మండిపడ్డారు. అయితే తాను సంచాలకులుగా ఉన్న ఇమ్యాన్యుయెల్, రాములను అడిగానని రీతూ సమాధానం చెబుతుంది. కానీ ఆమె మాటలను ఇమ్మాన్యూయెల్ ఖండించడం ప్రోమోలో చూడవచ్చు. మరోవైపు గ్లాస్ టాస్క్ లో చివరి గ్లాస్ ను రీతు సరిగ్గా పెట్టకపోవడంతో నీకు ఎందుకంత కోపం వచ్చింది? అని డెమోన్ పవన్ ను నాగార్జున ప్రశ్నిస్తారు. ‘మాడు ముఖం వేసుకొని అలిగి మూలన కూర్చున్నావ్. అడిగినవారికి రీతూ గురించి తప్పుగా చెప్పావ్. ఆటోమేటిగ్గా ఆమెకు బాధ వస్తుంది కదా?’ అని నాగ్ అన్నారు.
Also Read: Indian Railways: శుభకార్యాల కోసం రైలు కావాలా? ఇలా చేస్తే బోగీ మెుత్తం మీదే..!
బయటకొచ్చిన పవర్ అస్త్రా
ఇక ప్రోమో చివరిలో అందరి సమక్షంలో హోస్ట్ నాగార్జున పవర్ అస్త్రాను బయటకు తీశారు. ఒక్కసారిగా ఇంటి సభ్యులు ఆశ్చర్యపోతారు. సాధారణంగా ప్రతీ సీజన్ లోనూ పవర్ అస్త్రా తెరపైకి వస్తుంటుంది. దీనిని పొందిన ఇంటి సభ్యుడు.. ఎలిమినేషన్ నుంచి తనను కాపాడుకోవచ్చు, లేదంటే ఇంకొకరిని సేవ్ చేయడానికి ఉపయోగించవచ్చు. అయితే అందరి కంటే ముందు గోల్డ్ స్టార్ సంపాదించిన ఇమ్మాన్యూయెల్ కు ఈ పవర్ అస్త్రా దక్కినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో అతడు ఈ వారం ఎవరినైనా సేవ్ చేస్తాడా? నామినేషన్స్ లో లేనందున తన కోసం అస్త్రాన్ని దాచుకుంటాడా? అన్నది తెలియాల్సి ఉంది.
