Aditya Om in Bandi Movie
ఎంటర్‌టైన్మెంట్

Bandi: ఈ బిగ్‌బాస్ కంటెస్టెంట్ ‘బంధీ’ అవుతాడా..

Bandi Movie: ‘లాహిరి లాహరి లాహిరిలో’ సినిమాతో హుషారుగా కనిపించి అందరి కంట్లో పడిన నటుడు ఆదిత్య ఓం. ఆ సినిమా తర్వాత ఆయన కొన్ని సినిమాలు చేసినా, అంత పెద్దగా గుర్తింపు అయితే రాలేదు. దీంతో కొంతకాలం గ్యాప్ తీసుకున్న ఆదిత్య ఓం, తిరిగి మళ్లీ ‘బిగ్ బాస్’ రియాలిటీ షో‌లో దర్శనమిచ్చి తన ఉనికిని చాటుకున్నాడు. ఇప్పుడు మరోసారి నటుడిగా వరుస చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించి, ప్రేక్షకుల మదిలో ‘బంధీ’ అవ్వాలని చూస్తున్నాడు. అవును, ఆయన ‘బంధీ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అందుకే సాధారణమైన సినిమాతో కాకుండా ఆసాధారణమైన సినిమాతో ఆడియన్స్‌ని ‘బంధీ’ చేసేందుకు సిద్ధమయ్యాడు.

Also Read-  Allu Arjun: ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌కు ఆ ఫోబియా పోలేదా!

వాతావరణ పరిరక్షణపై సామాజిక సందేశాన్ని అందిస్తూ ఆదిత్య ఓం చేసిన ప్రయోగాత్మక చిత్రం ‘బంధీ’. రఘు తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రం గల్లీ సినిమా బ్యానర్‌పై రూపుదిద్దుకుంటోంది. వెంకటేశ్వర్ రావు దగ్గు, రఘు తిరుమల నిర్మాతలు. ఇప్పటికే ఈ చిత్రాన్ని పలు అంతర్జాతీయ వేదికలపై జరిగిన చలన చిత్రోత్సవాలలో ప్రదర్శించగా.. ఎన్నో ప్రశంసలని ఈ సినిమా దక్కించుకుంది. భారతదేశపు మొట్టమొదటి పర్యావరణ నేపథ్యంతో తెరకెక్కిన థ్రిల్లర్‌గా ‘బంధీ’ రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమాలో ఆదిత్య ఓం పాత్ర ఎదుర్కొనే పరిస్థితులు, వాతావరణ సమస్యలపై పోరాడే తీరు అద్భుతంగా ఉంటుందని చిత్రయూనిట్ చెబుతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది.

భారతదేశంలోనే కాకుండా విదేశాల్లోని అనేక అటవీ ప్రాంతాలలో, రియల్ లొకేషన్స్‌లో ఈ ‘బంధీ’ చిత్రాన్ని తెరకెక్కించామని, అద్భుతమైన విజువల్స్‌ను ఈ చిత్రంలో ప్రేక్షకులు చూస్తారని, పర్యావరణ ప్రేమికులందరినీ కదిలించేలా ఈ చిత్రం ఉంటుందని టీమ్ చెబుతోంది. ఆదిత్య ఓం చేసిన ఎన్నో రియల్ స్టంట్స్, అటవీ ప్రాంతంలో ఎదుర్కొన్న ఛాలెంజ్‌లు మూవీ లవర్స్‌ని ఆకర్షిస్తాయని అంటున్నారు. ఇక ఈ సినిమాను ఫిబ్రవరి 28న విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ముందు కొన్ని పరిమిత స్క్రీన్లలో విడుదల చేసిన అనంతరం, రెస్పాన్స్‌ను బట్టి మరిన్ని థియేటర్లలోకి ఈ సినిమాను విడుదల చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈలోపు చిత్ర ప్రమోషన్స్ కోసం ఎన్‌జిఓలు, సామాజిక సంస్థలతో కలిసి సినిమాను ప్రమోట్ చేయనున్నామని చిత్ర నిర్మాతలు తెలిపారు.

ఇవి కూడా చదవండి: 

Laila Movie: డామిట్.. ‘లైలా’ బట్టలు, మేకప్ ఖర్చు కూడా రాలేదా?

Harish Shankar Leaks: ఆశలు పెట్టుకోకు.. ‘ఉస్తాద్ భగత్ సింగ్‌’లో ఆ సీన్ వాడేశా!

Just In

01

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?

Tummala Nageshwar Rao: రైతులకు గుడ్ న్యూస్.. ఇకపై రైతు వేదికల వద్ద యూరియా అమ్మకం

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్