Ritu, Pawan, Sanjjanaa
ఎంటర్‌టైన్మెంట్

Bigg Boss9 Telugu: హౌస్‌లోకి.. రీతూ చౌదరి, డీమాన్ పవన్, సంజన!

Bigg Boss9 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss Telugu Season 9) గ్రాండ్‌గా మొదలైంది. సెప్టెంబర్ 7, ఆదివారం ఈ షో‌ని గ్రాండ్‌గా కింగ్ నాగ్ ప్రారంభించారు. మొదటి హౌస్‌మేట్‌గా తనూజ, రెండో హౌస్‌మేట్‌గా హీరోయిన్ ఫ్లోరా షైనీ, మూడో హౌస్‌మేట్‌గా కామనర్ కళ్యాణ్ పడాల అడుగు పెట్టారు. నాలుగో హౌస్‌మేట్‌‌గా జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యుయెల్, 5వ హౌస్‌మేట్‌‌గా కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ, ఆరో హౌస్‌మేట్‌‌గా కామనర్ మాస్క్ మ్యాన్ హరీష్, ఏడవ హౌస్‌మేట్‌‌‌గా నటుడు భరణి అడుగు పెట్టారు. ఇప్పుడు ఎనిమిది, తొమ్మిది, పదవ హౌస్‌మేట్స్ వివరాల్లోకి వెళితే..

ఎనిమిదవ హౌస్‌మేట్‌‌: రీతూ చౌదరి (Ritu Chaudhary)

బిగ్ బాస్ హౌస్‌లో 8వ కంటెస్టెంట్‌గా నటి రీతూ చౌదరి అడుగు పెట్టారు. ఓ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తర్వాత ఆమెను దివ్య అని నాగ్ పిలిచారు. ఆ పేరుతో తనని పిలవవద్దని ఆమె నాగ్‌ని కోరారు. దివ్య అని ఎందుకు పిలవవద్దో కూడా ఓ స్టోరీ చెప్పారు. అనంతరం రీతూ చౌదరి అని నాగ్ ఆమెను పిలిచారు. నాగ్ ఆశీస్సులు తీసుకుని రీతూ చౌదరి అడుగులోకి అడుగు పెట్టారు.

Also Read- Bigg Boss9 Telugu: బిగ్ బాస్ హౌస్‌లోకి 5, 6, 7వ హౌస్‌మేట్స్‌గా అడుగు పెట్టింది ఎవరంటే.. ట్విస్ట్ ఏంటంటే?

తొమ్మిదవ హౌస్‌మేట్‌ కామనర్‌: డీమాన్ పవన్ (Demon Pawan)

బిగ్ బాస్ హౌస్‌లోకి 9వ కంటెస్టెంట్‌గా కామనర్ డీమాన్ పవన్‌ను నాగ్ సెలక్ట్ చేశారు. ఇప్పటి వరకు కామనర్ ప్లేస్‌లో అందరూ అబ్బాయిలే వెళ్లడం విశేషం. తర్వాత తన పేరు వెనక ఉన్న హిస్టరీని డీమాన్ పవన్, కింగ్ నాగ్‌కు వివరించారు. ఆడియన్స్ ఓటింగ్ ద్వారా పవన్‌ను డైరెక్ట్‌గా కింగ్ నాగ్‌ హౌస్‌లోకి పంపించారు. డీమాన్‌ పవన్‌కు ఆల్రెడీ హౌస్‌లో అడుగు పెట్టిన వాళ్లు గ్రాండ్ వెల్‌కమ్ పలికారు. అనంతరం నాగ్ అతనికి ఓ టాస్క్ ఇచ్చారు. ఇంట్లో అంట్లు తోమే బాధ్యత ఎవరికి అనే టాస్క్‌ ఇవ్వగా, రీతూ చౌదరిని అందుకు పవన్ ఎంపిక చేశారు.

Also Read- Bigg Boss 9 Telugu: ఇద్దరు సెలబ్రిటీల అనంతరం.. మూడో హౌస్‌మేట్‌గా కామనర్.. ఎవరంటే?

పదవ హౌస్‌మేట్‌: హీరోయిన్ సంజన (Sanjjanaa Galrani)

బిగ్ బాస్ హౌస్‌లోకి 10వ హౌస్‌మేట్‌‌గా ‘బుజ్జిగాడు’ ఫేమ్ సంజన గల్రానీ ఎంట్రీ ఇచ్చారు. తను ఈ హౌస్‌లోకి రావడానికి గల కారణాలను ఆమె ఎమోషనల్‌గా పంచుకున్నారు. తనకు పూరీ జగన్నాథ్ ఎలా అవకాశం ఇచ్చారో చెప్పిన సంజన, తన కెరీర్‌లోని గడ్డు పరిస్థితులను చెప్పుకొచ్చారు. తనను ఓ కేసులో ఇరికించారని, విచారణ కోసం పిలిచి అరెస్ట్ చేశారని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత తను క్లీన్‌గా ఎలా వచ్చిందీ చెప్పారు. ఈ హౌస్ ద్వారా తన క్యారెక్టర్ ఏంటో అందరికీ తెలియాలనే.. ఇలా వచ్చానని ఆమె చెప్పారు. ఆల్ ద బెస్ట్ అని చెప్పి కింగ్ నాగ్ ఆమెను హౌస్‌లోకి పంపించారు. 11వ కంటెస్టెంట్‌గా ఎవరు రాబోతున్నారో నాగ్ చెబుతున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Bigg Boss 9 Contestants: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్‌లోకి అడుగు పెట్టిన మొత్తం కంటెస్టెంట్స్ వీరే..

Bigg Boss9 Telugu: హౌస్‌లోకి.. 11,12,13,14వ కంటెస్టెంట్స్‌గా ఎవరంటే! ట్విస్ట్ 15 కూడా!

TS BJP: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడికి కొత్త ఇబ్బంది?. ఏ విషయంలో అంటే!

Heavy Rain In Warangal: వరంగల్ నగరంలో దంచికొట్టిన వర్షం.. పలుచోట్ల వరదలు

Bigg Boss9 Telugu: హౌస్‌లోకి.. రీతూ చౌదరి, డీమాన్ పవన్, సంజన!