Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss Telugu Season 9) మొదలైంది. సెప్టెంబర్ 7, ఆదివారం ఈ షోని గ్రాండ్‌గా ప్రారంభించారు. మొదటి హౌస్‌మేట్‌గా తనూజ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వగా, రెండో హౌస్‌మేట్‌గా హీరోయిన్ ఫ్లోరా షైనీ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు మూడో కంటెస్టెంట్‌ని నాగ్ సెలక్ట్ చేస్తున్నారు. ఈసారి హౌస్‌లోకి సెలబ్రిటీ కాకుండా కామనర్‌కు ఛాన్స్ వచ్చింది. ఆ కామనర్ ఎవరో కాదు..
Also Read- Saiyaara OTT: రూ. 600 కోట్లు కొల్లగొట్టిన సెన్సేషనల్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! ఎప్పుడంటే?
మూడో హౌస్‌మేట్‌గా కామనర్: కళ్యాణ్ పడాల
మొత్తం 15 మంది కామనర్స్‌లో నుంచి 2 ఎలిమినేట్ కాగా, ఉన్న 13లో కేవలం 5గురుకి మాత్రమే అవకాశం ఉందని చెప్పారు. అందులో మొదటి అవకాశం విజయనగరం నుంచి వచ్చిన సోల్జర్ కళ్యాణ్ పడాలకు అవకాశం లభించింది. కింగ్ నాగార్జున ఓటింగ్ ద్వారా కళ్యాణ్‌కు అవకాశం వచ్చినట్లుగా నాగ్ ప్రకటించారు. అతన్ని స్టేజ్ మీదకు పిలిచి, నాగ్ ఓ డ్యూటీ అప్పజెప్పారు. హౌస్‌లోకి వెళ్లిన కళ్యాణ్‌కు ఇద్దరు సెలబ్రిటీలను పరిచయం చేసి, వారిద్దరిలో హౌస్‌లో వాష్ రూమ్ క్లీనింగ్ ఎవరికి ఇస్తావ్? అని కళ్యాణ్‌ను అడిగారు.. ఇద్దరు సెలబ్రిటీలు కాస్త కంగారు పడినా.. హౌస్‌లో అన్నీ చేయాలంటూ ఫ్లోరా షైనీని కళ్యాణ్ ఎంచుకున్నారు. ఇప్పుడు నాలుగో హౌస్‌మేట్ టైమ్ వచ్చేసింది. నాలుగో హౌస్‌మేట్ ఎవరంటే..
Also Read- Bigg Boss9 Telugu: డబుల్ హౌస్, డబుల్ జోష్.. స్టార్టింగే కింగ్ నాగ్‌కు పరీక్షలు
నాలుగో హౌస్‌మేట్: జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యుయెల్
బిగ్ బాస్ హౌస్‌లోకి నాలుగో హౌస్‌మేట్‌గా జబర్దస్త్ ఫేమ్ ఇమ్మాన్యుయెల్ ఎంట్రీ ఇచ్చారు. గుంటూరు నుంచి వచ్చిన ఇమ్మాన్యుయెల్ ఓ స్పెషల్ వీడియో ద్వారా తనని పరిచయం చేసుకున్నారు. అనంతరం అమ్మాయి వాయిస్‌లో పాట పాడించిన నాగ్, ఇమ్ముతో మిమిక్రీ కూడా చేయించారు. చిరంజీవి, విజయ్ దేవరకొండలను ఇమిటేట్ చేసిన ఇమ్మాన్యుయెల్.. హౌస్‌లోకి వెళ్లిన తర్వాత ఇలాంటి హౌసే నేను కూడా కట్టించాలి అంటూ తన కామెడీని స్టార్ట్ చేశారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు