Big Boss 9 Contestants
ఎంటర్‌టైన్మెంట్

Bigg Boss9 Telugu: హౌస్‌లోకి.. 11,12,13,14వ కంటెస్టెంట్స్‌గా ఎవరంటే! ట్విస్ట్ 15 కూడా!

Bigg Boss9 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss Telugu Season 9) గ్రాండ్‌గా మొదలైంది. సెప్టెంబర్ 7, ఆదివారం ఈ షో‌ని కింగ్ నాగ్ గ్రాండ్‌గా ప్రారంభించారు. మొదటి హౌస్‌మేట్‌గా తనూజ, రెండో హౌస్‌మేట్‌గా హీరోయిన్ ఫ్లోరా షైనీ, మూడో హౌస్‌మేట్‌గా కామనర్ కళ్యాణ్ పడాల అడుగు పెట్టారు. నాలుగో హౌస్‌మేట్‌‌గా జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యుయెల్, 5వ హౌస్‌మేట్‌‌గా కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ, ఆరో హౌస్‌మేట్‌‌గా కామనర్ మాస్క్ మ్యాన్ హరీష్, ఏడవ హౌస్‌మేట్‌‌‌గా నటుడు భరణి అడుగు పెట్టారు. ఆ తర్వాత ఎనిమిదవ హౌస్‌మేట్‌‌‌గా రీతూ చౌదరి, తొమ్మిదవ హౌస్‌మేట్‌‌గా కామనర్‌ డీమాన్ పవన్, పదవ హౌస్‌మేట్‌‌గా హీరోయిన్ సంజన గల్రానీ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు తదుపరి హౌస్‌లోకి అడుగుపెట్టిన వారి వివరాల్లోకి వెళితే..

11వ హౌస్‌మేట్‌: ఫోక్ డ్యాన్సర్ రాము రాథోడ్ (Ramu Rathod)

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్‌లోకి 11వ కంటెస్టెంట్‌గా ‘రాను ముంబయికి రాను’ సాంగ్ ఫేమ్ ఫోక్ డ్యాన్సర్ రాము రాథోడ్ ఎంట్రీ ఇచ్చారు. ఆయన స్టేజ్‌ మీద కింగ్ నాగార్జున కోసం స్పెషల్‌గా ఓ సాంగ్ పాడారు. అనంతరం ‘రాను ముంబయికి రాను’ పాటకు ఎన్ని వ్యూస్ వచ్చాయని నాగ్ అడిగారు. రాము రాథోడ్‌కు హౌస్‌లోని హౌస్‌మేట్స్ గ్రాండ్‌గా వెల్‌కమ్ పలికారు.

Also Read- Bigg Boss9 Telugu: బిగ్ బాస్ హౌస్‌లోకి 5, 6, 7వ హౌస్‌మేట్స్‌గా అడుగు పెట్టింది ఎవరంటే.. ట్విస్ట్ ఏంటంటే?

12వ హౌస్‌మేట్‌‌గా కామనర్: దమ్ము శ్రీజ (Dammu Sreeja)

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్‌లోకి 12వ కంటెస్టెంట్‌గా కామనర్ దమ్ము శ్రీజ ఎంట్రీ ఇచ్చారు. బిగ్ బాస్ అగ్నిపరీక్ష జ్యూరీ మెంబర్ నవదీప్ ఆమెను సెలక్ట్ చేశారు. అగ్నిపరీక్షలో ఎంటరైన మొదటి రోజు నుంచి తనదైన గేమ్, మాటలతో అందరినీ అలరించిందని, ముఖ్యంగా శ్రీముఖిపైనే ఆమె ధైర్యంగా పంచ్‌లు వేసిందని నవదీప్ చెప్పుకొచ్చారు. టాస్క్ అంటే రాకెట్ స్పీడ్‌తో వెళ్లి గేమ్ ఆడేదని, ఇలాంటి పర్సన్ బిగ్ బాస్‌‌లో ఉండాలని శ్రీజ గురించి నవదీప్ చెప్పుకొచ్చారు. తర్వాత నవదీప్‌కు శ్రీజ థ్యాంక్స్ చెప్పారు. హౌస్‌లో తనను తాను ప్రూవ్ చేసుకుంటానని అన్నారు. ఆమె హౌస్‌లోకి వెళ్లిన తర్వాత వారం రోజుల పాటు హౌస్‌లో బట్టలు ఉతికే పనికి పర్సన్స్‌ని ఎంపిక చేసే టాస్క్ శ్రీజకు ఇచ్చారు. సంజన, రాము రాథోడ్‌లలో రాము రాథోడ్‌ను శ్రీజ అందుకు ఎంచుకున్నారు.

Also Read- Bigg Boss9 Telugu: హౌస్‌లోకి.. రీతూ చౌదరి, డీమాన్ పవన్, సంజన!

13వ హౌస్‌మేట్‌‌: సుమన్ శెట్టి (Suman Shetty)

బిగ్ బాస్ హౌస్‌లో 13వ కంటెస్టెంట్‌గా సెలబ్రిటీ లిస్ట్‌లో ఫైనల్ సెలబ్రిటీ‌గా సుమన్ శెట్టి ఎంట్రీ ఇచ్చారు. తనకు ఫస్ట్ అవకాశాన్ని ఇచ్చిన తేజను గుర్తు చేసుకున్న సుమన్ శెట్టి.. ప్రస్తుతం తమిళం, మలయాళం, కన్నడ, భోజ్ పురి భాషల్లో సినిమాలు చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. ఈ బిగ్ బాస్ తనకు రెండో ఇన్నింగ్స్‌గా చెప్పిన సుమన్ శెట్టి.. తన ఆటతో కింగ్ నాగ్ చేతుల మీదుగా కప్పు అందుకుంటానని శపథం చేసి మరీ హౌస్‌లోకి అడుగు పెట్టారు.

14వ హౌస్‌మేట్‌గా కామనర్: ప్రియా శెట్టి (Priya)

బిగ్ బాస్ హోస్‌లోకి చివరి కంటెస్టెంట్‌, లాస్ట్ కామనర్‌గా ప్రియా శెట్టి‌ పేరును నాగ్ ప్రకటించారు. ఆడియన్స్ ఓటింగ్ ద్వారా ఆమెకు ఈ ఛాన్స్ వచ్చినట్లుగా చెప్పారు. తనను హౌస్‌లోకి పంపించిన ఆడియన్స్‌కు, జ్యూరీకి ఆమె థాంక్స్ చెప్పారు. డాక్టర్ అయిన ప్రియా, తన గురించి అందరికీ తెలిసేలా చేయాలనే హౌస్‌లోకి అడుగు పెడుతున్నానని, తనకు ఇంకా పెళ్లి కాలేదని కూడా ఆమె చెప్పుకొచ్చారు. తనను హౌస్‌లో కూడా ఇలాగే ఎంకరేజ్ చేయాలని ప్రియా శెట్టి కోరారు.

Also Read- Saiyaara OTT: రూ. 600 కోట్లు కొల్లగొట్టిన సెన్సేషనల్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! ఎప్పుడంటే?

ఇదే ట్విస్ట్

నాగార్జున ప్రియను లాస్ట్ కంటెస్టెంట్‌గా అనౌన్స్ చేశారు. లాస్ట్‌లో ట్విస్ట్ ఏంటంటే.. శ్రీముఖి ఎంటరై మరో కామనర్‌కు అవకాశం ఇవ్వాలని కోరుకున్నాను. అభిజిత్, తను తీసుకున్న డెసిషన్‌గా ఆమె చెప్పుకొచ్చారు. ఆమె కోరికను కింగ్ నాగ్ కాదనలేకపోయారు. 15వ కంటెస్టెంట్‌గా కామనర్ మర్యాద మనీష్ అని శ్రీముఖి ప్రకటించారు.

15వ హౌస్‌మేట్‌గా కామనర్: మర్యాద మనీష్

బిగ్ బాస్ హౌస్‌లోకి శ్రీముఖి ఎంట్రీతో 15వ కంటెస్టెంట్‌గా కామనర్ మర్యాద మనీష్‌ ఎంపికయ్యారు. దీంతో మొత్తం 15 మందితో ఈసారి బిగ్ బాస్ హౌస్ సీజన్ 9 సాగనుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఇంకా ఎంతమందికి హౌస్‌లోకి అడుగు పెట్టనున్నారో తెలియాల్సి ఉంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Bigg Boss 9 Contestants: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్‌లోకి అడుగు పెట్టిన మొత్తం కంటెస్టెంట్స్ వీరే..

Bigg Boss9 Telugu: హౌస్‌లోకి.. 11,12,13,14వ కంటెస్టెంట్స్‌గా ఎవరంటే! ట్విస్ట్ 15 కూడా!

TS BJP: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడికి కొత్త ఇబ్బంది?. ఏ విషయంలో అంటే!

Heavy Rain In Warangal: వరంగల్ నగరంలో దంచికొట్టిన వర్షం.. పలుచోట్ల వరదలు

Bigg Boss9 Telugu: హౌస్‌లోకి.. రీతూ చౌదరి, డీమాన్ పవన్, సంజన!