Bhartha Mahasayulaku Wignyapthi: ‘అద్దం ముందు’ వీడియో సాంగ్..
Ravi Teja and Dimple Hayathi in Addham Mundhu video song from Bhartha Mahasayulaku Wignyapthi, set against scenic mountain landscapes.
ఎంటర్‌టైన్‌మెంట్

Bhartha Mahasayulaku Wignyapthi: ‘అద్దం ముందు’ వీడియో సాంగ్.. అబ్బ, ఎంత అందంగా ఉంది!

Bhartha Mahasayulaku Wignyapthi: మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) హీరోగా.. అందాల భామలు డింపుల్ హయతి (Dimpla Hayathi), ఆషిక రంగనాథ్ (Ashika Ranganath) హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ (Bhartha Mahasayulaku Wignyapthi). ఈ సినిమా సంక్రాంతి స్పెషల్‌గా విడుదలై మంచి టాక్‌నే సొంతం చేసుకుంది. కానీ కలెక్షన్ల పరంగా మాత్రం ఊహించినంతగా కలెక్షన్స్ రాబట్టలేక రేసులో వెనుకబడింది. కంటెంట్ పరంగా మంచి మార్కులే పడ్డాయి కానీ, సంక్రాంతి హెవీ కాంపిటేషన్‌లో విడుదలడం.. ఈ సినిమా కంటే బాగా ఉన్న సినిమాలకే ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంతో బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఓ మోస్తర్ హిట్ చిత్రంగానే మిగిలిపోయింది. ఇక ఈ సినిమా విడుదలకు ముందు ఎలాంటి అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరీ ముఖ్యంగా ఇందులోని పాటలు బాగా ఆకర్షించి, సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి. తాజాగా ఈ మూవీ నుంచి ‘అద్దం ముందు’ (Addham Mundhu Video Song) అనే ఫుల్ వీడియో సాంగ్‌ని మేకర్స్ వదిలారు.

Also Read- Movie Press Meet: ఒకే టైమ్‌కి రెండు వేరు వేరు సినిమాల ప్రెస్ మీట్స్.. దర్శకనిర్మాతలు అసంతృప్తి!

లొకేషన్స్ అదిరాయ్

ఈ పాటను గమనిస్తే.. ఇందులో రవితేజ, డింపుల్ హయతిల మధ్య కెమిస్ట్రీ మాములుగా లేదు. అలాగే పాటకు తగినట్లుగా లొకేషన్స్ అదిరిపోయాయి. హీరో హీరోయిన్ల డ్రస్సులకు అనుగుణంగా లొకేషన్స్‌ని సెట్ చేసిన తీరుకు వావ్ అనాల్సిందే. అలాగే సింపుల్ స్టెప్స్‌తో పాటకు ఎంతో అందం తీసుకొచ్చారు. శ్రేయ ఘోషల్, కపిల్ కపిలన్ వీనుల విందుగా ఆలపించగా, సక్సెస్‌ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరొలియో ఈ పాటను అంతే చక్కగా కంపోజ్ చేశారు. ఆస్కార్ విజేత చంద్రబోస్ ఈ పాటకు సాహిత్యం అందించారు. చీరకట్టులో డింపుల్ హయతి ఒంపుసొంపులు, ఎక్స్‌ప్రెషన్స్ చాలా అట్రాక్టివ్‌గా ఉండటం ఈ పాటకు మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మొత్తంగా అయితే ఈ పాట ఇప్పుడు టాప్‌లో ట్రెండ్ అవుతోంది. పాటకు మంచి మంచి కామెంట్స్ పడుతున్నాయి. ఇంకా సింగర్ శ్రేయ ఘోషల్‌పై కూడా ప్రశంసలు కురుస్తున్నాయి.

Also Read- Sumathi Sathakam Trailer: పిఠాపురం ఎమ్మెల్యేగారు చెప్పింది నిజమే.. ఏం చెప్పారు?

యూట్యూబ్‌లో సెన్సేషన్‌గా..

ఈ పాట ఫుల్ వీడియో సాంగ్ చూసి అంతా ఎంజాయ్ చేస్తున్నారు. యూట్యూబ్‌లో ఈ సాంగ్ సెన్సేషన్‌ని క్రియేట్ చేస్తోంది. మరెందుకు ఆలస్యం మీరు కూడా ఓ రౌండ్ వేసుకోండి. కిషోర్ తిరుమల దర్శకత్వంలో, సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను నిర్మించారు. జనవరి 13న ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చింది. ప్రస్తుతం థియేటర్లలో ఈ సినిమా రన్ అవుతూనే ఉంది. ఈ సినిమా తర్వాత రవితేజ చేయబోతున్న సినిమాకు సంబంధించి ఆయన పుట్టినరోజైన జనవరి 26న టైటిల్‌ లుక్ పోస్టర్‌ను వదిలిన విషయం తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి ‘ఇరుముడి’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఫస్ట్ లుక్ మంచి స్పందనను రాబట్టుకోవడమే కాకుండా, రవితేజ ఇప్పటి వరకు చేయని సరికొత్త పాత్రను చేస్తున్నారనే విషయాన్ని తెలియజేస్తుంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?