Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సే తెలుగులో ఆశించింది రాలేదా?
bhagya-sri-borse(X)
ఎంటర్‌టైన్‌మెంట్

Bhagyashri Borse: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ నుంచి భాగ్యశ్రీ బోర్సే ఆశించింది రాలేదా?.. ఆమె నిరాశకు కారణం ఇదే..

Bhagyashri Borse: టాలీవుడ్‌లో కొత్త నాయికల ప్రయాణం ఎప్పుడూ పూల పాన్పు కాదు. ముఖ్యంగా, తొలి అడుగులోనే భారీ అంచనాలు ఉన్నా.. అవి రివర్స్ అయితే ఆ ప్రభావం కెరీర్‌పై తీవ్రంగా ఉంటుంది. ఇప్పుడు సరిగ్గా అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటోంది యువ నటి భాగ్యశ్రీ బోర్సే. రవితేజ వంటి మాస్ హీరో సరసన ‘మిస్టర్ బచ్చన్’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన భాగ్యశ్రీ, తన అందం, గ్లామర్‌తో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. అయితే, సినిమా ఫలితాల ముందు ఈ క్రేజ్ నిలబడలేకపోయింది. తొలి సినిమా నుంచే ఆమె నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయాలను మూటగట్టుకోవడంతో, ఈ యువ నటి తదుపరి అడుగులు ఎలా ఉండబోతున్నాయనేది చర్చనీయాంశమైంది.

Read also-Psyke Siddharth Trailer: వైల్డ్ కామెడీతో వస్తున్న శ్రీ నందు ‘సైక్ సిద్దార్థ’ ట్సైలర్ విడుదలైంది.. వేరే లెవెల్ అంతే..

వరుస దెబ్బలు..

భాగ్యశ్రీ ప్రధాన పాత్ర పోషించిన నాలుగు చిత్రాల ఫలితాలను పరిశీలిస్తే, ఆమె ఎదుర్కొంటున్న ఒత్తిడి స్పష్టమవుతుంది. మిస్టర్ బచ్చన్ డబుల్ డిజాస్టర్ తో తొలి సినిమానే భారీ పరాజయం మూటకట్టుకుంది విజయ్ దేవరకొండ కింగ్డమ్ బిలో యావరేజ్ టాక్ తో అంచనాలను అందుకోలేకపోయింది. ఇటీవల విడుదలైన ‘కాంత’ డిజాస్టర్ భారీ నష్టాలను మిగుల్చింది ఇక ఆంధ్రకింగ్
ఆంధ్ర కింగ్ తాలూకా టువర్డ్స్ డిజాస్టర్ కనీస వసూళ్లు సాధించలేకపోయింది. వరుసగా వచ్చిన నాలుగు సినిమాలూ ఏ ఒక్కటీ కూడా కమర్షియల్ విజయాన్ని అందించకపోవడంతో, భాగ్యశ్రీ బోర్సే ఇప్పుడు ఒక క్లిష్టమైన దశలో ఉంది. తొలి నాలుగు చిత్రాలే పరాజయం పాలవ్వడం.. కొత్తగా వచ్చిన నటీమణుల కెరీర్‌కు ‘రెడ్ సిగ్నల్’ లాంటిదేనని సినీ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Read also-Bigg Boss 9 Telugu: మొదటి ఫైనలిస్ట్ కోసం జరిగే రణరంగంలో గెలిచేది ఏవరు?.. ఏం కిక్ ఉంది మామా..

టెన్షన్‌లో నాయిక..

‘మిస్టర్ బచ్చన్’ వంటి భారీ ప్రాజెక్ట్‌తో కెరీర్‌ను ప్రారంభించినా, వరుసగా డబుల్ డిజాస్టర్లు, డిజాస్టర్లు పలకరించడంతో.. ఈ నాయిక ఇప్పుడు తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉందని ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. చేతిలో ఆఫర్లు ఉన్నా, ఏ ప్రాజెక్ట్‌ను ఎంచుకోవాలి? ఏ దర్శకుడితో పనిచేస్తే విజయం వరిస్తుంది? వంటి ప్రశ్నలు ఆమెను కలవరపెడుతున్నట్లు తెలుస్తోంది. ఇంత తక్కువ సమయంలో వరుసగా పరాజయాలు రావడం, ఆమెకు భవిష్యత్తు అవకాశాలపై ప్రభావం చూపే ప్రమాదం ఉంది. అందుకే, ఇప్పుడు సెలెక్టివ్ అప్రోచ్ తప్ప మరో మార్గం లేదని సినీ పెద్దలు ఆమెకు సలహా ఇస్తున్నారు. కేవలం స్టార్ హీరోల పక్కన కనిపించడం కంటే, కథలో తన పాత్రకు బలం ఉందా, కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉందా అనే కోణంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన తరుణం ఇది. ఒకే ఒక్క విజయం.. వంద పరాజయాలను తుడిచిపెట్టేస్తుంది. భాగ్యశ్రీ బోర్సే కూడా ఆ ఒక్క విజయం కోసం సరైన స్క్రిప్ట్‌ను ఎంచుకోగలిగితే, మళ్లీ సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చి టాలీవుడ్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవచ్చు. ఆమె తదుపరి సినిమా ప్రకటన కోసం ప్రేక్షకులు, సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Just In

01

Bigg Boss First Finalist: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవరు? రేసులో ఆ నలుగురు?

Big Ticket Abu Dhabi: సౌదీలోని భారతీయుడికి భారీ జాక్‌పాట్.. లాటరీలో రూ.61 కోట్లు!

OnePlus 13: OnePlus 13 ఫోన్ కు 10 వేల డిస్కౌంట్.. ఈ ఆఫర్ ఎలా పొందాలంటే?

Hidma Encounter: హిడ్మా ఎన్‌కౌంటర్‌‌పై మావోయిస్టుల మరో లేఖ.. అంతా వాళ్లే చేశారు!

Akhanda 2: తెలంగాణలోనూ లైన్ క్లియర్.. ఎట్టకేలకు ప్రీమియర్‌కు, టికెట్ల ధరల హైక్‌కు అనుమతి! కండీషన్స్ అప్లయ్!