Psyke Siddharth Trailer: శ్రీ నందు ‘సైక్ సిద్దార్థ’ ట్సైలర్ విడుదలైంది
Psyke-Siddharth-Trailer(X)
ఎంటర్‌టైన్‌మెంట్

Psyke Siddharth Trailer: వైల్డ్ కామెడీతో వస్తున్న శ్రీ నందు ‘సైక్ సిద్దార్థ’ ట్రైలర్ విడుదలైంది.. వేరే లెవెల్ అంతే..

Psyke Siddharth Trailer: యువ నటుడు శ్రీ నందు ప్రధాన పాత్రలో, అందాల నటి యామిని భాస్కర్ కథానాయికగా, నూతన దర్శకుడు వరుణ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సైక్ సిద్దార్థ’. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదలైంది. ఒక వినూత్నమైన కాన్సెప్ట్ వైల్డ్ కామెడీ ట్రాక్ తో సినీ ప్రేమికులను ఆకర్షిస్తోంది. ‘సైక్ సిద్దార్థ’ అనేది ఒక సాధారణ కథ కాదు. ఈ చిత్రం పూర్తిగా టైటిల్‌ను సూచించినట్లుగానే, ప్రధాన పాత్రధారి సిద్ధార్థ్ (శ్రీ నందు) ‘సైక్’ (Psychological) కోణం చుట్టూ తిరుగుతుంది. సిద్ధార్థ్ ఒక నిరుద్యోగి, బ్రేకప్‌తో బాధపడుతున్న వ్యక్తి, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న యువకుడు. అతని అంతర్గత పోరాటం ఏంటంటే, తన చుట్టూ ఉన్న సమాజం, ట్రాఫిక్, జనాల బాధ్యతారాహిత్యం అవినీతి పట్ల అతనికి విపరీతమైన కోపం చిరాకు ఉంటుంది. ఈ కోపాన్ని అతను ఫన్నీగా, కొన్నిసార్లు రఫ్‌గా, ఎక్కడా ఫిల్టర్ లేకుండా బయటపెడతాడు.

Read also-Moglie Trailer: రోషన్ కనకాల ‘మోగ్లీ 2025’ ట్రైలర్ వచ్చేసింది.. సందీప్ రాజ్ వేరే లెవెల్ టేకింగ్..

ట్రైలర్ హైలైట్స్..

ట్రైలర్ చూస్తే, సినిమా కథనం చాలా వేగంగా (Pacy) ఉంటుందని అర్థమవుతోంది. సిద్ధార్థ్ పాత్రలో శ్రీ నందు ఎనర్జీ లెవెల్స్ అద్భుతంగా ఉన్నాయి. అతని బాడీ లాంగ్వేజ్ ‘నో ఫిల్టర్’ డైలాగ్ డెలివరీ కామెడీకి కీలకంగా మారాయి. అతని రఫ్ లుక్ ఆవేశపూరితమైన డైలాగులు యువతకు బాగా కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. హీరోయిన్ యామిని భాస్కర్, సిద్ధార్థ్ జీవితంలో ఒక ఊహించని మలుపుగా కనిపిస్తుంది. వారి మధ్య రొమాంటిక్ ట్రాక్, సిద్ధార్థ్ ‘సైక్’ స్వభావానికి విభిన్నంగా కనిపిస్తుంది. స్మరణ్ సాయి అందించిన సంగీతం, ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సినిమా మూడ్‌ని ఎలివేట్ చేసింది. కె. ప్రకాష్ రెడ్డి సినిమాటోగ్రఫీ హైదరాబాద్ నగర వాతావరణాన్ని, ముఖ్యంగా రాత్రి సన్నివేశాలను ఆకట్టుకునేలా చిత్రీకరించింది.

Read also-Naga Vamsi: సినిమాలకు సింపతీ కార్డ్ ఎందుకు పనిచేయడంలేదు.. నాగవంశీ ఏం అన్నారంటే?

విభిన్నమైన అటెంప్ట్..

నూతన దర్శకుడు వరుణ్ రెడ్డి తొలి చిత్రంలోనే ఒక విభిన్నమైన కాన్సెప్ట్‌ను ఎంచుకోవడం సాహసంగా చెప్పవచ్చు. యువతరం ఎదుర్కొంటున్న మానసిక సంఘర్షణలు, నిరుద్యోగం, సోషల్ ఆందోళనలను ఫన్నీగా, అదే సమయంలో ఆలోచింపజేసేలా చూపించడానికి ఈ సినిమా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ‘సైక్ సిద్దార్థ’ చిత్రం డిసెంబర్ 12న విడుదల కానుంది. రా, అధంటిక్ మాస్ రూరల్ తరహాలో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ ముఖ్యంగా యువతను ఆకట్లుకొనేలా ఉంది. ఈ సినిమా విడుదల కోసం నందు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Just In

01

Boora Narsaiah Goud: ఢిల్లీలో మాకో చిత్రగుప్తుడు ఉన్నాడు.. మాజీ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు

Rajiv Swagruha Plots: రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలానికి దరఖాస్తుల ఆహ్వానం… అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలంటే

VK Naresh: ఫస్ట్ టైమ్.. నా సినిమాకు నాకే టికెట్స్ దొరకలేదు

Bhatti Vikramarka: రాబందులను దరిదాపుల్లోకి రానివ్వం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

Bigg Boss 9 Tamil Winner: ‘బిగ్ బాస్ తమిళ్ సీజన్ 9’ విన్నర్.. మన తెలుగు వాళ్లకీ పరిచయమే!