Baahubali The Epic: భారతీయ సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిన ‘బాహుబలి’ సిరీస్ ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. 2015లో విడుదలైన ‘బాహుబలి: ది బిగినింగ్’ 2017లో ‘బాహుబలి: ది కంక్లూజన్’ భాగాలు ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ రెండు భాగాలు ఒకే భాగంగా ‘బాహుబలి: ది ఎపిక్’ (Baahubali: The Epic) పేరుతో రీరిలీజ్ చేయబోతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ అప్డేట్ వచ్చింది. ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుని యూఏ సర్టిఫికెట్ పొందింది. ఏకంగా 3 గంటల 45 నిమిషాల రన్ టైమ్ తో అతి పెద్ద సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి రూపొందించిన ఈ మూవీ, ప్రభాస్, రానా దగ్గుబాటి, తమన్నా, అనుష్క శెట్టి, రమ్యా కృష్ణ, సత్యరాజ్‌లు ప్రధాన పాత్రల్లో నటించారు. పదేళ్ల తర్వాత అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే ఈ సినిమా, ఆధునిక సాంకేతికతలతో మరింత ఆకట్టుకునేలా తయారైంది.
Read also-Kantara 1 Diwali trailer: ‘కాంతార చాప్టర్ 1’ దివాళీ ట్రైలర్ వచ్చేసింది చూశారా..
రీ రిలీజ్ ప్రత్యేకతలు
రెండు భాగాలు కలిపి దాదాపు 5 గంటల 27 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ‘బాహుబలి’ చిత్రాలను, ఒకే సినిమాగా ఎడిట్ చేసి 3 గంటల 45 నిమిషాలకు కుదించారు మేకర్స్. ఈ ప్రక్రియలో కొన్ని రొమాంటిక్ సీన్స్ పాటలను కట్ చేశారు, తద్వారా కథ ప్రవాహం మరింత ఆకర్షణీయంగా ఉండేలా చేశారు. ఈ రీ రిలీజ్ వెర్షన్‌లో ఆధునిక సినిమా టెక్నాలజీలు జోడించారు. IMAX, Dolby Cinema, 4DX, D-Box, EpiQ, ICE, PCX వంటి ప్రీమియం ఫార్మాట్‌లలో విడుదలవుతుంది. ఇది మునుపటి ప్రేక్షకులకు టీవీలు, మొబైల్స్ లేదా హోమ్ థియేటర్లలో చూసిన అనుభవాన్ని మరింతగా పెంచుతోంది. ఈ సినిమా గురించి ఓ సందర్భంలో నిర్మాత శోభు యార్లగడ్డ మాట్లాడుతూ, “ఈ రీరిలీజ్ ప్రధానంగా సినిమాటిక్ అనుభవానికి, ఆర్థిక లాభాలకు కాదు” అని చెప్పారు. అయితే, క్లైమాక్స్‌లో చిన్న సర్ప్రైజ్ ఉండొచ్చని హింట్ ఇచ్చారు, ఇది ప్రేక్షకుల ఉత్కంఠను మరింత పెంచింది. ‘బాహుబలి 3’పై రూమర్లు వినిపిస్తున్నా, “ఇంకా చాలా పని మిగిలి ఉంది” అని నిర్మాత చెప్పారు.
Read also-Peddi movie update: ‘పెద్ది’ గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన దర్శకుడు.. ముందు వచ్చేది ఏంటంటే?
అడ్వాన్స్ బుకింగ్‌లో రికార్డులు
రిలీజ్‌కు ముందే ‘బాహుబలి: ది ఎపిక్’ అడ్వాన్స్ బుకింగ్‌లో భారీ రెస్పాన్స్ సాధించింది. అమెరికాలో 100 షోలకు పైగా 60,000 డాలర్లకు పైగా రెవెన్యూ సంపాదించి. 3,000కి పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. భారతదేశంలో ఒక్క మిలియన్ టికెట్లకు పైగా బుక్ అయ్యాయి. ఈ రీరిలీజ్, తమిళ సినిమా ‘ఘిల్లీ’ రీరిలీజ్ రికార్డ్ (రూ. 32 కోట్లు)ను బద్దలు కొట్టే అవకాశం ఉందని ఇండస్ట్రీ ట్రాకర్లు అంచనా వేస్తున్నారు. అమెరికాలో ‘బాహుబలి 2’ 22 మిలియన్ డాలర్లతో ఇంకా రికార్డ్‌లో ఉంది, ఈ రీ రిలీజ్ దాన్ని మరింత బలోపేతం చేయవచ్చు. అక్టోబర్ 29న అమెరికాలో ప్రీమియర్ షోలు జరుగుతాయి, అక్టోబర్ 31న భారతదేశంలో విడుదల. 2D, 3D ఫార్మాట్‌లలో అందుబాటులో ఉంటుంది. ఈ సందర్భంగా, నెట్‌ఫ్లిక్స్ నుంచి రెండు భాగాలు తొలగించారు. పాన్-ఇండియా సినిమాలలో రీరిలీజ్ హిట్‌గా నిలవడంలో ‘బాహుబలి’ ముందంజలో ఉంది. ఈ రీరిలీజ్‌తో మళ్లీ ఆ ఎపిక్ జర్నీ ప్రేక్షకులు మంచి అనుభవం ఇవ్వనుంది.
Censored : U/A 16+
Runtime : 3 Hours & 45 MinutesThe Epic on Bigscreens arriving on this 31st October, 2025.#Prabhas #Baahubali pic.twitter.com/aOyz1tetsa
— Prabhas Trends (@TrendsPrabhas) October 16, 2025
