Kamal Haasan: కమల్ హాసన్ హీరోగా, లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘థగ్ లైఫ్’ (Thug Life). జూన్ 5న థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోనన ఈ సినిమాలో త్రిష, శింబు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలై ప్రమోషనల్ కంటెంట్ ప్రపంచవ్యాప్తంగా సినిమాపై అంచనాలను పెంచేయగా.. హీరో నితిన్ ఫాదర్ ఎన్ సుధాకర్ రెడ్డి శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. గతంలో ‘విక్రమ్, అమరన్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన ఈ సంస్థ ఇప్పుడు ‘థగ్ లైఫ్’ను భారీగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా గురువారం వైజాగ్‌లో ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమల్ హాసన్ మాట్లాడుతూ..
Also Read- Megastar Chiranjeevi: ‘గద్దర్ అవార్డ్స్’.. ఎవరి పేరు మెన్షన్ చేయాలో చిరుకి తెలియదా?
‘‘వైజాగ్ ప్రజలు నన్ను ఎంతగానో దగ్గరకి తీసుకున్నారు. 21 ఏళ్ల వయసులో నేను వైజాగ్ వచ్చాను. అప్పటికి నా మొహం కూడా ఎవరికి తెలీదు. షూటింగ్ చాలా సాఫీగా జరిగింది. సినిమా రిలీజై తర్వాత కిక్కిరిపోయే ఫ్యాన్ బేస్‌ని ‘మరో చరిత్ర’ అనే చిత్రం నాకు ఇచ్చింది. తర్వాత ‘ఏక్ తుజే కేలియే’ సినిమా చేసినప్పుడు కూడా తెలుగు ప్రేక్షకులు మన కుర్రాడు హిందీకి వెళ్లి కొట్టాడురా! అని అభినందించారు. అలాంటి వైజాగ్‌లో ‘సాగర సంగమం, ఏక్ తుజే కేలియే శుభసంకల్పం’ వంటి సినిమాలు చేశాను. వైజాగ్ నాకు సొంత ఇల్లు లాంటిది. మంచి ఆర్ట్ ఎక్కడ కనిపించినా దానికి నేను సెల్యూట్ చేస్తాను. అలాగే నేర్చుకున్నాను. నేను కొన్ని బ్యాడ్ ఫిలిమ్స్ చేశాను. కానీ, నా బ్యాడ్ ఫిలిమ్స్ మర్చిపోయి కేవలం మంచి సినిమాలనే గుర్తుపెట్టుకున్నారు. అందుకు మనస్పూర్తిగా ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మంచి సినిమాలను మీకు అందించడం నా బాధ్యత.
Also Read- OG Movie: నారా రోహిత్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ అప్డేట్ ఇదే!
నేను 15 తెలుగు సినిమాలు చేస్తే.. అందులో 13 విజయవంతమైన చిత్రాలుగా నిలిచాయి. ఆ విజయాలన్నింటినీ మీరే (ప్రేక్షకులు) ఇచ్చారు. ప్లాప్స్ మాత్రమే నేను ఇచ్చాను. అవును, ఇది నిజం. ప్రేక్షకుల రుణం తీర్చుకోవడానికే ‘థగ్ లైఫ్’ సినిమాతో మీ ముందుకు వస్తున్నాను. ఒక కళాకారుడు చేసే పనే ఇదే. చాలా గ్రేట్ ఫిలిం ఇది. శింబు బెస్ట్ పెర్ఫార్మర్. నెవర్ బిఫోర్ క్యారెక్టర్‌లో కనిపించారు. అభిరామి అద్భుతమైనటువంటి నటనను కనబరిచారు. మణిరత్నం, నేను.. సినిమాలతో ఎప్పుడో పెళ్లి చేసుకున్నాం. నాజర్‌తో నాది వెరీ లాంగ్ జర్నీ. ఆయన లాంటి నటుడు దొరకడం చాలా కష్టం. త్రిష పెర్ఫార్మెన్స్‌ని చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా గొప్ప సినిమా చేశామని మేము నమ్ముతున్నాం. జూన్ 5న మేము నమ్మింది కరెక్టా? కాదా? అనేది మీరు సినిమా చూసి చెప్పాలి. ఈ సినిమాకు మీరిచ్చే రియాక్షన్ కోసం ఎదురుచూస్తున్నాను. జూన్ 5న అందరం థియేటర్స్‌లో ‘థగ్ లైఫ్’తో కలుద్దాం’’ అని చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు