Atlas Cycle Attagaaru Petle: కొన్ని సినిమాలు టైటిల్‌తోనే ప్రేక్షకులను ఆకర్షిస్తాయి. కొన్ని అని కాదు, ప్రతి సినిమాకు టైటిల్ ప్రేక్షకులని ఆకర్షించాలనే పెడతారు. కానీ అందులో కొన్ని మాత్రమే ప్రేక్షకులకు రీచ్ అవుతుంటాయి. అలాంటి రీచబుల్ టైటిల్‌తో ఇప్పుడో సినిమా రాబోతోంది. ‘కౌసల్యా కృష్ణమూర్తి, అథర్వ’ వంటి సినిమాలతో ఆడియెన్స్‌ను మెప్పించిన కార్తిక్ రాజు హీరోగా ఇప్పుడో నూతన సినిమా ప్రారంభమైంది. రీసెంట్ సెన్సేషన్ ‘అనగనగా’ ఫేమ్ కాజల్ చౌదరి హీరోయిన్‌గా.. శ్రీ రామకృష్ణ సినిమా బ్యానర్‌పై గాలి కృష్ణ తెరకెక్కిస్తున్న చిత్రం ‘అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే’. ఈ వెరైటీ టైటిల్‌తో రూపుదిద్దుకోబోతున్న సినిమాకు రాజా దుస్సా దర్శకత్వం వహిస్తున్నారు. మల్లవరం వేంకటేశ్వర రెడ్డి, రూప కిరణ్ గంజి సహ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు.
Also Read- Mega157: చిరు, నయన్, అనిల్ రావిపూడి కాంబో ఫిల్మ్.. అదిరిపోయే అప్డేట్!
‘అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే’ సినిమాను శుక్రవారం (మే 23), హైదరాబాద్ రామా నాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభించారు. ఈ పూజా కార్యక్రమాలకు నిర్మాత సురేష్ బాబు, తమ్మారెడ్డి భరద్వాజ, భీమనేని శ్రీనివాస రావు, క్రాంతి మాధవ్, హీరో చైతన్య వంటి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి సురేష్ బాబు క్లాప్ కొట్టగా, హీరో చైతన్య కెమెరా స్విచ్ఛాన్ చేయగా, తొలి షాట్‌కి భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. తమ్మారెడ్డి భరద్వాజ స్క్రిప్ట్ అందజేశారు. ఈ సందర్భంగా దర్శకుడు రాజా దుస్సా మాట్లాడుతూ.. ‘ఇదొక పీరియాడికల్ మూవీ. కామెడీతో పాటు ఎమోషనల్‌గానూ ఈ చిత్రం ఉంటుంది. 1980లో వరంగల్‌లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ను జరిపేలా పక్కా ప్లాన్ రెడీ చేశాం. కార్తిక్ రాజు, కాజల్ చౌదరి పాత్రలు ప్రతి ఒక్కరికీ రిలేటెడ్‌గా ఉంటాయి. మా నిర్మాత సహకారం ఎప్పటికీ మర్చిపోలేను. మా టీమ్‌ని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. దర్శకుడు రాజా దుస్సా విషయానికి వస్తే.. ఇంతకు ముందు ఆయన హన్సికతో ‘105 మినిట్స్’ అనే ఓ ప్రయోగాత్మక చిత్రాన్ని తెరకెక్కించారు.
Also Read- Meenakshii Chaudhary: పట్టుచీర కట్టాను.. మల్లెపూలు పెట్టాను.. రారా రారా!
హీరో కార్తిక్ రాజు మాట్లాడుతూ.. 80వ దశకంలో జరిగే కథతో ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. కాజల్ చౌదరి ప్రస్తుతం సక్సెస్ ఫుల్ హీరోయిన్‌గా దూసుకుపోతోంది. ఆమెతో కలిసి నటిస్తుండటం ఆనందంగా ఉంది. మంచి కథను నాకు ఇచ్చిన మా దర్శకుడు రాజా దుస్సా, నిర్మాత గాలి కృష్ణలకు థాంక్స్. మున్ముందు మా సినిమా నుంచి మరిన్ని అప్డేట్‌లను ఇస్తామని తెలిపారు. కాజల్ చౌదరి మాట్లాడుతూ.. ఈ చిత్రంలో నటిస్తుండటం ఆనందంగా ఉంది. నాకు కథ ఎంతగానో నచ్చింది. ఇదొక యూనిక్ స్టోరీ. ఇలాంటి కథ అప్పుడే నాకు వస్తుందని ఊహించలేదు. మంచి టీంతో పని చేస్తున్నందుకు హ్యాపీ. తెలుగు ప్రేక్షకులు ప్రస్తుతం నా మీద ఎంతో ప్రేమను కురిపిస్తున్నారు. ఈ చిత్రంతోనూ నన్ను ఆదరించాలని కోరుకుంటున్నానని అన్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు