Pawan Kalyan and Arjun Das
ఎంటర్‌టైన్మెంట్

Arjun Das: ‘ఓజీ’ షూట్‌లో.. అర్జున్ దాస్ ఆనందానికి అవధుల్లేవ్!

Arjun Das: ‘అలాంటోడు మళ్లీ వస్తున్నాడంటే..’ అనే ‘ఓజీ’ టీజర్‌లోని డైలాగ్ వింటే చాలు.. రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఆ డైలాగ్ చెప్పిన వాయిస్ ఎవరిదో తెలుసు కదా! తమిళ నటుడు అర్జున్ దాస్. ఆల్రెడీ తమిళ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులలో గుర్తింపును తెచ్చుకున్న అర్జున్ దాస్.. తెలుగులోనూ ఓ స్ట్రయిట్ సినిమా చేసి అలరించాడు. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం, ఫ్యాన్స్ అంతా ఎంతగానో వేచి చూస్తున్న చిత్రం ‘ఓజీ’లో ఓ కీలక పాత్రలో అర్జున్ దాస్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ‘ఓజీ’ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. షూటింగ్‌లో పవన్ కళ్యాణ్‌తో దిగిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన అర్జున్ దాస్.. తన ఆనందాన్ని సైతం తెలియజేశారు.

Also Read- Akhil Wedding: కొడుకులతో కలిసి కింగ్ నాగ్ ఏ పాటలకు డ్యాన్స్ చేశారో తెలుసా?

‘‘పవన్ కళ్యాణ్ సార్.. మీతో కలిసి పనిచేయడం నాకు లభించిన గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. మీతో కలిసి పనిచేసిన ప్రతి రోజునూ నేను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను. మీరు ఎంత బిజీగా ఉన్నప్పటికీ, షూటింగ్ సమయంలో నాతో మాట్లాడటానికి సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు. మన సంభాషణలను నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. సార్, మళ్లీ మీతో కలిసి పనిచేసే అవకాశం వస్తుందని ఎంతగానో ఆశిస్తున్నాను’’ అని అర్జున్ దాస్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. అర్జున్ తన ఎక్స్ వేదికగా షేర్ చేసిన ఈ పోస్ట్‌కు లైక్స్, కామెంట్స్ బీభత్సంగా పడుతున్నాయి. ప్రస్తుతం ఈ ట్వీట్ బాగా వైరల్ అవుతోంది. ఇక ఈ ట్వీట్‌కు నెటిజన్లు, ఫ్యాన్స్ కామెంట్స్ కూడా మాములుగా లేవు. ‘అన్న ఎవ్వరికి సెల్ఫీ ఇచ్చినా నవ్వడం అనేది జరగదు. తనకు మనసుకు నచ్చిన వారితో మాత్రమే ఇలా స్మైల్ ఇస్తాడు’ అని, ‘సూపర్ సార్’ అని.. ఇలా రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Also Read- Hari Hara Veera Mallu: అఫీషియల్.. హరి హర వీరమల్లు మరోసారి వాయిదా!

‘ఓజీ’ విషయానికి వస్తే.. రీసెంట్‌గా ఈ సినిమా కొంత గ్యాప్ తర్వాత మళ్లీ షూటింగ్‌ను ప్రారంభించుకుంది. ముంబైలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్ అనంతరం ఏపీలోనే షూటింగ్ ఉంటుందని తెలుస్తోంది. ‘హరి హర వీరమల్లు’ షూట్ పూర్తయిన వెంటనే, పవన్ కళ్యాణ్ ఈ సినిమా సెట్స్‌లోకే అడుగు పెట్టారు. గ్యాంగ్‌స్టార్ డ్రామా ఇతివృత్తంగా రూపొందుతున్న ‘ఓజీ’లో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డి.వి.వి దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇమ్రాన్ హష్మీ, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి, హరీష్ ఉత్తమన్, అజయ్ ఘోష్ వంటి వారంతా ఇతర పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని 2025, సెప్టెంబర్ 25న విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ రీసెంట్‌గానే అధికారికంగా ప్రకటించారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!