Shambhala Movie: అర్చన అయ్యర్.. ఈ పేరు ఎక్కడో విన్నట్లు ఉంది కదా.. ఎక్కడో కాదు.. సత్యదేవ్ హీరోగా నటించిన విమర్శకుల ప్రశంసలు పొందిన ‘కృష్ణమ్మ’ చిత్రంలో నటించింది అర్చన అయ్యర్. ప్రస్తుతం అర్చన అయ్యర్ ఓ సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ సినిమాలో నటిస్తోంది. ఆ సినిమా పేరే ‘శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్’. ఈ సినిమాలో అర్చన అయ్యర్ ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లుగా తెలుపుతూ.. వాలెంటైన్స్ డే స్పెషల్‌గా ఆమె ఫస్ట్ లుక్‌ని మేకర్స్ రివీల్ చేశారు.
Also Read- Klin Kaara: మెగా ప్రిన్సెస్ క్లీంకారా ఫేస్ రివీలైంది.. ఎంత క్యూట్‌గా ఉందో!
ఈ సినిమాలోని పాత్రలను పరిచయం చేస్తూ.. చిత్రంలోని ఒక్కో క్యారెక్టర్‌ను రివీల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆది సాయికుమార్, స్వాసిక పాత్రల పేర్లతో ఇప్పటికే వారి ఫస్ట్ లుక్‌ని మేకర్స్ వదిలారు. ఆ పోస్టర్స్ మంచి స్పందనను రాబట్టుకోవడమే కాకుండా సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేశాయి. ఇప్పుడు అర్చన అయ్యర్ పాత్ర వంతొచ్చింది. దేవీ పాత్రలో అర్చన ఇందులో కనిపించనున్నారు. ఇక ఈ ఫస్ట్ లుక్ ఎలా ఉందంటే..
ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో అర్చన ఎరుపు కలర్ చీరలో ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తోంది. ఇంటెన్స్ ఎమోషన్స్‌ను పలికిస్తూ తన పాత్రలోని గంభీరతను తెలియజేస్తుంది. బ్యాక్ గ్రౌండ్‌లో పక్షులు, పంట, దేవాలయం, దిష్టిబొమ్మ ఇలా అన్నీ కూడా సినిమాపై మరింత ఆసక్తిని పెంచేలా ఉన్నాయి. ఇప్పటి వరకు వచ్చిన పోస్టర్లతోనే సినిమాపై అంచనాలను పెంచుతూ వస్తున్న చిత్రయూనిట్ త్వరలోనే టీజర్‌ని విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని యుగంధర్ ముని దర్శకత్వంలో షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభీమోజు, మహిధర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఆది సాయికుమార్ ఇందులో జియో సైంటిస్ట్ పాత్రలో కనిపించనున్నారు.