Anupama Parameswaran: డైరెక్టర్ టార్చర్ పెట్టాడు.. అనే టైటిల్ చూడగానే ఏవేవో ఊహించుకుంటారేమో కానీ, మీరు ఊహించుకునేది అయితే కానే కాదు. ఎందుకంటే, ఈ మధ్యకాలంలో అనుపమ పరమేశ్వరన్ చేసిన ‘పరదా’ (Paradha) ప్రమోషన్స్‌లో ఇండస్ట్రీకి సంబంధించి చాలా విషయాలను షేర్ చేసుకుంది. ముఖ్యంగా తను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి, తనకు ఇష్టం లేకపోయినా పెట్టిన కిస్సుల గురించి చెబుతూ వస్తుంది కాబట్టి.. టైటిల్ చూడగానే అంతా ఏవేవో ఊహించేసుకోవడం సహజమే. మరి అసలు విషయం ఏంటని అనుకుంటున్నారు కదా..
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas) హీరోగా రూపొందిన మిస్టీరియస్ అకల్ట్ థ్రిల్లర్ ‘కిష్కింధపురి’ (Kishkindhapuri). ఇందులో అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి (Koushik Pegallapati) దర్శకత్వం వహించగా.. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచేయగా, బుధవారం ఈ చిత్ర ట్రైలర్‌ను హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమా సెప్టెంబర్ 12న విడుదల కాబోతోంది. ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో అనుపమ పరమేశ్వరన్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
Also Read- Little Hearts Hero: ఎప్పుడో, ఎవరినో, ఏదో అన్నానని బాయ్‌కాట్ అంటున్నారు.. అసలు మీరు మనుషులేనా?
వైవిధ్యభరితమైన సినిమా
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ.. ట్రైలర్ అందరినీ నచ్చినందుకు చాలా హ్యాపీ. హారర్ నాకు ఇష్టమైన జానర్‌లలో ఒకటి. డైరెక్టర్ కౌశిక్ ఈ సినిమా కథ చెప్పిన వెంటనే నాకు నచ్చింది. చాలా డిఫరెంట్ పాత్ర ఇచ్చిన డైరెక్టర్ కౌశిక్‌కు థాంక్యూ. తను చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్. సాయితో మరోసారి పనిచేయడం ఆనందంగా ఉంది. ఇంతకు ముందు సాయితో కలిసి చేసిన ‘రాక్షసుడు’ మాకు వెరీ మెమొరబుల్ ఫిల్మ్‌గా నిలిచింది. మళ్లీ చాలా రోజుల తర్వాత సాయితో ఇలాంటి వైవిధ్యభరితమైన సినిమా చేయడం ఆనందాన్ని ఇచ్చింది. సెప్టెంబర్ 12న ఈ సినిమా రిలీజ్ అవుతోంది.. అందరూ థియేటర్స్‌కి వచ్చి చూడాలని కోరుకుంటున్నానని అన్నారు.
జ్వరంతో ఉండి కూడా..
స్టేజ్‌పై ఉన్న అనుపమను ఓ విలేఖరి.. ‘ఎందుకంత డల్‌గా ఉన్నారు’ అని ప్రశ్నించారు. దీనికి ఆమె సమాధానమిస్తూ.. కొన్ని రోజులుగా వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నాను. ఇంకా తగ్గలేదు.. అందుకే నీరసంగా కనిపిస్తున్నాను. జ్వరం ఉన్నా సరే.. ఇది మన సినిమా అని ప్రమోషన్స్‌కు వచ్చానని తెలిపింది. అందరూ క్లాప్స్ కొట్టి.. మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుందని ఆమెకు చెప్పారు.
Also Read- Anushka Shetty: ఖాళీ టైమ్‌లో స్వీటీ అనుష్క ఏం చేస్తుందో తెలుసా?
డిక్షనరీ ఉండాలి
ఈ కథ చెప్పినప్పుడు మీకు ఏం అనిపించింది అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. దర్శకుడు ఈ కథ చెప్పినప్పుడు మొదట నాకేం అర్థం కాలేదు. కానీ, కథను చెప్పిన తీరుకి ఇంప్రెస్ అయ్యాను. అందుకే ఈ సినిమా చేశాను. ముఖ్యంగా క్లైమాక్స్‌లో నా పాత్రను డిజైన్ చేసిన తీరు నాకు కొత్తగా ఉంటుంది. ఈ సినిమాలోని డైలాగ్స్‌కు అర్థం తెలియాలంటే మినిమమ్ ఓ చిన్న డిక్షనరీ అయినా ఉండాలి. డైలాగ్స్ చెప్పేటప్పుడు డబ్బింగ్ థియేటర్‌లో దర్శకుడు టార్చర్ పెట్టాడు. నా సినీ కెరీర్‌లో చాలా కష్టపడి డబ్బింగ్ చెప్పిన సినిమా ఇదేనని అనుపమ తెలిపింది. ఇదన్నమాట టార్చర్ వెనుక ఉన్న అసలు విషయం.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు