Annagaru Vastaru: కార్తి ‘అన్నగారు వస్తారు’కు అనిల్ రావిపూడి సపోర్ట్
Annagaru Vastaru Update (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Annagaru Vastaru: కార్తి ‘అన్నగారు వస్తారు’కు అనిల్ రావిపూడి సపోర్ట్.. సాలిడ్ అప్డేట్ ఇదే!

Annagaru Vastaru: కోలీవుడ్ స్టార్ హీరో కార్తి (Karthi) నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘వా వాతియార్’. ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘అన్నగారు వస్తారు’ (Annagaru Vastaru) టైటిల్‌తో రాబోతోన్న విషయం తెలిసిందే. ఇప్పుడీ ‘అన్నగారు వస్తారు’ సినిమాకు ‘మన శంకరవరప్రసాద్ గారు’ దర్శకుడు అనిల్ రావిపూడి సపోర్ట్ అందించబోతున్నారు. అవును, అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. అసలింతకీ అనిల్ రావిపూడి (Anil Ravipudi) ఈ సినిమాకు చేస్తున్న సపోర్ట్ ఏంటని అనుకుంటున్నారా? డిసెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న ఈ చిత్ర ప్రమోషన్స్‌ని మేకర్స్ తాజాగా స్టార్ట్ చేశారు. ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకోగా, చిత్ర టీజర్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. టీజర్ విడుదలకు సంబంధించిన సాలిడ్ అప్డేట్‌ని మేకర్స్ వదిలారు.

Also Read- Magic of Chikiri Chikiri: ‘తలా జారుతుంది చూస్కో’.. బుచ్చిబాబుపై రామ్ చరణ్ కామెడీ.. మేకింగ్ వీడియో వైరల్

అనిల్ రావిపూడి పట్టుకొస్తున్నారు

గురువారం ఈ చిత్ర టీజర్ రిలీజ్ అనౌన్స్‌మెంట్ అప్డేట్‌ని ఇచ్చారు మేకర్స్. ఈ నెల 28న సాయంత్రం 5.04 నిమిషాలకు (Annagaru Vastaru Teaser Release Date).. టాలీవుడ్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా ‘అన్నగారు వస్తారు’ సినిమా టీజర్‌ను విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా హీరో కార్తి నటిస్తున్నారు. ‘అన్నగారు వస్తారు’ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మూవీ లవర్స్ దృష్టిని ఆకర్షిస్తోండగా.. కార్తి కెరీర్‌లో ఈ సినిమా మరో బ్లాక్ బస్టర్ అవుతుందనే‌లా మేకర్స్ అంచనాలు వేస్తున్నారు. ఇందులో కార్తి సరసన ‘ఉప్పెన’ ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. కోలీవుడ్ ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ స్టూడియో గ్రీన్ బ్యానర్‌లో కె.ఇ. జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సత్యరాజ్, మధుర్ మిట్టల్, ఆనంద రాజ్, రాజ్ కిరణ్, శిల్పా మంజునాథ్, కరుణాకరణ్ తదితరులు ఇతర పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రాన్ని యాక్షన్ కామెడీ కథతో దర్శకుడు నలన్ కుమారస్వామి రూపొందిస్తున్నారు.

Also Read- Bigg Boss Telugu 9: తనూజకు పడిపోయిన యావర్.. డైరెక్ట్‌గా ఏం అడిగాడో తెలుసా?

కార్తి, కృతిలకు ఈ సినిమా ఎంతో కీలకం

హీరో కార్తి, హీరోయిన్ కృతి శెట్టికి ఈ సినిమా సక్సెస్ సాధించడం ఎంతో కీలకం. ఎందుకంటే, వీరిద్దరికీ హిట్ పడి చాలా కాలం అవుతుంది. మరీ ముఖ్యంగా కృతి శెట్టి‌కి తెలుగులో మంచి పేరు వచ్చినా, ప్రస్తుతం ఆమెకు తెలుగులో అవకాశాలే రావడం లేదు. కారణం, ఆమెకు సరైన హిట్ లేకపోవడమే. అందుకే ఈ సినిమాపై ఆమె ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంది. కార్తి కూడా ఈ సినిమా తనకు మంచి కమ్ బ్యాక్ ఫిల్మ్ అవుతుందని అంటున్నారు. విడుదల తేదీ ఎప్పుడనేది ఇంకా చెప్పలేదు కానీ, డిసెంబర్‌లోనే ఈ సినిమా రిలీజ్ ఉంటుందని మేకర్స్ గట్టిగా చెబుతున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!

Artificial Intelligence: ఏఐ రంగంలో భారత్ సరికొత్త రికార్డు.. గ్లోబల్ ర్యాంకింగ్‌లో మూడో స్థానం

Congress Election Strategy: రెండో విడత కాంగ్రెస్ కొత్త స్ట్రాటజీ.. మెజార్టీ స్థానాలపై ఫోకస్..!

Telangana BJP: మున్సిపాలిటీలు విలీనంపై బీజేపీ పోరుబాట.. ఎస్ఐఆర్ పై కీలక నిర్ణయం