Anil Ravipudi: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ (Mana Shankara Varaprasad Garu). సంక్రాంతి సందడిని రెట్టింపు చేసేలా ఈ సినిమా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్‌ని అనిల్ రావిపూడి (Anil Ravipudi) పక్కా ప్లానింగ్‌తో నిర్వహిస్తున్నారు. అనిల్ రావిపూడి ప్రమోషనల్ స్ట్రాటజీ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో అది అందరికీ అర్థమైంది. ఇప్పుడు మెగాస్టార్ చిత్రానికి కూడా ఆయన ఎక్కడా తగ్గడం లేదు. సినిమా ప్రారంభమైనప్పటి నుంచి ఏదో విధంగా ఈ సినిమాను వార్తలలో ఉంచుతూనే ఉన్నారు. ఈ క్రమంలో మంగళవారం సినిమా నుంచి ‘మెగా విక్టరీ మాస్’ సాంగ్‌ని విడుదల చేసేందుకు గుంటూరు విజ్ఞాన్ కాలేజీలో సందడి చేశారు. అక్కడి విద్యార్థులతో కలిసి ఆయన డ్యాన్సులు చేస్తూ, డైలాగ్స్ చెబుతూ.. తనదైన తరహాలో హైప్‌ని క్రియేట్ చేశారు.
అనిల్ రావిపూడి లోకల్
అనంతరం ఈ కార్యక్రమంలో అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ‘‘విజ్ఞాన్ యూనివర్సిటీకి ఎంతోమంది అతిథులు వస్తుంటారు, పోతుంటారు. అనిల్ రావిపూడి మాత్రం లోకల్. మిమ్మల్ని అందరిని మళ్ళీ ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇంతకుముందు చాలా ఈవెంట్స్ నిమిత్తం ఇక్కడకు వచ్చాను. ఫస్ట్ టైమ్ నా మూవీ సాంగ్ లాంచ్ వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఇదే కాలేజీలో ఇంజనీరింగ్ పాసై, తెలుగు సినిమా ఇండస్ట్రీకి వెళ్లి ఈరోజు ఇలా డైరెక్టర్‌గా నిలబడ్డాను. ఆ జర్నీ అంతా కళ్ళ ముందు కనిపించింది. విజ్ఞాన్ మహోత్సవం వేడుకలో నేను ఫస్ట్ టైమ్ ఒక స్కిట్‌ని డైరెక్ట్ చేశాను. నిజంగా ఆ ఈవెంట్ లేకపోతే నేను డైరెక్షన్ వైపు వెళ్లే వాడినే కాదు. కాలేజ్ అనేది ఎడ్యుకేషన్ మాత్రమే కాదు మన లక్ష్యాన్ని చూపించే ఒక మార్గం. దానికి నేనే ఉదాహరణ.
Also Read- Mana Shankara Varaprasad Garu: ‘మెగా విక్టరీ మాస్’ సాంగ్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
తొమ్మిదో సినిమా
‘మన శంకర వరప్రసాద్ గారు’ నా తొమ్మిదో సినిమా. నాకు చాలా స్పెషల్ చిత్రం. ఎందుకంటే, నేను చిన్నప్పటి నుంచి తెలుగు సినిమా స్టార్స్‌ని చూస్తూ పెరిగాను. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున.. ఈ నలుగురు స్టార్స్ సినిమాలు చూస్తున్నప్పుడు.. ఎలాగైనా వీళ్లతో సినిమాలు చేయాలనే డ్రీమ్ ఉండేది. వెంకటేష్, బాలకృష్ణ వంటి స్టార్స్‌తో ఆల్రెడీ చేశాను. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే అద్భుతమైన అవకాశం వచ్చింది. స్కూల్ డేస్‌లో నేను ఆయన పాటలకు డ్యాన్స్ చేసేవాడిని. అలాంటి హీరో సినిమాను డైరెక్ట్ చేసే అవకాశం రావడం, అలాగే నాకు ఇష్టమైన జానర్‌లో సినిమా చేయడం.. నిజంగా చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. చిరంజీవి అంటే అందరికీ ఒక సెలబ్రేషన్. ఆయన ఇందులో అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. ఈ సినిమా కోసం చాలా స్లిమ్ అయ్యారు. అందుకు ఎంతగానో హార్డ్ వర్క్ చేశారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆయనకు ఇక్కడి నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
Also Read- Rajinikanth 173: రజనీకాంత్ ‘థలైవర్ 173’ చిత్రానికి ‘పార్కింగ్’ దర్శకుడు!.. షూటింగ్ ఎప్పుడంటే?
మళ్లీ మళ్లీ చూడాలి
మా నిర్మాతలు సాహు, సుస్మితలకు థాంక్యూ. విక్టరీ వెంకటేష్ ఈ సినిమాలో ఒక స్పెషల్ కేమియో చేశారు. చిరంజీవి, వెంకటేష్ వంటి ఇద్దరు స్టార్స్‌ని ఒక ఫ్రేమ్‌లో చూడాలనేది ఎప్పటి నుంచో చాలామందికి డ్రీమ్ ఉంది. ఈ ఇద్దరు స్టార్స్ చేసిన అల్లరి డాన్స్ మీరు థియేటర్స్‌లో చాలా రోజులు గుర్తు పెట్టుకుంటారు. ఈ సంక్రాంతి అందరికీ చాలా మెమరబుల్‌గా ఉంటుంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ నా కెరీర్‌లో ఒక గేమ్ చేంజింగ్ ఫిల్మ్. ఈ సంక్రాంతి కూడా అలాగే అవుతుందని ఆశిస్తున్నాను. జనవరి 12న ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాను థియేటర్లకు వెళ్లి చూడాలని కోరుతున్నాను. అలాగే పండక్కి వస్తున్న ప్రభాస్ ‘ది రాజా సాబ్’, మాస్ మహారాజా రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, ఇంకా నవీన్, శర్వా సినిమాలు కూడా వస్తున్నాయి. అందరి సినిమాలను చూసి, ఈ సంక్రాంతిని ఒక సినిమా ఫెస్టివల్‌గా చేయాలని కోరుకుంటున్నాను. ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాను థియేటర్స్‌లో మళ్లీ మళ్లీ చూడాలని కోరుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

