Andhra King Taluka: ఉస్తాద్ రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా రూపుదిద్దుకుంటోన్న యూనిక్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ (Andhra King Taluka). ఈ సినిమా రామ్‌కు ఎంతో కీలకమైనదనే విషయం తెలియంది కాదు. రామ్ పరంగా ప్రతి సినిమాకు ఎంత ఎనర్జీ కావాలో అంతా ఇస్తుంటాడు. కానీ హిట్ మాత్రం ఆయనకు దగ్గరకు వచ్చినట్టే వచ్చి చేజారిపోతుంది. ఇప్పుడాయన రేసులో ఉండాలంటే ‘ఆంద్ర కింగ్ తాలుకా’ మూవీ కచ్చితంగా హిట్ కావాల్సి ఉంది. ఈ సినిమాకు సంబంధించి వస్తున్న అప్డేట్స్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేస్తున్న క్రమంలో తాజాగా ఓ అదిరిపోయే అప్డేట్‌ని మేకర్స్ వదిలారు. ఇప్పటి వరకు ఎనర్జిటిక్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న రామ్, ఇప్పుడు మరో అవతారం ఎత్తారు. ఆ అవతారం ఏంటంటే..
టాలెంటెడ్ మ్యూజిక్ డ్యూయో వివేక్–మెర్విన్ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కోసం అదిరిపోయే ఆల్బమ్‌ను కంపోజ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ఆల్బమ్ నుంచి ఫస్ట్ సింగిల్ జూలై 18న విడుదల కాబోతున్న నేపథ్యంలో, ఈ ఫస్ట్ సింగిల్‌కు ఓ విశిష్టత ఉన్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఫస్ట్ టైమ్ రామ్ లిరిసిస్ట్‌గా మారుతున్నారు. అవును జూలై 18న రాబోతున్న ఫస్ట్ సింగిల్‌కు హీరో రామ్ పోతినేని లిరిక్స్ అందించినట్లుగా మేకర్స్ ఈ అప్డేట్‌లో తెలిపారు. ఇప్పటి వరకు స్టార్ హీరోలు పాటలు పాడటం చూశాం. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున వంటి వారు తమ సినిమాలలో పాటలు పాడారు. కానీ ఏ హీరో లిరిక్స్ రాసిన దాఖలాలు అయితే లేవు. ఫస్ట్ టైమ్ రామ్ ఆ ఘనత సాధించారు.
Also Read- Virgin Boys: సినిమా సమీక్షకుడిపై నిర్మాత ఫైర్.. స్పందించిన పుచుక్ పుచుక్!
లిరిసిస్ట్‌గా ఇది రామ్ తొలి సాంగ్. ఈ మెలోడియస్ ట్రాక్‌ని రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ పాడడం విశేషం. అనిరుధ్ పాడిన చాలా పాటలు చార్ట్ బస్టర్స్ హిట్ కావడంతో.. ఈ పాటపై అంచనాలు మాములుగా లేవు. మంచి ఎమోషనల్ లిరిక్స్, అనిరుధ్ వాయిస్, బ్యూటీఫుల్ లొకేషన్స్.. అన్నీ కలిసి ఈ పాట అందరినీ అద్భుతంగా అలరిస్తుందని మేకర్స్ తెలుపుతున్నారు. ఈ సినిమాలో రామ్ సినిమా అంటే పిచ్చి ఇష్టం వున్న కుర్రాడిగా కనిపించబోతున్నారు. మహేష్ బాబు పి దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లో చివరి షూటింగ్ షెడ్యూల్‌లో ఉంది. రామ్ పోతినేని సరసన భాగ్యశ్రీ బోర్సే (మిస్టర్ బచ్చన్ ఫేమ్) హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, విటివి గణేష్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం మ్యూజిక్ ప్రమోషన్స్ జోరందుకున్నాయి, పోస్ట్-ప్రొడక్షన్ కూడా చివరిదశలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు