Anasuya: బుల్లితెర అయినా, వెండితెర అయినా, ఆఖరికి సోషల్ మీడియా అయినా సరే.. అనసూయ కనబడితే చాలు కుర్రాళ్లు కుదురుగా ఉండలేకపోతున్నారు. కావాలని చేస్తుందో, లేదంటే కాసేపు చూసుకుని ముచ్చటపడతారని కవ్విస్తుందో తెలియదు కానీ, అనసూయ నిత్యం ఏదో ఒక ఫొటోతో సోషల్ మీడియాలో అల్లరల్లరి చేస్తుంటుంది. ఆ ఫొటోలను చూసిన నెటిజన్లు కొందరు తిక్కతిక్కగా కామెంట్స్ చేస్తే వాళ్లకి ఇచ్చి పడేస్తుంది. మొత్తంగా అయితే ఎలా చూసినా కూడా అనసూయ వార్తలలోనే ఉంటుంది. ముఖ్యంగా ఆమె అందానికి అంతా ఫిదా అవుతున్నారు.
Also Read- Amala Paul: నా భర్తకు ఆ సీక్రెట్ తెలియదు.. సంచలన కామెంట్స్ చేసిన అమలాపాల్
పెళ్లై, ఇద్దరు పిల్లలు ఉన్నారు అంటే ఎవరూ నమ్మను కూడా నమ్మరు. అంతగా ఆమె తన గ్లామర్‌ని మెయింటైన్ చేస్తుంది. ఈ మధ్య కాస్త భారీగా తయారైనప్పటికీ, గ్లామర్ విషయంలో మాత్రం తగ్గేదే లే అన్నట్లుగా చీరకట్టినా, చుడిదార్ వేసినా.. ఏ డ్రస్‌లో కనిపించినా కూడా అనసూయ అందానికి షేక్ అవ్వాల్సిందే. అసలు తన వయసు పెరుగుతుందా? తగ్గుతుందా? అనేలా కూడా కొందరు కామెంట్స్ చేస్తుంటారు. ఈ మధ్య బుల్లితెరపై చేసే షో ల కోసం అనసూయ ఇంకాస్త హాట్‌గా తయారవుతుంది. ఈ షోలకి అనసూయ వంటి వారిని ఎందుకు తీసుకుంటారో? అందుకు న్యాయం చేస్తూ వస్తుంది. తాజాగా ఆమె సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. (Anasuya Glamour Photos)
Also Read- Veera Chandrahasa: దర్శకుడిగా ‘కెజియఫ్, సలార్’ చిత్రాల సంగీత దర్శకుడు.. విశ్వక్ సేన్ సపోర్ట్
బుల్లితెరపై తను జడ్జిగా చేస్తున్న ఓ షోలో పాల్గొన్న డ్రస్ అది. ఏ షో చేసినా, ఆ షో కి సంబంధించిన డ్రస్‌తో ఉన్న ఫొటోలను ముందుగానే అనసూయ షేర్ చేస్తూ ఉంటుంది. అంటే అర్థం నెక్స్ట్ నేను ఈ డ్రస్సులో కనిపించి, కనువిందు చేయబోతున్నాను అని తెలియడానికో, లేదంటే ఆ డ్రస్ వెనుక ఉన్న వారి వివరాలను తెలియజెప్పడానికో తెలియదు కానీ, ఒక బంచ్‌గా ఫొటోలను సోషల్ మీడియాలో వదిలి, అటెన్షన్ పొందుతుంటుంది. ఇప్పుడు షేర్ చేసిన ఫొటోలు కూడా అసలు కళ్లు పక్కకి తిప్పుకోనీయడం లేదంటే అతిశయోక్తి కానే కాదు. నిజంగా అది అనసూయ అందానికి ఉన్న పవర్ అని చెప్పుకోవచ్చు.
ఈసారి అనసూయ పోస్ట్ చేసిన ఫొటోలలో బికినీ ఏం వేయలేదు. చాలా పద్ధతిగానే ఉంది. ట్రెడిషనల్ లుక్‌లో కూడా గ్లామర్ ఒలకబోయడం కేవలం అనసూయకే సాధ్యమనేలా తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోలున్నాయి. ఈ ఫొటోలకు నెటిజన్లు మాత్రమే కాదు, కొందరు సెలబ్రిటీలు కూడా షాకవుతున్నారు. అనసూయ అందాన్ని కామెంట్స్‌లో పొగిడేస్తున్నారు. మొత్తంగా, అనసూయ మాత్రం ఈ ఫొటోలతో మరోసారి సోషల్ మీడియాను షేక్ చేస్తుందన్నది మాత్రం నిజం. అందులో డౌటే లేదు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు