Veera Chandrahasa
ఎంటర్‌టైన్మెంట్

Veera Chandrahasa: దర్శకుడిగా ‘కెజియఫ్, సలార్’ చిత్రాల సంగీత దర్శకుడు.. విశ్వక్ సేన్ సపోర్ట్

Veera Chandrahasa: కంచి కామాక్షి కోల్‌కతా కాళీ క్రియేషన్స్ బ్యానర్‌‌పై నిర్మాత ఎమ్‌వీ రాధాకృష్ణ తెలుగులో విడుదల చేస్తున్న కన్నడ చిత్రం ‘వీర చంద్రహాస’. ఎమ్‌వీ రాధాకృష్ణ విషయానికి వస్తే.. గతంలో శివరాజ్ కుమార్ నటించిన ‘వేద’, ప్రజ్వల్ దేవరాజ్ నటించిన ‘రాక్షస’ చిత్రాలను ఆయన తెలుగులో విడుదల చేశారు. ఇప్పుడు ‘వీర చంద్రహాస’ తెలుగు రైట్స్‌ను దక్కించుకున్నారు. అతి త్వరలో తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.‘కెజియఫ్, సలార్’ వంటి యాక్షన్ చిత్రాలకు సంగీతం అందించి.. సంగీత దర్శకుడిగా తిరుగులేని స్టార్‌డమ్ సొంతం చేసుకున్న రవి బస్రూర్, ‘వీర చంద్రహాస’ చిత్రంతో దర్శకుడిగా మారి తన ప్రతిభను చాటబోతున్నారు.

Also Read- Natural Star Nani: శత్రువులకి ఆ శాటిస్‌ఫ్యాక్షన్ ఇవ్వకూడదనే ఈ ఫంక్షన్ పెట్టా..

రవి బస్రూర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషించగా శిథిల్ శెట్టి, నాగశ్రీ జిఎస్, ప్రసన్న శెట్టిగార్ మందార్తి, ఉదయ్ కడబాల్, రవీంద్ర దేవాడిగ, నాగరాజ్ సర్వెగర్, గుణశ్రీ ఎం నాయక్, శ్రీధర్ కాసర్కోడు, ప్రజ్వల్ కిన్నాల్ ప్రధాన పాత్రల్లో నటించారు. కన్నడ అగ్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో ఓంకార్ మూవీస్ బ్యానర్‌‌పై ఎన్ ఎస్ రాజ్‌కుమార్ నిర్మించారు. ఏప్రిల్ 18న కన్నడలో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఈ మూవీ తెలుగు రిలీజ్‌ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శుక్రవారం ఈ మూవీ తెలుగు వెర్షన్‌ ట్రైలర్‌‌ను మాస్ కా దాస్ విశ్వక్ సేన్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేసి చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

‘వీర చంద్రహాస’ టైటిల్‌తో పాటు ట్రైలర్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. రవి బస్రూర్ మల్టీ టాలెంట్ ఉన్న పర్సన్. ఇప్పటి వరకు ప్రేక్షకులను తనదైన సంగీతంతో అలరించిన ఆయన, డైరెక్టర్‌‌ గానూ తానెంటో ప్రూవ్ చేశారు. ఎమ్‌వీ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తుండటం చాలా ఆనందంగా ఉంది. టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్’ అని విశ్వక్ సేన్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇక ఈ చిత్ర ట్రైలర్‌ను గమనిస్తే.. వీర చంద్రహాస అనేది ‘మహాభారతం’లోని అశ్వమేధిక పర్వంలోని కథ. ఇది ఒక అనాథ కుర్రాడికి సంబంధించిన కథను చెబుతుంది. పరాక్రమవంతుడు, సద్గుణవంతుడు వీర చంద్రహాసుడు అవుతాడు. సినిమా చరిత్రలో మొట్టమొదటిసారిగా యక్షగానం వెండితెరపై పూర్తి వైభవంతో రావడం, ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా ప్రతీ ఫ్రేమ్ ఉండటంతో ట్రైలర్‌‌ చూడగానే సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇందులో శివ రాజ్‌కుమార్ లుక్ చాలా డిఫరెంట్‌గా ఉంది. రవి బస్రూర్ టేకింగ్‌తో పాటు ఆయన అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవచ్చు.

Also Read- Kayadu Lohar: కయదు లోహర్ టైమ్ నడుస్తోంది.. లేకపోతే ఏంటీ ఆఫర్స్!

ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్న నిర్మాత ఎమ్‌వీ రాధాకృష్ణ మాట్లాడుతూ.. ఇటీవల కన్నడలో విడుదలైన ఈ సినిమా హిట్ టాక్‌తో పాటు మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ మూవీ తెలుగు రైట్స్ దక్కించుకోవడం చాలా హ్యాపీగా ఉంది. మంచి కంటెంట్‌ ఉన్న చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని ఇప్పటికే ఎన్నో సార్లు ప్రూవ్ అయింది. ఈ చిత్రానికి కూడా తెలుగు ఆడియెన్స్‌ బ్రహ్మారథం పడతారని ఆశిస్తున్నానని అన్నారు. కన్నడ ప్రేక్షకుల్లా, తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాను ఆదరించాలని దర్శకుడు రవి బస్రూర్ కోరారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ