Raa Raja Release Date: ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న పేరు ‘రా రాజా’. అంతకు ముందు సూపర్ స్టార్ రజినీకాంత్ చెప్పిన ‘అర్థమైందా రాజా’నే ఇందుకు కారణం. అలాగే రీసెంట్‌గా రిలీజైన ఈ చిత్ర ట్రైలర్ కూడా ఈ సినిమా గురించి మాట్లాడుకునేలా చేస్తుంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీ పోస్టర్‌ని టాలీవుడ్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు. ‘రా రాజా’ రిలీజ్ డేట్ పోస్టర్ ఆకట్టుకోవడంతో పాటు, మేకర్స్ ప్రకటించిన రిలీజ్ డేట్ కూడా ఈ సినిమాని వార్తలలో నిలుపుతోంది. ఏంటో ఆ స్పెషల్ అని అనుకుంటున్నారా?
శ్రీమతి పద్మ సమర్పణలో శ్రీ పద్మిణి సినిమాస్ బ్యానర్‌పై బి. శివ ప్రసాద్ రూపొందించిన చిత్రం ‘రా రాజా’. ఆర్టిస్టులు ఎవరో చెప్పకుండా, ఆర్టిస్ట్‌లను చూపించకుండా కేవలం కథ, కథనాలపైనే నడిచే సినిమా ఇది. అసలు ముఖాలు చూపించకుండా సినిమాను తీయడం అంటేనే సాహసం. అలాంటి అద్భుతమైన ప్రయోగం చేసిన టీమ్.. ఇప్పటికే వచ్చిన ట్రైలర్‌తో అందరినీ మెప్పించారు. ఈ ట్రైలర్‌ను వీక్షించిన అనంతరం తమ్మారెడ్డి భరద్వాజ్ రిలీజ్ డేట్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇలాంటి ప్రయోగం చేసిన సినిమా టీమ్‌ను ఆయన ఎంతగానో మెచ్చుకున్నారు. దీనిపై ఆయన మాట్లాడుతూ..
Also Read- Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఆ ఫోబియా పోలేదా!
‘‘ఈ సినిమా టైటిల్‌ను చూస్తుంటే ఏదో ప్రేమ కథలా ఉంది. కానీ, ఈ చిత్రంలో ఒక్క ముఖం కూడా కనిపించదంటున్నారు. ట్రైలర్ కూడా అద్భుతంగా కట్ చేశారు. అసలు ఫేస్‌లు చూపించకుండా సినిమా తీసి దర్శకుడు శివ ప్రసాద్ చాలా ధైర్యం చేశాడు. ‘డ్యూయెల్’ అని స్పీల్ బర్గ్ తీసిన చిత్రంలోనూ ఫేస్ కనిపించదు. అలానే ఈ చిత్రంలోనూ ముఖాలు కనిపించవని అంటున్నారు. ఇది చాలా పెద్ద ప్రయోగం. ఇది కనుక సక్సెస్ అయితే ఇండస్ట్రీలో చాలా మార్పు వస్తుంది. అసలు హీరోలు, స్టార్లతో పని లేకుండా అద్భుతమైన చిత్రాలు, ప్రయోగాలు చేయవచ్చని అంతా ముందుకు వస్తారు. హీరో హీరోయిన్ల కోసం సినిమాలకు వస్తుంటారు. కానీ ఇందులో ఫేస్‌లు కూడా కనిపించవు. కథే ముందుకు తీసుకెళుతుంటుంది. ఈ అద్భుతమైన ఐడియా నాకు బాగా నచ్చింది. ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. శేఖర్ చంద్ర మ్యూజిక్ హంట్ చేస్తుంది. మార్చి 7న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ మూవీని అందరూ చూసి సపోర్ట్ చేస్తే.. ఇలాంటి ప్రయోగాలు మరికొన్ని టాలీవుడ్‌లో చేయడానికి దర్శకనిర్మాతలు ఆసక్తి కనబరుస్తారు’’ అని తమ్మారెడ్డి చెప్పుకొచ్చారు. రిలీజ్ డేట్ పోస్టర్ విడుదల చేసిన తమ్మారెడ్డి భరద్వాజ్‌కు దర్శకుడు శివ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బూర్లే హరి ప్రసాద్, లైన్ ప్రొడ్యూసర్ కిట్టు ధన్యవాదాలు తెలిపారు.
విడుదల తేదీకి ఉన్న స్పెషల్ ఇదే
మార్చి 7న ఏం పండుగ కూడా లేదు.. భలే డేట్ పట్టారని అంటున్నారు. ఏంటో ఆ స్పెషల్ తెలుసుకోవాలని అనుకుంటున్నారు కదా. అదేం లేదు. ఫిబ్రవరి 28న కొన్ని సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. మార్చి 14న మరికొన్ని సినిమాలు లైన్‌లో ఉన్నాయి. కానీ, మధ్యలో ఉన్న మార్చి 7న ఇంత వరకు ఎవరు విడుదల తేదీని ప్రకటించలేదు. ఆ టైమ్‌కి ఏమైనా పోటీ ఉంటుందేమో తెలియదు కానీ, ప్రస్తుతానికైతే ఈ సినిమాకు సోలో రిలీజ్ దొరకబోతుంది. అది మ్యాటర్.

ఇవి కూడా చదవండి: