Ambati Rayudu Comments on Celebrities
ఎంటర్‌టైన్మెంట్

Ambati Rayudu: రాయుడు నోటి దూల.. ఫ్యాన్స్‌ అస్సలు తగ్గట్లే!

Ambati Rayudu: ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ అంటే వరల్డ్ వైడ్‌గా విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి మెగా ఈవెంట్‌లో ఇరు జట్లు పోటీ పడుతున్నాయంటే ఇక ఆ క్రేజే వేరు. క్రికెట్ అభిమానులు ఈ రెండు టీమ్స్ మధ్య జరిగే మ్యాచ్ చూసేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అందరూ టీవీలకు అతుక్కు పోతుంటారు. మరికొందరు మ్యాచ్ జరిగే ప్రదేశానికి వెళ్లి మరి స్టేడియంలో మ్యాచ్ వీక్షిస్తుంటారు. అయితే దుబాయ్‌ వేదికగా ఛాంపియ‌న్స్ ట్రోఫీలో భాగంగా దాయాది దేశాలైన భార‌త్‌ – పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య ఆదివారం జ‌రిగిన మ్యాచ్‌కి సినిమా, క్రీడా, రాజకీయ, పారిశ్రామిక రంగాలకు చెందిన ప్రముఖులందరూ పెద్ద ఎత్తున వెళ్లి వీక్షించారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలుపును ఆస్వాదించి.. గ‌ర్వంగా ఫీల‌య్యారు.

Also Read- Mokshagna Teja: 2025లోనూ మోక్షం లేనట్టేనా?

ఈ మ్యాచ్‌ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి కొందరు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా వెళ్లారు. మెగాస్టార్ చిరంజీవి, ఏపీ మినిస్టర్ నారా లోకేష్, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, ‘పుష్ప’ సిరీస్ చిత్రాల డైరెక్టర్ సుకుమార్ తదితరులు దుబాయ్ వెళ్లి స్టేడియంలో ఎంజాయ్ చేశారు. మ్యాచ్ జరుగుతుండగా స్క్రీన్స్‌పై వీరందరూ కనిపించారు. ఈ క్రమంలోనే ‘ప్రైడ్ ఆఫ్ తెలుగు’ అని కామెంటేటర్ వ్యాఖ్యానించారు కూడా. అయితే ఇలా ప్రముఖులు అక్కడికి వెళ్ళి మ్యాచ్ వీక్షించడంపై ఏపీకి చెందిన మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశాడు. ఇలాంటి మ్యాచ్‌లు జరిగినపుడు వెళితే పబ్లిసిటీ పెరుగుతుందని, అందుకే అక్కడికి వెళ్లి మ్యాచ్ వీక్షిస్తుంటారని కామెంట్స్ చేశారు. ‘ఇలాంటి మ్యాచ్‌లకు వెళితేనే టీవీల్లో ఎక్కువ కనిపిస్తారు. ఇదంతా పబ్లిసిటీ స్టంట్’ అని రాయుడు అన్న వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశాడో తెలియదు కానీ, అందరూ దీని గురించే చర్చించుకుంటున్నారు. మరీ ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ఈ మ్యాచ్‌ని డైరెక్ట్‌గా చూసిన వారిలో ఉండటంతో ఆయన అభిమానులు రాయుడుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, సోషల్ మీడియాలో చెలరేగిపోతున్నారు.

ప్రస్తుతం ఈ అంశం పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే సోషల్ మీడియా వేదికగా అంబటి కామెంట్స్‌ని కొందరు తప్పుపడుతుండగా.. మరికొందరి సమర్ధిస్తున్నారు. ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశాడో మాత్రం స్పష్టత లేదు. అక్కడికి సెలెబ్రిటీలతో పాటు సామాన్య జనాలు కూడా వెళ్లారు. మరి ఎవరిని ఉద్దేశించి కామెంట్స్ చేశాడో అంబటి రాయుడు మాత్రం స్పందించాల్సిన అవసరం ఉంది.. లేదంటే, ఇది పెద్ద చర్చకు దారి తీసే అవకాశం ఉంది. అయితే కొందరు మాత్రం ఓ డైరెక్టర్, ఓ నాయకుడిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశాడని అంటున్నారు. రాయుడు అన్న ఈ వ్యాఖ్యలపై అక్కడికి వెళ్లిన ఏ సెలబ్రిటీ కూడా ఇంత వరకు స్పందించలేదు. చూడాలి మరి ఈ వ్యవహారం ఎంత వరకు వెళ్తుందో.

ఇవి కూడా చదవండి:
Trivikram Srinivas: సినిమాలకు దూరం.. పవన్‌తోనే పయనం

Pragya Jaiswal: ‘అఖండ 2’ నుంచి ప్రగ్యాను ఎందుకు తీసేశారు?

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!