Allu Arjun–Atlee Film: బాక్సాఫీస్ వద్ద అల్లు అర్జున్ మెగా బ్లాస్టర్..
aa29(x)
ఎంటర్‌టైన్‌మెంట్

Allu Arjun–Atlee Film: బాక్సాఫీస్ వద్ద అల్లు అర్జున్ మెగా బ్లాస్టర్.. అట్లీ ప్రాజెక్ట్ ఓటీటీ డీల్ సెన్సేషన్!

Allu Arjun–Atlee Film: భారతీయ సినీ యవనికపై ప్రస్తుతం ఒకే ఒక పేరు మార్మోగిపోతోంది. అది ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ మరియు బ్లాక్ బస్టర్ దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం. సన్ పిక్చర్స్ నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ సినిమా, ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే భారతీయ సినిమా బిజినెస్ లెక్కలను తిరగరాస్తోంది. సాధారణంగా ఒక పెద్ద సినిమాకు థియేట్రికల్ వసూళ్లు ప్రధాన ఆదాయ వనరుగా ఉంటాయి. కానీ, ఈ క్రేజీ ప్రాజెక్ట్ విషయంలో సీన్ రివర్స్ అయింది. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్ర OTT (డిజిటల్) హక్కుల కోసం ఒక ప్రముఖ సంస్థ ఏకంగా రూ.600 కోట్లు వెచ్చించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు ఏ భారతీయ సినిమాకూ దక్కని అత్యంత భారీ డీల్ ఇది. అల్లు అర్జున్‌కు ఉన్న గ్లోబల్ మార్కెట్ వాల్యూను ఈ ఒప్పందం అద్దం పడుతోంది.

Read also-Naga Vamsi: టికెట్ ధరల గురించి నిర్మాత నాగవంశీ ఏం చెప్పారంటే?.. రూ.99 అందుకే కష్టం..

సరిహద్దులు దాటి..

ఈ సినిమా కేవలం పాన్-ఇండియా చిత్రంగానే కాకుండా, ప్రపంచ స్థాయి ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందుతున్నట్లు స్పష్టమవుతోంది. అట్లీ మార్క్ స్టైలిష్ యాక్షన్, అల్లు అర్జున్ స్క్రీన్ ప్రెజెన్స్ తోడైతే వెండితెరపై ఒక ‘మాగ్నం ఓపస్’ వండర్ రావడం ఖాయం. ‘పుష్ప’ చిత్రంతో అల్లు అర్జున్ క్రేజ్ దేశ సరిహద్దులు దాటింది. జపాన్, రష్యా వంటి దేశాల్లోనూ ఆయనకు ఫాలోయింగ్ పెరిగింది. ‘జవాన్’ చిత్రంతో హిందీ మార్కెట్‌ను శాసించిన అట్లీ, ఇప్పుడు అల్లు అర్జున్‌తో కలిసి అంతకు మించిన ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. భారీ చిత్రాలను నిర్మించడంలో రాజీ పడని సన్ పిక్చర్స్, ఈ ప్రాజెక్ట్ కోసం నీళ్లలా డబ్బు ఖర్చు చేస్తోంది.

Read also-Naa Anveshana: నా అన్వేషణ అన్వేష్‌పై ఫిర్యాదు.. ఇండియాకు వచ్చాడా.. ఇక అంతే!

ఇంకా టైటిల్ ఖరారు కాకుండానే, షూటింగ్ మొదలవ్వకుండానే రూ. 600 కోట్ల బిజినెస్ అంటే ట్రేడ్ విశ్లేషకులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈ లెక్కన సినిమా థియేటర్లలోకి వస్తే బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులు బద్దలవుతాయో ఊహించడం కష్టమే. ఈ సినిమా ఇండియన్ సినిమా స్టాండర్డ్స్‌ను మరో మెట్టు ఎక్కించబోతోంది. ఇప్పటికే ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టకున్నారు. ఈ సినిమా గురించి వచ్చే అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Just In

01

Santhakumari: మోహన్‌లాల్‌ తల్లి శాంతకుమారి కన్నుమూత

Self Care Tips: మనసు తట్టుకోలేనంత ఒత్తిడితో నిండి ఉందా?.. అయితే, ఈ చిట్కాల పై ఓ లుక్కేయండి!

Irrigation Neglect: అధ్వానంగా మారిన మేజర్, మైనర్ కెనాల్స్.. నీరు వచ్చేనా.. పంట పడేనా..!

IRCTC New Feature: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. టికెట్ బుకింగ్‌లో కీలక మార్పు.. ఈ తప్పు చేయకండి!

Crime News: పనిమనుషుల అసాధారణ దారుణం.. సినిమాలను తలపించే రీతిలో ఐదేళ్లపాటు..