Kannappa: మంచు విష్ణు ‘కన్నప్ప’ సినిమా(Kannappa Movie)ను పాన్ ఇండియా స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన విషయం తెలిసిందే. ఇందులో దాదాపు ప్రతి లాంగ్వేజ్ నుంచి ఒక్కో స్టార్ నటించారు. తెలుగు నుంచి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, హిందీ నుంచి అక్షయ్ కుమార్, మళయాళం నుంచి మోహన్‌లాల్, తమిళ్ నుంచి శరత్‌కుమార్.. ఇలా ప్రముఖ నటులంతా ‘కన్నప్ప’ చిత్రంలో నటించి మెప్పించారు. రుద్ర పాత్రలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) కనిపించడంతో సినిమాకు మంచి హైప్ వచ్చింది. మోహన్‌బాబు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సనిమాకు కథ, స్క్రీన్‌ప్లే మంచు విష్ణు(Vishnu Manchu) తనే స్వయంగా చూసుకున్నారు. గత నెల 27 న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే రాబట్టింది. కలెక్షన్లు వసూలు చేయడంలో మాత్రం వెనుకబడే ఉంది.
Read Also- Tummala NageswaraRao: తెలంగాణకు యూరియా సరఫరా.. కేంద్రంతో సంప్రదింపులు.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
తాజాగా కన్నప్ప సినిమాపై సోషల్ మీడియాలో పలు వార్తల చక్కర్లు కొడుతున్నాయి. శివుడి పాత్రలో నటించిన అక్షయ్ కుమార్(Akshay Kumar )పై నెటిజన్లు మండి పడుతున్నారు. ఏ పాత్రలో అయినా ఒదిగిపోయే అక్షయ్ కుమార్ ‘కన్నప్ప’ సినిమాలో శివుడి పాత్ర చేయడంలో మాత్రం తడబడ్డాడని అంటున్నారు. దీనికి సంబంధించిన పలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఓ సీన్‌లో అక్షయ్ కుమార్ టెలిప్రాంప్టర్‌ను చూస్తూ డైలాగులు చెప్తున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ముందు అక్షయ్ కుమార్ ఈ సినిమా చేయడానికి ఇష్టం చూపించలేదు. రెండు మూడు సార్లు మంచు విష్ణు బతిమాలితే చెయ్యడానికి ఒప్పుకున్నారు. అందుకే సినిమాలో అంతంత మాత్రంగా నటించాడని నెటిజన్లు అంటున్నారు. ఎందుకు అంత బలవంతంగా చేయడం అంటూ కామెంట్లు పెడుతున్నారు. డైలాగులు నేర్చుకుని చెప్పాల్సి ఉండగా ఇలా పేలవంగా చెప్పడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తెలుగు సినిమా అంటే బాలీవుడ్ హీరోలు చిన్నచూపు చూస్తున్నారని, వారు ఏం చెప్పినా చెల్లుతుంది కదా అని, ఇలా చేయడం కరెక్టు కాదని మరికొందరు అక్షయ్ చేసిన పనిని ఎత్తి చూపుతున్నారు.
Read Also- Viral News: చనిపోయిందనుకొని శిశువును ఖననం చేస్తుండగా..
దశాబ్దాల సినీ చరిత్రలో అక్షయ్ కుమార్ అనేక మంచి సినిమాలు చేశారు. ‘పాడ్ మ్యాన్’, ‘ఓ మై గాడ్’ లాంటి విభిన్న కథాంశాలతో తెరకెక్కిన సినిమాల్లో చేశారు. ప్రస్తుతం అక్షయ్ ప్రస్తుతం ‘జాలీ ఎల్‌ఎల్‌బీ 3’, ‘వెల్‌కమ్ టు ద జంగిల్’ తదితర సినిమాల్లో నటిస్తున్నారు. ‘కన్నప్ప’ సినిమాపై ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. శివుడు, పార్వతులుగా అక్షయ్ కుమార్ కాజల్ అగర్వాల్ మెప్పించలేక పోయారన్నారు. శివయ్యగా అక్షయ్ అయితే అసలు సూట్ కాలేదన్న వార్తలు వైరల్ అవుతున్నాయి.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.