Akhanda2: ఇటీవల విడుదలైన ‘అఖండ 2’ సినిమా దేశవ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. దేశం, ధర్మం, దైవం వంటి భారతీయ శాశ్వత విలువలను నేటి తరానికి అర్థవంతంగా, ప్రభావవంతంగా చేరవేసే కథాంశంతో రూపొందిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ గౌరవనీయులైన మోహన్ భగవత్ జీ ‘అఖండ 2’ చిత్రాన్ని ప్రశంసిస్తూ, సినిమా అఖండ విజయాన్ని సాధించాలని దర్శకుడు బోయపాటి శ్రీను ని ఆశీర్వదించారు. సమాజానికి సానుకూల దిశను చూపించే, విలువలతో కూడిన చిత్రాలు మరింతగా రావాలని ఆయన ఆకాంక్షించారు.
Read also-Chiranjeevi Movie: ‘మనశంకరవరప్రసాద్ గారు’ షూటింగ్ పూర్తి.. ఎమోషన్ అయిన దర్శకుడు..
దర్శకుడు బోయపాటి శ్రీను గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ -“దేశం, ధర్మం, దైవం వంటి మూల విలువలను నేటి తరానికి గుర్తు చేయాలనే సంకల్పంతో ‘అఖండ 2’ను రూపొందించాం. ఈ ప్రయత్నానికి గౌరవనీయులైన మోహన్ భగవత్ జీ ఆశీర్వాదం లభించడం మా టీమ్ కు అపారమైన గౌరవం. ఇది మాకు మరింత బాధ్యతను, స్ఫూర్తిని ఇచ్చింది” అని తెలిపారు. భారతీయ సంప్రదాయాలు, ఆధ్యాత్మిక భావనలు, దేశభక్తి వంటి అంశాలను సమకాలీన కథన శైలితో మేళవిస్తూ రూపొందిన ‘అఖండ 2’ సినిమా ప్రేక్షకులను ఆలోచింపజేయడమే కాకుండా భావోద్వేగంగా కూడా ప్రభావితం చేస్తోంది. ముఖ్యంగా యువతలో ధర్మబోధ, ఆత్మవిశ్వాసం, సామాజిక బాధ్యతను నాటి ప్రయత్నం ఈ చిత్రంలో స్పష్టంగా కనిపిస్తుంది.
Read also-Shambala Movie: సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘శంబాల’ నుంచి ‘నా పేరు శంబాల’ సాంగ్ రిలీజ్..
ప్రస్తుతం అన్ని ప్రధాన కేంద్రాల్లో హౌస్ఫుల్ ప్రదర్శనలతో దూసుకుపోతున్న ‘అఖండ 2’, ప్రేక్షకుల మన్ననలతో పాటు విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంటూ విజయపథంలో ముందుకు సాగుతోంది. ఈ సందర్భంగా విడుదలైన ఫోటోలో దర్శకుడు బోయపాటి శ్రీను గారు, ఆర్ఎస్ఎస్ చీఫ్ గౌరవనీయులైన మోహన్ భగవత్ జీ కలిసి కనిపించడం విశేష ఆకర్షణగా నిలిచింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన అఖండ 2 సినిమా కలెక్షన్ల పరంగా కూడా దూసుకుపోతుంది. మొదటి రోజు ప్రీమియర్ల ద్వారానే ఈ సినిమా దాదాపు రూ.60 కోట్లు సాధించింది. మరిన్ని రికార్డులు అఖండ 2 ఖాతాలో వచ్చి చేరతాయని అభిమానులు ఆశిస్తున్నారు.

