Actress Simran
ఎంటర్‌టైన్మెంట్

Simran: ‘ఆంటీ రోల్స్’ అంటూ చులకనగా మాట్లాడిన నటిపై మరోసారి సిమ్రన్ షాకింగ్ కామెంట్స్

Simran: ఇటీవల సీనియర్ నటి సిమ్రన్ ఓ అవార్డుల వేదికపై సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఒక నటిని ఉద్దేశిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి. ఆ నటి ఎవరనేది ఆమె చెప్పలేదు కానీ, ఆమె తనని అవమానించినట్లుగా అయితే భావించానని తెలిపింది. ‘ఆంటీ రోల్స్’లో నటించడం కంటే అలాంటి రోల్స్‌లో నటించడం చాలా ఉత్తమం అంటూ, తను చేస్తున్న పాత్రలపై చులకనగా మాట్లాడినట్లుగా సదరు నటి గురించి సిమ్రన్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు మరోసారి ఆ నటి ప్రస్తావన తెస్తూ, సిమ్రన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే ఇప్పుడు కూడా ఆ నటి ఎవరనేది ఆమె చెప్పలేదు.

అసలింతకీ సిమ్రన్ అవార్డుల వేదికపై ఏం మాట్లాడిందంటే.. ‘‘ఇటీవల నా తోటి నటి చేసిన కామెంట్స్ నన్ను ఎంతగానో బాధించాయి. ఆమె నటించిన ఓ సినిమా చూసిన నేను, వెంటనే ఆమెకు కాల్ చేసి, ఇందులో నీ పాత్ర చాలా బాగుందని, చాలా బాగా నటించావని, నిజంగా నీ పాత్ర చూసి ఆశ్చర్యపోయానని చెప్పాను. అందుకు ఆమె థ్యాంక్స్ చెబుతుందని ఊహించాను కానీ, ‘ఆంటీ రోల్స్’ చేయడం కంటే ఇలాంటి పాత్రలు చేయడం ఉత్తమం కదా.. అంటూ సమాధానమిచ్చింది. ఎందుకో ఆమె నన్నే టార్గెట్ చేసి మాట్లాడినట్లుగా అనిపించింది.

Also Read- S Thaman: నా జీవితంలో ఎప్పుడూ ఇంత ఆనందం పొందలేదు.. థమన్ ఎమోషనల్ స్పీచ్!

అందుకే ఈ వేదికపై ఆమెకు చెబుతున్నాను.. పనికిమాలిన డబ్బా పాత్రలలో నటించే కంటే, ఆంటీ లేదా అమ్మ పాత్రలు చేసుకోవడం చాలా ఉత్తమం. దేనినీ చులకనగా చూడకూడదు’’ అంటూ చాలా అగ్రెసివ్‌గా మాట్లాడింది. అయితే, సిమ్రన్ చెప్పిన సహ నటి అన్న మాటలను గమనిస్తే.. అందులో సిమ్రన్‌ని చులకనగా మాట్లాడిందని అనుకోలేం. తనకి ఆంటీ పాత్రలు చేయడం ఇష్టం లేక, అలాంటి పాత్రలు చేస్తున్నానని సదరు నటి చెప్పి ఉండవచ్చు. ఆ మాటల్ని సిమ్రన్ మరోలా అర్థం చేసుకుని ఉండవచ్చు.. అని కొందరు విమర్శకులు సైతం చెబుతుండటం విశేషం.

తాజాగా సిమ్రన్ మరోసారి, తన తోటి నటి ప్రస్తావనను తెచ్చింది. ‘‘సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ అందరూ స్నేహితులుగా ఉంటారని, ఉంటామని చెబుతుంటారు కానీ, అది నిజం కాదు. స్వయంగా నాకు ఎదురైన అనుభవంతో చెబుతున్నాను. నా తోటి నటి ఆ రోజు చేసిన కామెంట్స్ నన్ను ఎంతగానో బాధించాయి. అందుకే ఆ విషయాన్ని అవార్డుల కార్యక్రమంలో ప్రస్తావించాను. ఎందుకంటే, కెరీర్ ప్రారంభం నుంచి నేను అప్పుడప్పుడు ఆంటీ పాత్రలు చేస్తూనే ఉన్నాను. నటి అన్నాక అన్ని రకాల పాత్రలు చేయాలి. ఏమైంది ఆంటీ పాత్రలు చేస్తే. అదేమైనా తప్పా?

Also Read- The Raja Saab: ‘ది రాజా సాబ్’ ఆగిపోయినట్టేనా? మారుతికి ఇది పెద్ద దెబ్బే!

నేను ఏ ఉద్దేశ్యంతో ఫోన్ చేశానో కూడా అర్థం చేసుకోకుండా అలా మాట్లాడవచ్చా. అందుకే చెబుతుంది. మనం స్నేహితులు అనుకున్నవాళ్లు ఒక్కోసారి వారి మాటలతో మనల్ని బాధిస్తారు. అవార్డుల కార్యక్రమంలో నేను మాట్లాడిన తర్వాత ఆ నటి మరోసారి నాకు ఫోన్ చేసింది. నేను కూడా మాట్లాడాను. కానీ, అంతకు ముందు ఉన్న రిలేషన్ అయితే ఆమెతో నాకు లేదు’’ అని సిమ్రన్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు మరోసారి దుమారాన్ని రేపుతున్నాయి. ఇంతకీ సిమ్రన్ సహనటి ఎవరా? అని అంతా ఇంకా సెర్చ్ చేస్తూనే ఉన్నారు. ‘డబ్బా’ రోల్స్ అని అంది కాబట్టి.. కచ్చితంగా సూర్య భార్య జ్యోతికను ఉద్దేశించే ఆమె ఈ వ్యాఖ్యలు చేసి ఉంటుందని అనుకుంటున్నారు. ఎందుకంటే, జ్యోతిక ఇటీవల ‘డబ్బా కార్టెల్’ అనే వెబ్ సిరీస్‌లో చేసింది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?