VV Vinayak: ‘సంక్రాంతికి వస్తున్నాం’ హిట్ తర్వాత మంచి జోష్ మీద ఉన్న విక్టరీ వెంకటేష్ వరుస ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉన్నారు. ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమా షూటింగ్ జరుగుతోంది. అంతే కాకుండా మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో రాబోతున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాలో ఓ కామియే రోల్ చేయబోతున్నారు. ఇదిలా ఉండగా మరో ప్రాజెక్ట్ కోసం సన్నాహాలు జరుగుతున్నాయి అంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. విక్టరీ వెంకటేష్, వీవీ వినాయక్ కాంబినేషన్ లో వచ్చిన లక్ష్మీ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో తెలిసిందే. తాజాగా మరోసారి ఈ కాంబో జతకట్టబోతున్నారన్న వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. వెంకీ మామ హీరోగా టాలీవుడ్ టాప్ దర్శకుడు వీవీ వినాయక్ కథ సిద్ధం చేసుకున్నారని, ఇక కథ చెప్పి ఓకే చేయ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనిని చూసిన విక్టరీ వెంకటేష్ ప్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
Read also-Pradhan Mantri Mudra Yojana: వ్యాపారం చేయాలని ఉందా? ఇలా చేస్తే ఖాతాలోకి రూ.20 లక్షలు!
ఇప్పటికే వెంకటేష్ తన తదుపరి చిత్రాన్ని మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas)తో చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా పూజా కార్యక్రమాలను స్వాతంత్ర్య దినోత్సవం స్పెషల్‌గా ముగించేశారు మేకర్స్. వాస్తవానికి ఈ ప్రాజెక్ట్‌పై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే, వెంకీ హీరోగా వచ్చిన ‘నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి’ చిత్రాలకు దర్శకత్వం ఒక్కటే చేయలేదు కానీ, అన్నీ తానై ముందుండి నడిపించారు త్రివిక్రమ్. ముఖ్యంగా ఆయన నుంచి వచ్చిన ప్రాసలు, పంచ్‌లు.. వెంకీ చెబుతుంటే, థియేటర్లలో ప్రేక్షకులు రచ్చ రచ్చ చేశారంటే.. ఏ రేంజ్‌లో అవి పేలాయో అర్థం చేసుకోవచ్చు. మరి అలాంటి వెంకీని త్రివిక్రమ్ ఇప్పుడు డైరెక్ట్ చేయబోతున్నారంటే.. సినిమాపై భారీ అంచనాలు నెలకున్నాయి.
Read also-Indian Railways: రైళ్లల్లో విచిత్రమైన సమస్య..15 వేలకు పైగా ఫిర్యాదులు.. మీరూ ఫేస్ చేశారా?
వీవీ వినాయక్ టాలీవుడ్‌లో మాస్ కమర్షియల్ సినిమాలకు పెట్టింది పేరు. కానీ ఇటీవలి కాలంలో అతని కెరీర్‌లో పెద్ద విజయాలు లేవు. వీవీ వినాయక్ గతంలో “ఆది” (2002), “ఠాగూర్” (2003), “లక్ష్మి” (2006), “కృష్ణ” (2008), “ఖైదీ నెంబర్ 150” (2017) వంటి విజయవంతమైన చిత్రాలను రూపొందించారు. అయితే, 2023లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో హిందీలో చేసిన ఛత్రపతి ఆశించిన మేరకు హిట్ అవ్వలేదు. దీంతో అప్పటినుంచి ఆయన ఏ ప్రాజెక్టును చేయలేదు. తాజాగా వెంకీ మామతో సినిమా చేస్తున్నారని వస్తున్న వార్తలతో ఆయన మళ్లీ వెలుగులోకి వచ్చారు. ఇప్పటికైనా వీవీ వినాయక్ తిరిగి బ్లాక్‌బస్టర్ సినిమాతో కమ్‌బ్యాక్ ఇస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.