Aamin Khan in Coolie
ఎంటర్‌టైన్మెంట్

Coolie Dahaa: రజనీకాంత్ ‘కూలీ’లో దహాగా ఎవరంటే.. సర్‌ప్రైజ్ అదిరింది!

Coolie Dahaa: సూపర్ స్టార్ రజనీకాంత్ (Super Star Rajinikanth) ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘కూలీ’ (Coolie). కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)తో ఎటువంటి విజయాలను అందుకుంటున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడాయన యూనివర్స్ నుంచి వస్తున్న ఈ ‘కూలీ’ చిత్రాన్ని కోలీవుడ్ ప్రతిష్టాత్మక సన్ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తోంది. ఈ ‘కూలీ’ సినిమాకు సంబంధించి వస్తున్న ఒక్కో అప్డేట్ ఒక్క సర్‌ప్రైజ్ అన్నట్లుగా ప్రేక్షకులకు కిక్ ఇస్తోంది. ‘కూలీ’ సినిమాలో రీసెంట్‌గా వచ్చిన ‘కుబేర’తో బ్లాక్ బస్టర్ అందుకున్న కింగ్ నాగార్జున పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో నాగార్జున (King Nagarjuna) నెగిటివ్ రోల్ చేస్తున్నట్లుగా స్వయంగా తనే ‘కుబేర’ ఇంటర్వ్యూలో చెబుతూ వచ్చారు. ఇప్పుడీ ‘కూలీ’ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్‌తో మేకర్స్ సర్‌ప్రైజ్ చేశారు.

Also Read- Movie Piracy: పైరసీతో టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న కిరణ్ అరెస్ట్.. ఒక్క ఏడాదిలో రూ. 3700 కోట్ల నష్టం

అది అలాంటిలాంటి సర్‌ప్రైజ్ కాదు.. అసలు ఎవరూ ఊహించని సర్‌ప్రైజ్. అదేంటంటే.. బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్‌ (Aamir Khan) ఈ ‘కూలీ’ సినిమాలో మరో ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. దీనికి సంబంధించిన అధికార ప్రకటనతో పాటు ఆమిర్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ని కూడా మేకర్స్ వదిలారు. ఇందులో ‘దహా’గా ఆమిర్ ఖాన్ (Dahaa Aamir Khan) పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ ఫస్ట్ లుక్ చూస్తుంటే.. ఆమిర్ కెరీర్‌లోనే ఇప్పటి వరకు ఇలాంటి పాత్ర చేయలేదనే ఫీల్‌ని ఇస్తుండటం విశేషం. గోల్డెన్ వాచ్, గోల్డ్ ఫ్రేం వున్న గ్లాసెస్ ధరించి సిగార్ తాగుతూ.. ఇంటెన్స్ లుక్‌లో ఆమిర్ ఖాన్ కనిపిస్తున్న ఈ పోస్టర్ విడుదలైన కాసేపటికే వైరల్‌గా మారి, అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అసలు ఆమిర్ ఇందులో నటించడమే ఒక సర్‌ప్రైజ్ అయితే.. ఆ ఫస్ట్ లుక్ మరింతగా అందరినీ ఆకర్షిస్తోంది.

Also Read- Aamir khan: కుమార్తెగా నటించిన ఫాతిమా సనాషేక్‌‌‌తో రొమాన్స్.. ఆమిర్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు

వాస్తవానికి రజనీకాంత్ సినిమాలో ఆమిర్ ఖాన్ నటిస్తున్నట్లుగా ఆ మధ్య వార్తలు వచ్చాయి కానీ, ఓన్లీ రూమర్స్‌గానే చెప్పబడ్డాయి. షారుఖ్‌తో రజనీకి మంచి అనుబంధం ఉంది కానీ, ఆమిర్‌తో చాలా తక్కువే. కానీ, ఈ కాంబినేషన్ మాత్రం అస్సలు ఊహించనిదనే చెప్పుకోవాలి. రజనీకాంత్, నాగార్జునలతో పాటు సత్యరాజ్, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, శ్రుతీ హాసన్, మహేంద్రన్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్‌ను డి. సురేష్ బాబు, దిల్ రాజు, సునీల్ నారంగ్, భరత్ నారంగ్ యాజమాన్యంలోని డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ మల్టీప్లెక్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ భారీ ధరకు సొంతం చేసుకుంది. ఇది ప్రాజెక్ట్‌పై మ్యాసీవ్ హైప్‌ను తెలియజేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ గ్రాండ్‌గా విడుదల చేసేందుకు అప్పుడే సన్నాహాల్లో ఉంది. ఈ చిత్రం 2025 ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?

Biggest Scams in India: భారతదేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్స్ ఇవే..

Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది